Lokesh kanakaraj : తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజు గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. తమిళంలో ఈయన తెరకెక్కించిన సినిమాలు తెలుగులో కూడా డబ్ అయ్యాయి.. దాంతో ఇక్కడ కూడా ఆయనకు మంచి మార్కెట్ ఉంది.. డైరెక్టర్ నుంచి సినిమాలు వస్తున్నాయంటే తెలుగు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ప్రస్తుతం ఈయన సూపర్ స్టార్ రజినీకాంత్ తో కూలి సినిమాని తెరకెక్కించారు.. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ మూవీ ఈనెల 14న థియేటర్లలోకి రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో రీసెంట్ గా ప్రీరిలీజ్ ఈవెంట్ ని నిర్వహించారు. అలాగే చిత్ర యూనిట్ పలు చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ డైరెక్టర్ ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో నెక్స్ట్ వెబ్ సిరీస్ లు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నట్లు బయటపెట్టారు..
లోకీ ‘ఏజెంట్ టినా’ వెబ్ సిరీస్..
లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం కూలీ. అగ్ర కథానాయకుడు రజనీకాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగార్జున, ఆమిర్ ఖాన్, శృతి హాసన్, సత్యరాజ్, ఉపేంద్ర తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.. మరికొద్ది రోజుల్లో థియేటర్లలో కి రాబోతుంది.ఈ సందర్భంగా వరుస ప్రమోషన్స్ చేస్తున్నాడు లోకేష్.. తాజాగా ఓ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నెక్స్ట్ తాను వెబ్ సిరీస్ లు కూడా చేసే ఆలోచనలో ఉన్నట్లు బయటపెట్టాడు.. ఏజెంట్ టినా క్యారెక్టర్ ఆధారంగా వెబ్ సిరీస్ తీయాలని ప్లాన్ చేస్తున్నాం. మరో దర్శకుడు దర్శకత్వం వహించబోతున్నాడు.. ఇది సక్సెస్ అయితే కంటిన్యూగా చేస్తాము అని అన్నాడు.. మరి ఈ వెబ్ సిరీస్ గురించి పూర్తి వివరాలు త్వరలోనే అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం.
Also Read : నేడు ఈడీ విచారణకు హాజరుకానున్న విజయ్ దేవరకొండ..
విలన్ గా మారబోతున్న డైరెక్టర్..
తమిళ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ లోకేష్ కనకరాజు. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల తో సినిమాలు చేశాడు.. కూలీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించునున్నాడు. ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ విలన్ గా కూడా పలు సినిమాల్లో అవకాశాలు వచ్చాయని బయట పెట్టాడు. కానీ రిజెక్ట్ చేసినట్లు చెప్పాడు. ఇక సినిమాల విషయానికొస్తే.. కూలీ సినిమా విడుదలైన వెంటనే ఖైదీ 2 సినిమా పట్టాలెక్కుతుందని లోకేష్ కనగరాజ్ తెలిపారు. ఇది లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లోని ఒక భాగమని, మొదటి సినిమా ‘ఖైదీ’కి ఇది సీక్వెల్ అని ఆయన అన్నారు. దీనికోసం 35 పేజీల వరకు తాను స్టోరీ రాసుకున్నానని.. ఆ స్టోరీ కూడా మంచిగా వచ్చిందని తెలిపాడు. గతంలో కార్తీ హీరోగా నటించిన ఖైదీ చి మంచి విజయాన్ని సాధించింది. దీనికి సీక్వెల్ గా ‘ఖైదీ 2’ను తెరకెక్కించబోతున్నాడు.. ఈ మూవీ తర్వాత ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేసే ఆలోచనలో లోకి ఉన్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా ఉంది.
#LokeshKanagaraj Recent Confirm ✅ #LCU – Web Series
– We are planning to make a web series based on the character of #AgentTina. Another director is going to direct it.
– Let's start expanding this as #BENZ starts to succeed.
pic.twitter.com/2Flf12RD6U— Movie Tamil (@MovieTamil4) August 5, 2025