BigTV English

Samantha: నా కొత్త సినిమా ఆగిపోలేదు, షూటింగ్ అప్పుడే మొదలవుతుంది

Samantha: నా కొత్త సినిమా ఆగిపోలేదు, షూటింగ్ అప్పుడే మొదలవుతుంది

Samantha: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది లేడీ డైరెక్టర్స్ ఉన్నారు. వాళ్లలో నందిని రెడ్డి ఒకరు. అలా మొదలైంది సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకురాలుగా ఎంట్రీ ఇచ్చింది నందిని రెడ్డి. నాని నిత్యామీనన్ నటించిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమా తర్వాత నందినీకి మంచి అవకాశాలు వచ్చాయి.


అయితే సిద్ధార్థ్ మరియు సమంత హీరో హీరోయిన్ గా నటించిన సినిమా జబర్దస్త్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ సాధించలేకపోయింది. మళ్లీ నందిని రెడ్డి దర్శకత్వం వహించిన కల్యాణ వైభోగమే సినిమా కొంతమేరకు నందిని సక్సెస్ ట్రాక్ లోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత చేసిన ఓ బేబీ సినిమా మంచి హిట్ అయింది.

ఆ సినిమా ఆగిపోలేదు 


నందిని రెడ్డి దర్శకత్వంలో సమంత సినిమా చేస్తున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అలానే ఆ సినిమా కూడా ఆగిపోయింది అన్నట్లు ఇంకొన్ని వార్తలు వినిపించాయి. ఓ బేబీ సినిమా తర్వాత వీరి కాంబినేషన్లో రాబోతున్న సినిమా ఇది. సమంత – నందిని రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ’మా ఇంటి బంగారం’ సినిమా ఆగిపోలేదు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ సెప్టెంబర్ నుండి మొదలవుతుంది. సమంత బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తుంది. గతంలో ఓ బేబీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ఈ కాంబినేషన్ ఈసారి ఏ రేంజ్ సక్సెస్ అందుకుంటారు అని అందరికీ ఒక రకమైన క్యూరియాసిటీ మొదలైంది. రీసెంట్ గా సమంత కనిపించిన శుభం సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.

అన్నీ మంచి శకునములే 

ఇక నందిని రెడ్డి దర్శకత్వంలో వచ్చిన లాస్ట్ ఫిలిం అన్నీ మంచి శకునములే. ఈ సినిమా కమర్షియల్ గా ఊహించిన రేంజ్ సక్సెస్ సాధించక పోయినా కూడా ఇప్పటికీ చాలామందికి అది ఒక ఫేవరెట్ ఫిలిం. నందిని రెడ్డి ఒక మంచి ఫీల్ గుడ్ సినిమా తీశారు అని చాలామంది ఇప్పటికీ ఆ సినిమా గురించి మాట్లాడుకుంటారు. అలానే ఆ సినిమాకి సంబంధించి మిక్కీ జే మేయర్ అందించిన మ్యూజిక్ చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. నందిని చేసిన అంతకు ముందు సినిమా ఓ బేబీ కు కూడా మిక్కి సంగీతం అందించాడు. ఆ సినిమా సాంగ్స్ కూడా ఇప్పటికీ చాలామందికి ఫేవరెట్ అని చెప్పాలి.

Also Read: Raghava Lawrence:హీరోగా పరిచయం అవుతున్న రాఘవ లారెన్స్ తమ్ముడు, యాక్షన్ థ్రిల్లర్ తో ఎంట్రీ

Related News

Bollywood: రక్షాబంధన్ వేళ కన్నీళ్లు పెట్టిస్తున్న సుశాంత్ సింగ్ సోదరి పోస్ట్!

Niharika Konidela: మెగా బ్రదర్స్ తో నిహారిక రాఖీ సెలబ్రేషన్స్.. ఆకట్టుకున్న ఫోటోలు!

Aamir Khan Brother: ఏడాది పాటు గదిలో బంధించాడు.. ఏవేవో మందులు ఇచ్చి చిత్రహింసలు పెట్టాడు.. ఆమిర్ ఖాన్ పై సోదరుడి ఆరోపణలు

Bad Girlz : స్టేజ్‌పైనే బట్టలు విప్పేసిన హీరోయిన్లు… వామ్మో అసలు వీళ్లకు ఈ థాట్ ఎలా వచ్చిందో ?

Samantha: మరోసారి ఆ స్టార్ హీరో సినిమాలో స్పెషల్ స్టెప్పులు వేయనున్న సమంత.. తగ్గట్లేదుగా?

Film industry: ఏంటీ.. ఈ హీరోయిన్ స్కూల్ లో ఉన్నప్పుడే హీరోయిన్గా చేసిందా?

Big Stories

×