Pulivendula Tensions: పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల వేళ ప్రధాన పార్టీల మధ్య దాడులు-ప్రతిదాడులు జరుగుతున్నాయి. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు వేడెక్కాయి. గతరాత్రి ఇరు పార్టీల కార్యకర్తల మధ్య దాడులు జరిగాయి. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ దగ్గర పడుతున్న వేళ పులివెందుల రాజకీయాలు వేడెక్కాయి. ఈ క్రమంలో 16 మంది పార్టీ నేతలు, కార్యకర్తలపై బైండోవర్ కేసులు నమోదు చేశారు పోలీసులు. మంగళవారం రాత్రి వైసీపీకి చెందిన కార్యకర్తలపై దాడులు జరిగాయి. గాయపడిన కార్యకర్తలను ఎంపీ అవినాష్ రెడ్డి పరామర్శించారు. కావాలని టీడీపీ నేతలు దాడి చేశారని ఆరోపించారు.
ఇండిపెండింగ్ అభ్యర్థి, వైసీపీ నేత గతరాత్రి పెళ్లి కార్యక్రమానికి హాజరయ్యారని అన్నారు ఎంపీ. అక్కడికి చేరుకున్న టీడీపీ కార్యకర్తలు వారిపై దాడులు చేశారని అన్నారు. తప్పుడు సంస్కృతికి బీజం వేస్తున్నారని, ప్రశాంతంగా ఉన్న పులివెందులను ఈ విధంగా రెచ్చగొట్టడం సరికాదన్నారు. ఇలాంటి దాడులకు ఏ మాత్రం భయపడేది లేదన్నారు.
కేవలం తమ పార్టీ కార్యకర్తలపై బైండోవర్ కేసులు నమోదు చేస్తున్నారని ఆరోపించారు. ఎంపీ అవినాష్ రెడ్డి వ్యాఖ్యలపై ఖండించారు పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి. గతరాత్రి జరిగి దాడులతో టీడీపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు.
ALSO READ: చంద్రబాబు కేబినెట్ భేటీ.. ఉచిత బస్సు, కొత్త బార్ల పాలసీపై చర్చ
వైసీపీ కార్యకర్తల మధ్య మనస్పర్థలు రావడంతో ఓ వ్యక్తి ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేశారన్నారు. ఈ క్రమంలో వైసీపీకి చెందిన కొందరు నేతలు సదరు వ్యక్తిపై దాడి చేశారన్నారు. ఆ నెపాన్ని టీడీపీపై తోసివేశారని అన్నారు. దాడులకు పాల్పడే ఉద్దేశం ఉంటే 11 మంది ఎలా నామినేషన్లు వేస్తారని ప్రశ్నించారు. గతంలో మిగతా పార్టీలు ఏవి నామినేషన్ వేసిన సందర్భాలు లేవన్నారు.
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి ఈసారి ప్రధాన రాజకీయ పార్టీల సహా 11 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ నుంచి తుమ్మల హేమంత్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి శివకళ్యాణ్‌రెడ్డి మధ్య పోరు మొదలైంది. మరో 8 మంది స్వతంత్రులు బరిల ఉన్నారు. ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పులివెందుల రాజకీయం పీక్స్‌కు చేరింది.
పులివెందులలో హై టెన్షన్..
నిన్న రాత్రి వైసీపీకి చెందిన కార్యకర్తలపై దాడి
గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను పరామర్శించిన ఎంపీ అవినాష్ రెడ్ఢి
టీడీపీ నేతలే దాడి చేశారని ఆరోపించిన అవినాష్ రెడ్ఢి
దాడితో తమకు సంబంధం లేదన్న టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి
జెడ్పీటీసీ ఉపఎన్నికల నేపథ్యంలో 16… pic.twitter.com/vy6q6m9Yav
— BIG TV Breaking News (@bigtvtelugu) August 6, 2025