BigTV English

Unique Record : ప్రపంచంలో అత్యంత పిసినారి బౌలర్ ఎవరో తెలుసా..?

Unique Record :  ప్రపంచంలో అత్యంత పిసినారి బౌలర్ ఎవరో తెలుసా..?

 Unique Record :  సాధారణంగా క్రికెట్ లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఎవ్వరూ ఎప్పుడూ ఎలా ఆడుతారో చెప్పడం కష్టమే. ముఖ్యంగా కొందరూ బ్యాట్స్ మెన్లు అద్భుతంగా బ్యాటింగ్ చేస్తే.. మరికొందరూ ఫీల్డింగ్, బౌలింగ్ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో మంచి నమ్మకం ఉన్నటువంటి ఆటగాళ్లు పొరపాట్లు చేస్తుంటారు. అధిక పరుగులు సమర్పించుకుంటారు. కొందరూ చెత్త ఫీల్డింగ్ చేయడం.. క్యాచ్ లు మిస్ చేయడం.. బౌలింగ్ చెత్తగా వేయడం… ఇలాంటివి చేస్తుంటారు. మరికొందరూ అన్ని రంగాల్లో అద్భుతాలే సృష్టిస్తారు. అలా ఓ క్రికెటర్ అద్భుతం సృష్టించి బౌలింగ్ చేసి.. అత్యంత పిసినారి బౌలర్ గా పేర్గాంచాడు అతను ఎవ్వరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read :  Thalaivasal Vijay : ఈ నటుడి ఇద్దరు అల్లుళ్లు క్రికెటర్లే.. ఐపీఎల్ లో కూడా ఆడిన ఆ ఆటగాళ్లు ఎవరో తెలుసా?

టీ-20 రికార్డులు 


టీ-20 క్రికెట్ క్రిస్ గేల్, ఆండ్రీ రస్సెల్, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, గ్లెన్ మ్యాక్స్ వెల్ వంటి చాలా మంది తుఫాన్ క్రికెటర్లను చూసింది. అయితే ఈ ఆటగాళ్లు ఆట నిర్వచనాన్ని పూర్తిగా మార్చారు. క్రికెట్ అతి చిన్న ఫార్మాట్ లో పవర్ హిట్టింగ్ బౌండరీలు కొట్టడం.. తక్కువ బంతుల్లో గరిష్ట పరుగులు చేయడం వంటి వాటికి ప్రసిద్ధి చెందింది. వెస్టిండీస్ బ్యాట్స్ మన్ ఈ ఫార్మాట్ ను ఆధిపత్యం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆడే అన్ని టీ-20 లీగ్ లలో వారికి చాలా డిమాండ్ ఉంది.  భయంకరమైన బ్యాట్స్‌మెన్ ఉన్నప్పటికీ, వెస్టిండీస్ బౌలర్ అద్భుతంగా రాణించాడు. ప్రతి బౌలర్ చేరుకోవాలనుకునే రికార్డును అతను సృష్టించాడు. ప్రస్తుత కాలంలో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అయిన జస్‌ప్రీత్ బుమ్రా కూడా ఆ బౌలర్‌కు దగ్గరగా లేడు. తక్కువ పరుగులు ఇవ్వడంలో, యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టడంలో ప్రసిద్ధి చెందిన బుమ్రా, అత్యధిక డాట్ బాల్స్ వేయడంలో చాలా వెనుకబడి ఉన్నాడు.

మొదటి స్థానంలో సునీల్ నరైన్

టీ-20 క్రికెట్ అత్యధిక డాట్ బాల్స్ వేసిన బౌలర్ల జాబితాలో వెస్టిండీస్ కి చెందిన సునీల్ నరైన్ అగ్రస్థానంలో ఉన్నాడు. వెస్టిండీస్, కోల్ కతా నైట్ రైడర్స్ తో సహా ప్రపంచంలోని పలు జట్లకు టీ-20 మ్యాచ్ లు ఆడిన సునీల్ నరైన్ కి ఎవ్వరూ దగ్గరలేరు. నరైన్ మొత్తం 12,358 బంతులు బౌలింగ్ చేశాడు. వీటిలో 5421 బాల్స్ డాట్ చేశాడు. ఇది దాదాపు 44 శాతం అన్నమాట. ఇదిలా ఉంటే.. టీమిండియా బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఏది ఏమైనప్పటికీ నరైన్ అద్భుతమైన ఆల్ రౌండర్. ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున ఆల్ రౌండ్ ప్రదర్శన కనబరుస్తాడు. కోల్ కతా ఇప్పటి వరకు చాలా మంది ఆటగాళ్లను మార్చింది.. కానీ నరైన్, ఆండ్రీ రస్సెల్ లను మాత్రం అలాగే కొనసాగించింది. అందుకే అత్యంత పిసినారి బౌలర్ గా సునీల్ నరైన్ ని పిలుస్తుంటారు.

Related News

FOX Spotted: మ్యాచ్ మధ్యలో ఎంట్రీ ఇచ్చిన వింత జంతువు… ఈ వీడియో చూస్తే నవ్వు ఆపుకోలేరు

IND vs ENG: టీమిండియాలో మొత్తం గుజరాత్ టైటాన్స్ ప్లేయర్లే…గిల్ విజయ రహస్యం ఇదేనా

Karishma Kotak : స్టేడియంలోనే బట్టలు మార్చుకున్న యాంకర్.. వీడియో చూస్తే!

Vindhya Vishaka : సిరాజ్ కెరీర్ మొత్తం కష్టాలే.. తండ్రి చనిపోయినా మ్యాచ్ ఆడాడు.. ఇప్పుడు రియల్ హీరో అయ్యాడు

Prasidh Krishna : వీడు మామూలోడు కాదు… చెప్పి మరి వికెట్ తీశాడు.. ఇంగ్లీష్ వాడి పరువు తీశాడు

Gautam Gambhir : డ్రెస్సింగ్ రూమ్ లో గౌతమ్ గంభీర్ చేసిన రచ్చ చూడండి

Big Stories

×