Mahavatar Narsimha Vs Hari Hara Veeramallu: ఎన్నో అంచనాల మధ్య పవన్ కళ్యాణ్ ‘హరి హర వీరమల్లు’ మూవీ విడుదలైంది. జూలై 24న రిలీజైన ఈ చిత్రం ఫస్ట్ డే ఊహించని స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ట్రైలర్, పవన్ ఎంట్రీ మూవీపై విపరీతమైన బజ్ నెలకొంది. దీంతో ప్రీమియర్స్, ఫస్ట్ డే టికెట్స్ హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. దీంతో తొలి రోజు వరల్డ్ వైడ్ ఈ చిత్రం రూ. 51పైగా కోట్ల గ్రాస్ చేసింది. ఇక అదే జోరు చూపిస్తుందంటూ రెండో రోజు నుంచి కలెక్షన్స్ భారీగా పడిపోయాయి. దీని కారణం మూవీకి వచ్చిన టాక్. విడుదలకు ముందు పవన్.. ఈ సినిమా గురించి చెబుతూ హైప్ ఇచ్చాడు. మూవీకి వచ్చిన బజ్ తో ఫ్యాన్స్ మూడు రోజులు సినిమాను బాగా నడిపించారు. దీంతో మూడు రోజుల్లో ఈ చిత్రం రూ. 81 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్టు టాక్. పవన్ చెప్పినట్టే కథ బాగుంది.
వీరమల్లును వెనక్కి నెట్టి..
కానీ, దీనిని ప్రజెంట్ చేయడంలో టెక్నికల్ టీం, దర్శకుడు తడబడ్డారు. దారుణమై వీఎఫ్ఎక్స్ వర్క్, స్క్రీన్ ప్లే మూవీకి పెద్ద మైనస్ అయ్యింది. ఫస్టాఫ్ అంతా బ్లాక్ బస్టర్ అయితే.. సెకండాఫ్ డిజాస్టర్ అంటూ రివ్యూస్ వచ్చాయి. విమర్శలు, ట్రోల్స్ తో మూవీ నెగిటివ్ టాక్ అందుకుంది. దీంతో ఆడియన్స్ ఆసక్తి తగ్గి థియేటర్లకు వచ్చేందు ఆసక్తి చూపించడం లేదు. అయితే ఈ సినిమా పోటీగా మరుసటి రోజే ఓ డబ్బింగ్ చిత్రం విడుదలైంది. అదే మహావతార్ ‘నరసింహ స్వామి’. విష్ణు మూర్తి 11వ అవతారాలను యానిమేషన్ ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేయాలని హోంబలే ఫిలింస్ నిర్ణయంచుకుంది. అందులో భాగంగా తొలి ప్రయత్నం నరసింహా అవతారాన్ని పరిచయం చేశారు. కన్నడలో రూపొందిన ఈ సినిమా అన్ని భాషల్లో విడుదలై దూకుడు చూపిస్తోంది.
బుక్ మై షోలో సత్తా..
చిన్న సినిమాగా వచ్చి.. హరి హర వీరమల్లు వంటి పెద్ద సినిమానే వెనక్కి నెట్టింది. అన్ని భాషల్లో ఈ సినిమా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇటూ బుక్ మై షోలో.. అటూ బాక్సాఫీసు వద్ద మహావతార్ నరసింహా స్వామిదే పై చేయిగా ఉంది. నిజానికి రిలీజ్ వరకు ఇలాంటి ఒక సినిమా వస్తుందనే విషయం పెద్దగా ఎవరికి తెలియదు. సినిమాకు ఎలాంటి ప్రమోషన్స్ కూడా చేయలేదు. సైలెంట్ గా జూలై 25న థియేటర్లలో విడుదల చేశారు. జస్ట్ మౌత్ టాక్ తోనే ఈ చిత్రం ప్రస్తుతం సెన్సేషన్ చేస్తోంది. బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లు చేస్తోంది. ప్రస్తుతం ఎక్కడ చూసిన ఈ చిత్రం హవా కనిపిస్తోంది. బుక్ మై షో ఈ సినిమా మంచి రెస్పాన్స్ వస్తోంది. కేవలం ఒక గంటలోనే అన్ని భాషల్లో కలిపి దాదాపు 10 వేలకు పైగా టికెట్ల్స్ అమ్ముడుపోయాయి.
పవన్ పై గెలిచిన అల్లు అరవింద్
ఇక హరి హర వీరమల్లుకు టాక్ పెద్దగా లేకపోవడం చాలా మంది ఈ సినిమా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బుక్ మై షోలో వీరమల్లు కంటే ఈ సినిమా ఇంట్రెస్ట్స్ ఎక్కువగా ఉన్నాయి. అన్ని భాషల్లో హరి హర వీరమల్లు 24 గంటల్లో 38.6 వేల టికెట్స్ అమ్ముడుపోగా.. కేవలం ఒక గంటలోనే ఈ సినిమా పదివేల టికెట్స్ బుక్ అవ్వడం విశేషం. ఇక్కడ మరో విషయం ఏంటంటే ఈ చిత్రాన్ని తెలుగులో గీతా ఆర్ట్స్ బ్యానర్ అల్లు అరవింద్ రిలీజ్ చేశారు. దీంతో ఇక్కడ మెగా, అల్లు ఫ్యాన్స్ అంత ఈ విషయంలో వాదించుకుంటున్నారు. ముఖ్యంగా అల్లు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ పై అల్లు అరవింద్ పై చేయి సాధించారంటూ ట్రోల్ చేస్తున్నారు. ఏదేమైన.. పవన్ కళ్యాణ్ సినిమా కంటే ఓ యానిమిటేడ్ చిత్రానికి ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం మెగా, పవన్ స్టార్ ఫ్యాన్స్ నిరాశ పరిచే విషయమే అని చెప్పాలి. మరో వైపు అల్లు ఫ్యాన్స్ మాత్రం మాతో పోటీయా.. జస్ట్ యానిమేషన్ చిత్రంతోనే పైచాయి సాధించాం.. ఇక అసలు సినిమా అయితే కొట్టుకుపోవాల్సిందే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Arabia Kadali OTT: నాగ చైతన్య ‘తండేల్’ కథతో వెబ్ సిరీస్… స్ట్రీమింగ్ ఎప్పుడు అంటే?