Night watchman : సాధారణంగా క్రికెట్ లో నైట్ వాచ్ మెన్ అనేది ఒక వ్యూహం అనే చెప్పాలి. వాస్తవానికి ఒక జట్టు తమ బ్యాటింగ్ సమయంలో ఆట ముగిసే సమయానికి ఒక బ్యాటర్ ని సాధారణ బ్యాటింగ్ ఆర్డర్ కంటే ముందుగా బ్యాటింగ్ కి పంపిస్తారు. ఈ బ్యాటర్ ని నైట్ వాచ్ మెన్ అని పిలుస్తారు. అతను ఆరోజు ఆట ముగిసే సమయం వరకు వికెట్ కాపాడుతాడు.. మరుసటి రోజు ఆటను సురక్షితంగా ప్రారంభించడానికి సహాయపడుతాడు. నైట్ వాచ్ మెన్ ప్రధాన లక్ష్యం ఏంటంటే..? ఆ రోజు వికెట్ నష్టపోకుండా కాపాడటం. దీంతో మరుసటి రోజు ఆట ప్రారంభం లో బ్యాటింగ్ చేసే బ్యాటర్లకు సురక్షితమైన వాతావరణాన్ని కల్పించవచ్చు.
Also Read : Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్ జట్టులో నో ఛాన్స్ ?
ఆకాశ్ దీప్ హాఫ్ సెంచరీ..
వాస్తవానికి నైట్ వాచ్ మెన్ ఎంపిక అనేది ఒక వ్యూహాత్మక నిర్ణయం. ఇది బౌలర్ల అలసట, పిచ్ పరిస్థితి, జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పై ఆధారపడి ఉంటుంది. టెస్ట్ మ్యాచ్ ల్లో నైట్ వాచ్ మెన్ పాత్ర చాలా ముఖ్యమైనదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఇది జట్టు స్కోర్ ను మరుసటి రోజు ఆటను ప్రభావితం చేస్తుంది. తాజాగా ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లండన్ లోని ఓవల్ వేదికగా జరిగిన 5వ టెస్ట్ మ్యాచ్ లో బ్యాట్స్ మెన్ సాయి సుదర్శన్ ఔట్ కాగానే.. టీమిండియా బ్యాటర్లు అందరూ ఉన్నప్పటికీ బౌలర్ అయిన ఆకాశ్ దీప్ ని బ్యాటింగ్ కి ఎందుకు పంపారంటే నైట్ వాచ్ మెన్ డ్యూటీ అన్నట్టు. ఇంకో వికెట్ పడకుండా ఉండటానికి లోయర్ ఆర్డర్ లో ఉన్న బ్యాట్స్ మెన్ ని నైట్ వాచ్ మెన్ గా పంపిస్తుంటారు. కెప్టెన్ శుబ్ మన్ గిల్ బ్యాటింగ్ కి రాకుండా ఆకాశ్ దీప్ ను నైట్ వాచ్ మెన్ గా పంపించారు. అయితే ఆకాశ్ ఈ మ్యాచ్ లో 93 బంతుల్లో 66 పరుగులు చేశారు. తన కెరీర్ లో తొలి హాఫ్ సెంచరీ కూడా నమోదు చేసుకున్నాడు ఆకాశ్ దీప్.
ఆల్ రౌండర్ సుందర్ కీలక ఇన్నింగ్స్
ఓవల్ వేదికగా జరిగిన తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 224 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ జట్టు 247 పరుగులు చేసింది. ఇక రెండో ఇన్నింగ్స్ టీమిండియా 396 పరుగులు చేసింది. అయితే ఇంగ్లాండ్ 367 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు ఛేజింగ్ చేస్తుందని అంతా భావించారు. కానీ చివర్లో టీమిండియా బౌలర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లాండ్ ఆలౌట్ అయింది. మరోవైపు ఒక చేతికి గాయం కారణంగా ఒంటి చేతితోనే గ్రౌండ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు క్రిస్ వోక్స్. అయినప్పటికీ ఇంగ్లాండ్ జట్టు విజయం సాధించలేకపోయింది. బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడం.. బ్యాటింగ్ లో కూడా టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ అద్బుతంగా బ్యాటింగ్ చేసి 39 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 53 పరుగులు చేశాడు.