బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

Revenue Corruption: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో తహసీల్దార్ డిజిటల్ కీ.. మల్దకల్ రెవెన్యూ ఆఫీస్‌లో వసూళ్ల దందా..!

Revenue Corruption: ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో తహసీల్దార్ డిజిటల్ కీ.. మల్దకల్ రెవెన్యూ ఆఫీస్‌లో వసూళ్ల దందా..!

Revenue Corruption: స్వేచ్చ బ్యూరో: ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే శాఖలో రెవెన్యూ శాఖ కీలకం. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శాఖ అవినీతిలో కూరుకుపోయింది. తహసీల్దార్‌ కార్యాలయాలు సెటిల్‌మెంట్స్‌కు అడ్డాగా మారాయి. రైతులు, ప్రజలు పైసలిస్తేనే సమస్యలు పరిష్కరిస్తున్నారన్న విమర్శలున్నాయి. కొంత మంది తహసీల్దార్లు, ప్రైవేటు ఏజెంట్లను, మీ సేవా సెంటర్ నిర్వహకులను బినామీలుగా నియమించుకుని వసూళ్లకు పాల్పడుతున్నారు. రైతు భూమిని మ్యుటేషన్‌ చేయడానికి రూ.10వేల నుంచి రూ.50వేల దాకా వసూలు చేస్తున్నారు. ప్రశ్నించేవారిని ఆర్డీవో, డీఆర్వో కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తున్నారు.కొందరు పైసలు ఇచ్చే వారి అర్జీలను మాత్రమే పరిష్కారం చూపుతున్నారు. పూర్తిస్థాయిలో వారిపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ పాలన అటకెక్కింది.

మీ సేవా సెంటర్ల దోపిడి..

జిల్లాలోని మీసేవ కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో నిర్వాహకులు ఇష్టారీతిన వసూళ్లకు పాల్పడుతున్నారు. రెవెన్యూశాఖకు సంబంధించిన కులం, ఆదాయం, స్థానిక, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ సర్టిఫికెట్లకు జారీలో మీ సేవ సెంటర్ల దోపిడి మితిమీరిపోయింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రూ.82ల చొప్పున తీసుకోవాలి. కొందరు నిర్వాహకులు మాత్రం రూ.100ల నుంచి రూ.200ల వరకు వసూలు చేస్తున్నారు. జనన ధ్రువపత్రాల దరఖాస్తుకు రూ.130లకు బదులు రూ.180లు వసూలు చేస్తున్నారు. ప్రతి దరఖాస్తు మీద రూ. 50 నుంచి రూ.100 వరకు ఎక్కువగా వసూలు చేస్తున్నారు.

ఆపరేటర్లతో కుమ్మక్కై..

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు త్వరగా రిజిస్ట్రేషన్‌ సేవలు అందించాలనే లక్ష్యంతో భూభారతి పోర్టల్‌ విధానం ప్రవేశపెట్టింది. భూమికి సంబంధించిన క్రయ, విక్రయదారులు కేంద్రాల్లో స్లాట్‌ నమోదు చేసుకొని తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలి. ప్రభుత్వానికి చెల్లించే చలానా డబ్బులు పోనూ స్లాట్‌ బుక్‌ చేసినందుకు గాను రూ. 250లు సర్వీస్‌ ఛార్జీలు తీసుకోవాలని సూచించింది. జిల్లాలో ఆన్లైన్ సెంటర్లు,పలు కేంద్రాల నిర్వాహకులు మాత్రం స్లాట్‌ బుక్‌ చేసినందుకు గాను రూ.1000 నుంచి రూ.1500 వరకు వసూలు చేస్తున్నారు. ఇంకొంతమంది నిర్వాహకులు ఏకంగా తహసీల్దార్‌ కార్యాలయంలో అధికారులతో, భూభారతి ఆపరేటర్లతో కుమ్మక్కై వివిధ రకాల ఛార్జీల పేరుతో, సిబ్బందికి డబ్బులు ఇవ్వాలని రూ.1000 నుంచి రూ. 1500 వరకు అదనంగా తీసుకుంటున్నారని ఆరోపణలు విన్పిస్తున్నాయి.

Also read: బీఆర్ఎస్ ను వెంటాడుతున్న బతుకమ్మ కుంట! హెలికాప్టర్ తో పూలు చల్లించినందుకు నజరానా నా!? ఏమిటా క‌థ‌!?

అద్దె ప్రాతిపదికన ఐడీలు..

రెవెన్యూశాఖ అధికారులు ప్రతి మీసేవ కేంద్రం నిర్వాహకుడికి ఒక ఐడీ నంబరు జారీ చేసి డిజిటల్‌ కీ అందజేస్తారు. సదరు నిర్వాహకుడు ఈ ఐడీ నంబరు ద్వారా ఆన్‌లైన్‌లో వివిధ రకాల దరఖాస్తులు నమోదు చేస్తూ మీ సేవ కేంద్రాన్ని నిర్వహించాలి. కొంత మంది వ్యక్తులు అధికారుల నుంచి మీ సేవ కేంద్రానికి సంబంధించి అనుమతి తీసుకొని ఇతరులకు ప్రతి నెలకు రూ.5 వేల నుంచి రూ. 6 వేల చొప్పున అద్దెకు ఇస్తున్నారు. ఆ బినామీ నిర్వాహకుడు ప్రజల నుంచి ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేయడంతో పాటు గతంలో జారీ చేసిన వివిధ రకాల ధ్రువపత్రాలను ఎడిటింగ్‌ చేసి అక్రమాలకు పాల్పడుతున్నారు. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి మీ సేవ కేంద్రాలపై నిఘా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. జిల్లా కేంద్రంలో అధికారికంగా అనుమతి ఉన్న ప్రదేశం కి బదులుగా మరొకచోట నిబంధనలకు విరుద్ధంగా అనధికారికంగా అంబేద్కర్ చౌక్ సెంటర్ సమీపంలో నిర్వహిస్తున్న సంబంధిత సెంటర్ నిర్వాహకుడు ఆ సెంటర్ పై ఫిర్యాదు చేసిన ఏవో కారణాలు చెబుతూ సాగదీస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.

తీరు మారని మీ సేవ సెంటర్ నిర్వాహకులు

జిల్లాలో మీసేవ కేంద్రాల నిర్వాహకులు కొంతమంది ఇష్టానురీతిగా డబ్బులు వసూలు చేస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారని ఇటీవల ఓ పత్రికలో ఓ‌ కథనం వెలువడింది. ముఖ్యంగా మల్దకల్, గట్టు మండలాలో ఉన్న మీసేవా నిర్వాహకుల ఇష్టారాజ్యంగా మారింది. తహసీల్దార్ కార్యాలయాలనే అడ్డగా మార్చుకుని అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు.స్లాట్ బుక్కింగ్ పేరుతో రైతుల‌ నుంచి అదనంగా చార్జీలు వసూళ్లు చేసి, తహసీల్దార్ కార్యాలయ అధికారులకు ఇవ్వాలంటూ బలవంతంగా వసూళ్లు చేశారంటూ ఆరోపణలు. దీనిపై స్థానిక తహసీల్దార్ వార్త రాసిన జర్నలిస్టులపై కారాలు మిరియాలు నూరారు. ఏకంగా మీ సేవా నిర్వాహకులను జర్నలిస్టులపై ఫిర్యాదు చేయాలని గట్టిగా క్లాస్ పీకారంటా‌. మీ సేవా సెంటర్ నిర్వాహకులు తప్పు చేస్తే వారించేది పోయి‌, వారి చేసే అక్రమాలను వెనకేసి రావడం పై పలు అనుమానాలకు దారీ తీసింది. ఎమ్మార్వో ప్రోత్సహాంతోనే ఇదంతా నడుస్తోందని మండల రైతులు ఆరోపిస్తున్నారు.

ప్రైవేటు వ్యక్తుల చేతిలోకి డిజిటల్ కీ..!

మల్దకల్ తహసీల్దార్‌ కార్యాలయంలో రెగ్యులర్‌ ఆపరేటర్‌ ఉన్నప్పటికి మీ సేవా నిర్వాహకులు, ప్రైవేటు వ్యక్తు లకు డిజిటల్‌ కీ అప్పగించడంపై విమర్శలు వెల్లువెత్తాయి. మీ సేవా నిర్వాహకులు తమకు కావల్సిన కులం, ఆదాయం, ఇతర దృవీకరణ పత్రాలు తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులు డిజిటల్ కీ ద్వారా అప్రూవ్ చేసుకుని వెళ్లుతున్నారు. అంతే కాకుండా ధరణి‌ రిజిష్ట్రషన్ గదిలోకి గంటల తరబడి రాకపోకలు సాగించడంపై పలు అనుమానాలకు దారితీస్తోంది. వారికి కావాల్సిన రికార్డులు తారుమారుచేయడం, వసూళ్లు చేయించడం వంటివి ఏమైనా చేస్తున్నారనే విమర్శలు. భూమి ఆన్‌లైన్‌ చేయడానికి ఎకరాకు వెయ్యి నుంచి మూడు వేలు వసూలు జరుగుతు న్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులకు ముడుపులు అందించ డంలో కొందరు మీ సేవా సెంటర్ నిర్వాహకులదే కీలకపాత్ర.

Also read: హైదరాబాద్‌లో ఘోరం.. ఫోన్ అతిగా వాడుతోందని.. భార్య తలలోకి బుల్లెట్లు దించాడు!

Related News

Illegal Mining: ముచ్చోని పల్లి రిజర్వాయర్ వద్ద మట్టి మాఫియా అరాచకం.. పట్టించుకోని అధికారులు!

RDO Promotions: తెలంగాణ రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల కలకలం.. సీఎం రేవంత్ రెడ్డికి చేరిన లేఖ!

Voter Revision: ఓటర్ల లిస్ట్ ప్రక్షాళన పై ప్రతిపక్షాల నీచ రాజకీయం.. రాంచందర్ రావు ఫైర్..!

Farmer Issues: రేవంత్ సర్కార్‌పై కవిత నిప్పులు.. సిగ్గులేని ప్రభుత్వం అంటూ ఫైర్..!

Kummara Protest: ఆలయ పూజారుల హక్కుల కోసం కుమ్మర్ల పోరాటం.. డిండి రహదారిపై భారీ ఆందోళన!

ఓవైపు ప్రధానితో.. మరోవైపు నీతి అయోగ్ భేటిలో.. రాష్ట్రాభివృద్ధికి కీలక ప్రతిపాదనలు!

Jana Sena: తెలంగాణ టార్గెట్‌గా పవన్ కళ్యాణ్ సరికొత్త వ్యూహం.. నెక్ట్స్ ప్లాన్..!

×