BigTV English

Athadu 4K Trailer: మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు, రీ రిలీజ్ ట్రైలర్ తో కూడా గూస్ బంప్స్

Athadu 4K Trailer: మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు, రీ రిలీజ్ ట్రైలర్ తో కూడా గూస్ బంప్స్

Athadu 4K Trailer: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ కి ఎప్పటికీ ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. అలాంటి కాంబినేషన్ లో త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్ ఒకటి. దర్శకుడుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ మొదట అతడు అనే సినిమాను చేయాలి. కథ కూడా ఓకే అయిపోయింది. కానీ త్రివిక్రమ్ మాట్లాడుతూ నేను స్రవంతి రవి కిషోర్ కి మొదటి సినిమా చేస్తాను అని మాట ఇచ్చాను. అది పూర్తి చేసి వచ్చిన తర్వాత మన సినిమా చేద్దాం అని త్రివిక్రమ్ చెప్పారు.


దానికి మహేష్ బాబు కూడా ఓకే చెప్పడంతో త్రివిక్రమ్ వెళ్లి తరుణ్ హీరోగా నువ్వే నువ్వే సినిమాను చేశాడు. ఈ సినిమా రైటర్ గా త్రివిక్రమ్ పేరు ఇంకొంచెం పెంచింది. దర్శకుడిని రైటర్ డామినేట్ చేశాడు అంటూ కొన్ని వార్తలు కూడా వినిపించాయి. ఇది బహుశా త్రివిక్రమ్ దృష్టికి చేరడం వలనేమో అతడు సినిమాలో డైలాగులు తక్కువ యాక్షన్ సీక్వెన్సెస్ ఎక్కువగా ఉంటాయి.

మహేష్ ఫ్యాన్స్ కి పూనకాలు


అతడు సినిమా కమర్షియల్ గా అప్పుడు సక్సెస్ సాధించక పోయినా కూడా ఇప్పుడు చాలామందికి ఒక ఫేవరెట్ ఫిలిం. ఈ సినిమా మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న విడుదలవుతుంది. ఈ తరుణంలో ఈ సినిమాకి సంబంధించిన హై క్వాలిటీ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఆల్రెడీ చూసిన సినిమా ట్రైలర్ ను కూడా ఎంత ఆసక్తికరంగా కట్ చేయొచ్చు అనేదానికి ఎగ్జాంపుల్ ఈ ట్రైలర్. సినిమా కథను, కథలోని క్యూరియాసిటీను ఏమాత్రం తగ్గకుండా ఈ ట్రైలర్ కట్ చేశారు. ముఖ్యంగా ట్రైలర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ కూడా థియేటర్లో వర్కౌట్ అయితే మహేష్ బాబు ఫ్యాన్స్ కి ఇది గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు.

కమర్షియల్ సక్సెస్ అవసరం 

కొన్ని సినిమాలు రిలీజ్ అయినప్పుడు అప్పుడున్న పరిస్థితులు, అప్పుడు ఆడియన్స్ థాట్ ప్రాసెస్ వలన బాక్స్ ఆఫీస్ వద్ద అనుకున్న విజయాన్ని సాధించలేవు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత ఆ సినిమాలే క్లాసిక్ అయిపోతాయి. అలాంటి సినిమాలు ప్రస్తావన వస్తే ఖచ్చితంగా వినిపించే పేర్లు అతడు మరియు ఖలేజా. రీసెంట్ గా ఖలేజా సినిమాకి ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. ఇప్పుడు అతడు సినిమాకి కూడా అదే స్థాయిలో ఆదరణ లభిస్తుంది అని అందరు నమ్ముతున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చుద్ది. యాక్షన్ సీక్వెన్సెస్ తో పాటు అద్భుతమైన కామెడీ, మంచి ఫ్యామిలీ ఎమోషన్ సీన్స్ అద్భుతంగా ఈ సినిమాలో వర్కౌట్ అయ్యాయి. ముఖ్యంగా మణిశర్మ మ్యూజిక్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈసారి బాక్స్ ఆఫీస్ వద్ద ఎంతటి సెన్సేషన్ క్రియేట్ అవుతుందో చూడాలి.

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×