BigTV English

Uric Acid Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే మీ బాడీలో యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగిపోయిందని అర్థం

Uric Acid Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే మీ బాడీలో యూరిక్ యాసిడ్ విపరీతంగా పెరిగిపోయిందని అర్థం

ఆధునిక కాలంలో యువతలో యూరిక్ యాసిడ్ అధికంగా పెరిగిపోతోంది. ఈ సమస్యను హైపర్ యురిసెమియా అని పిలుస్తారు. శరీరం ఎక్కువ మొత్తంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి చేసినప్పుడు అది మూత్రం ద్వారా బయటికి పోకపోతే ఇలా అధిక యూరిక్ యాసిడ్ పేరుకు పోతుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు అధికంగా పేరుకు పోతే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడడం, కీళ్ల నొప్పులు, మూత్రపిండాలు దెబ్బతినడం, గౌట్ వంటి సమస్యలు వస్తాయి.


ప్రతి ఒక్కరి శరీరంలో యూరికి యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అయితే అది తక్కువ మొత్తంలోనే ఉత్పత్తి అవ్వాలి. ఎవరికైతే అధిక మొత్తంలో ఉత్పత్తి అవుతుందో వారికి సమీప భవిష్యత్తులో అనేక అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. యూరిక్ యాసిడ్ శరీరంలో అధికంగా పేరుకుపోతే ఆ విషయాన్ని మన శరీరం కొన్ని రకాల లక్షణాల ద్వారా తెలియజేస్తుంది.

యూరిక్ యాసిడ్ వల్ల కలిగే లక్షణాలు
శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే కనిపించే అత్యంత సాధారణ లక్షణాలలో ఆకస్మికంగా వచ్చే కీళ్లనొప్పి ఒకటి. ఆ కీళ్ల నొప్పి తీవ్రంగా అనిపిస్తుంది. ముఖ్యంగా బొటనవేలులోనే ఈ నొప్పి కనిపిస్తుంది. ఇది గౌట్ సమస్యకు సంకేతంగా చెప్పుకోవాలి. నొప్పి హఠాత్తుగా ఎక్కువగా వస్తే అది కూడా రాత్రి సమయంలో ఈ కీళ్ల నొప్పులు వస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. యూరిక్ యాసిడ్ స్ఫటికలు కీళ్లలో పేరుకుపోయినప్పుడు ఇలా నొప్పి వస్తుంది. శరీరంలో ఇన్ఫ్లమేషన్ కూడా పెరిగిపోతుంది. ఈ ప్రభావం బొటనవేలు పై పడుతుంది. అలాగే చీలమండలు, మోకాలు, కాలివేలు వంటి శరీర భాగాలలో కూడా విపరీతమైన నొప్పి వచ్చే అవకాశం ఉంది. అప్పుడు యూరిక్ యాసిడ్ స్థాయిలను వైద్యులను సంప్రదించి తనిఖీ చేసుకోవాలి.


శరీరంలో కీళ్ల చుట్టూ వాపు కనిపిస్తున్నా లేదా వేడిగా అనిపిస్తున్నా ఎర్రదనం కనిపిస్తున్నా అది యూరిక్ యాసిడ్ పేరుకుపోయిందనడానికి సంకేతంగా భావించాలి. వాపు వల్ల కీళ్లు గట్టిగా మారిపోతాయి త్వరగా కదల్లేదు.

తీవ్ర అలసట
ఏదైనా పనిచేశాక అలసిపోవడం సహజం. కానీ నిత్యం అలసిపోయినట్టు అనిపించడం, బలహీనంగా అనిపించడం వంటివి కలిగితే అది యూరిక్ యాసిడ్ స్థాయిల వల్లనేమో అని అనుమానించాలి. శరీరంలో దీర్ఘకాలికంగా ఉండే ఇన్ఫ్లమేషన్, యూరిక్ యాసిడ్ స్పటికల నిక్షేపాలు మీ శక్తి స్థాయిలను తగ్గిస్తాయి. మిమ్మల్ని బలహీనపరుస్తాయి. రోజూ రాత్రిపూట ఏడు నుంచి ఎనిమిది గంటలు నిద్ర పోయిన తర్వాత కూడా మీకు అలసిపోయినట్టు అనిపిస్తున్నా, కీళ్లల్లో అసౌకర్యంగా అనిపిస్తున్నా వైద్యులను సంప్రదించి యూరిక్ యాసిడ్ ఎంతుందో పరీక్షించుకోవాలి.

రాత్రిపూట మూత్రవిసర్జన
రాత్రిపూట మూత్ర విసర్జనకు ఎక్కువసార్లు వెళుతున్నా కూడా అనుమానించాల్సిందే. మూత్రపిండాలు శరీరంలోని అదనంగా పేరుకుపోయిన యూరిక్ యాసిడ్ తొలగించడానికి ఎక్కువగా పనిచేస్తాయి. దాని వల్లే మూత్ర విసర్జనకు ఎక్కువగా వెళ్లాల్సి వస్తుంది. మూత్రం కూడా దుర్వాసనగా, ముదురు రంగుతో వస్తున్నా లేదా రక్తం కనిపిస్తున్నా దానికి కారణం అధిక యూరిక్ యాసిడ్ స్థాయిలని భావించాలి. ఈ పరిస్థితిలో అలానే వదిలేస్తే తీవ్రమైన మూత్రపిండాల సమస్యలకు దారి తీయవచ్చు.

అధిక యూరిక్ యాసిడ్ సమస్య వల్ల కండరాలు గట్టిగా మారిపోతాయి. నొప్పిగా అనిపిస్తాయి. రోజువారీ కదలికలు కూడా కష్టతరంగా మారిపోతాయి. కండరాలు గట్టిగా పట్టేసినట్టు అవుతుంటే వైద్యులను సంప్రదించాలి.

కొంతమందిలో చర్మం ఉపరితలంపై పొట్టు లాగా రాలుతుంది. దురద కూడా పెడుతుంది. కీళ్ల చుట్టూ కూడా పుట్టు రాలడం దురద పెట్టడం కనిపిస్తుంది. యూరిక్ యాసిడ్ స్పటికాలు పేరుకుపోవడం వల్లే ఈ సమస్య కనిపిస్తుంది. చర్మం కింద గట్టిగా చిన్న చిన్న గడ్డలు కూడా కనిపించే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ పేరుకుపోయిందని చెప్పే సంకేతాలే.

తరచూ తేలికపాటి జ్వరం రావడం, శరీరం అసౌకర్యంగా అనిపించడం జరుగుతున్నా కూడా యూరిక్ యాసిడ్ పేరుకుపోయిందేమో చెక్ చేసుకోవాలి. తేలికపాటి జ్వరాలు, కీళ్ల మంటలు, కీళ్ల వాపు వంటివి శరీరంలో యూరిక్ యాసిడ్ పేరుకు పోవడానికి మరింత పెంచుతాయి. కాబట్టి పైన చెప్పిన లక్షణాలు ఏవి కనిపించినా కూడా ఓసారి వైద్యులను సంప్రదించి తగిన చికిత్సను చేయించుకోవాలి.

Related News

Pneumonia causes: న్యుమోనియా రావడానికి అసలు కారణాలివే !

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

Big Stories

×