E-Paper
Advertisement

Voter Revision: ఓటర్ల లిస్ట్ ప్రక్షాళన పై ప్రతిపక్షాల నీచ రాజకీయం.. రాంచందర్ రావు ఫైర్..!

Voter Revision: ఓటర్ల లిస్ట్ ప్రక్షాళన పై ప్రతిపక్షాల నీచ రాజకీయం.. రాంచందర్ రావు ఫైర్..!
Advertisement

Voter Revision: స్వేచ్చ బ్యూరో: సమగ్ర ఓటర్ జాబితా సవరణపై కాంగ్రెస్, బిఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టించడం సరి కాదని బిజెపి రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎన్నికల సంఘం ఈ ప్రక్రియను చేపట్టినట్లు పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా మాత్పల్లి ప్రైవేట్ రిసార్ట్‌లో గురువారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పది సార్లు ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ జరిగిందని తెలిపారు. చనిపోయిన వారి పేర్లు, ఇతర ప్రాంతాలకు మారిన వారి పేర్లు, నకిలీ ఓట్లు, ఒకే వ్యక్తికి పలుచోట్ల ఉన్న ఓట్లను తొలగించడమే ప్రధాన లక్ష్యం కాగా ఈ ప్రక్రియ ప్రజాస్వామ్య వ్యవస్థను మరింత బలోపేతం చేస్తుందన్నారు.

నివసిస్తున్న రోహ్యాంగులు

హైదరాబాదులో అక్రమంగా నివసిస్తున్న రోహ్యాంగులు తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయన్నారు. అర్హులైన భారతీయ ఓటర్లు అందరికీ ప్రజాస్వామ్యబద్ధంగా హక్కులు అంది వస్తాయన్నారు. పశ్చిమబెంగాల్, కర్ణాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ జరిగిందని వివరించారు. తెలంగాణలో ఎన్నికల ప్రక్రియ నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమైనప్పటికీ బిజెపి పై ఆరోపణలు చేయడం రాజకీయ దివాళా కోరుతున్నామని పేర్కొన్నారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు ఎన్నికల వ్యవస్థపై ద్వంద వైఖరి ఆలంబిస్తున్నట్లు రామచంద్రరావు ఆరోపించారు. గెలిచినప్పుడు నమ్మకం వ్యక్తం చేస్తూ, ఓడినప్పుడు ఆరోపణలు చేయడం ఆ పార్టీలకు అలవాటుగా మారిందన్నారు.

Advertisement

Also read: ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దూకుడు.. రాజ్‌ కసిరెడ్డి అరెస్ట్.. తర్వాతి టార్గెట్ జగనేనా?

కేసీఆర్ పాలనలో..

ఆస్తులు, భూములు, సంక్షేమ పథకాలకు ఓటర్ జాబితా సవరణతో ఏలాంటి సమస్యలు ఉత్పన్నం కావని గుర్తు చేశారు. ప్రజల్లో ప్రతిపక్షాలు అపోహలు సృష్టించి రాజకీయాలు లబ్ధి పొందాలని ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని బిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నట్లు రామచంద్ర రావు మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్ర ప్రజలకు జరిగిందేమీ లేదని ఒక కుటుంబం మాత్రమే లబ్ధి పొందని ఎద్దేవా చేశారు. జెమిని ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ పై ప్రతిపక్షాల వైఖరి ఎంటన్నది స్పష్టమైందన్నారు.

ఎంపీ రఘునందన్ రావు..

Advertisement

ఇంకా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రతి చర్యకు బిజెపి మద్దతుగా నిలుస్తుంది అన్నారు. ఓటర్ జాబితాల ప్రక్షాళనను రాజకీయ కోణంలో చూడకూడదని ప్రజలకు సూచించారు. ఎన్నికల వ్యవస్థ పై విశ్వసనీయతను పెంచే చర్యగా ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ ముదిరాజ్, అధికార ప్రతినిధి కప్పర ప్రసాద్ రావు, బాలేష్ గౌడ్, విబీషన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Also read: Farmer Issues: రేవంత్ సర్కార్‌పై కవిత నిప్పులు.. సిగ్గులేని ప్రభుత్వం అంటూ ఫైర్..!

Related News

విద్యార్థులకు పండగే పండగ.. ఆగస్టులో ఏకంగా 10 రోజులు సెలవులు, ఇదిగో లిస్టు

బంగాళాఖాతంలో వాయుగుండం.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాల జోరు, ఆ జిల్లాలకు బిగ్ అలర్ట్

సికింద్రాబాద్ టూ సిద్దిపేట రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్!

జెన్-జీలకు మంత్రి పదవులు ఇవ్వాలి.. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ డిమాండ్!

సోషల్ మీడియా రీల్స్ నమ్మితే అంతే సంగతులు.. రాంచందర్ రావు!

కర్ణాటక అక్రమ గేట్ల వెనుక కాంగ్రెస్ సైలెంట్ డీల్: శ్రీనివాస్ గౌడ్!

జూరాల రైతులకు సర్కార్ బిగ్ షాక్.. సాగునీటి విడుదలపై నీలినీడలు!

‘మీ వీపు మీరు చూసుకోండి’.. రాహుల్ గాంధీకి డీకే అరుణ ఘాటు సెటైర్లు!

Big Stories

Advertisement
×