Malla Reddy: మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఏ వేడుకకు వెళ్లినా అక్కడ సందడి మామూలుగా ఉండదు. తనదైన శైలిలో మాట్లాడుతూ.. డ్యాన్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా హైదరాబాద్‌లోని కుందన్‌పల్లిలో ఉన్న సీఎంఆర్ స్కూల్ క్రీడా మహోత్సవ్ వేడుకల్లోనూ ఆయన మరోసారి తన మార్క్ చూపించారు.
డీజే టిల్లు పాటకు అదిరిపోయే స్టెప్పులు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్లారెడ్డి, విద్యార్థులను ఉత్సాహపరుస్తూ స్టేజీపైకి వచ్చారు. అక్కడ ప్లే అవుతున్న పాపులర్ ‘డీజే టిల్లు’ పాట బీట్‌కు తగ్గట్టుగా ఒక్కసారిగా తీన్మార్ స్టెప్పులేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆయన ఎనర్జీ చూసి అక్కడున్న స్టూడెంట్స్, టీచర్లు కేకలు వేస్తూ.. చప్పట్లతో హోరెత్తించారు. వయసుతో సంబంధం లేకుండా మల్లారెడ్డి వేసిన ఈ మాస్ డ్యాన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి స్టెప్పులు
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఓ ఈవెంట్లో భాగంగా తీన్మార్ స్టెప్పులేసి మరోసారి అలరించారు. హైదరాబాద్ కుందన్‌పల్లిలోని సీఎంఆర్ స్కూల్లో నిర్వహించిన క్రీడా మహోత్సవ్‌లో మల్లారెడ్డి పాల్గొని.. డీజే టిల్లు పాటకు డాన్స్ చేశారు.… pic.twitter.com/bOeg7N4Hqk
— BIG TV Breaking News (@bigtvtelugu) November 25, 2026
Also Read: ప్రపంచంలోనే అత్యంత వింత రైళ్లు.. ఒకటి నత్తనడకన.. మరొకటి గాల్లో వేలాడుతూ!