Metro rail security: ఒక మహిళ మెట్రో రైలు ఎక్కబోతుంటుంది. ఒక చేతిలో పర్సు.. మరో చేతిలో బ్యాగ్ తో హడావుడిగా మెట్రో ఎక్కే క్రమంలో, తలుపులు మూసే టైమ్‌కి బ్యాగ్ ఇరుక్కుంటుంది. రైలు కదలుతుంది. ఒక్కసారి ఊహించండి ఆమె ఎదుర్కొనే ఇబ్బంది. అంతేకాదు పొరపాటున చీరలు సైతం మెట్రో తలుపుల్లో మూసుకుపోయిన ఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ప్రమాదాలను అడ్డుకునేందుకు మెట్రో అధికారులు ఇప్పుడు నూతన టెక్నాలజీని పరీక్షిస్తున్నారు. ఇది మనల్ని కాపాడే కొత్త టెక్నాలజీ అని చెప్పొచ్చు. ఇంతకు ఆ టెక్నాలజీ ఏమిటి? ఎలా పని చేస్తుంది? తెలుసుకుందాం.
మెట్రో స్టేషన్లలో రోజూ లక్షల మందికి పైగా ప్రయాణికులు రద్దీగా కనిపిస్తుంటారు. అటువంటి సమయంలో వేగంగా దిగుతూ ఎక్కే ప్రయాణికులు తమ దుస్తులు, బ్యాగులు మెట్రో గేట్లలో ఇరుక్కోవడం, అతి అరుదుగా అయినా ప్రమాదాలు జరగడం వంటి సమస్యలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా చీరలు, బ్యాగులు, చేతి సంచులు లాంటి వస్తువులు మెట్రో గేట్లలో చిక్కుకోవడం గతంలో కొన్ని ప్రమాదాలకు దారితీసింది. ఈ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత కోసం మెట్రో కొత్తగా ‘యాంటీ డ్రాగ్ సిస్టమ్’ అనే టెక్నాలజీని తెచ్చింది.
యాంటీ డ్రాగ్ సిస్టమ్ అంటే ఏమిటి?
ఇది ఒక సెన్సార్ ఆధారిత బ్రేకింగ్ సిస్టమ్. ఎక్కడైనా మెట్రో గేట్ మూసే సమయంలో దుస్తులు, బ్యాగులు ఇరుక్కుంటే వెంటనే రైలు ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. ఇది పూర్తిగా AI ఆధారంగా పనిచేసే వ్యవస్థ. ట్రైన్ గేట్ మూసే సమయంలో ఏ వస్తువు ఆ గేటులో ఇరుక్కుందో తెలుసుకుని, వెంటనే ట్రైన్‌కు బ్రేక్ వేయగలుగుతుంది. ఇది ప్రయాణికులను ప్రమాదాల నుంచి కాపాడే అత్యంత ఆధునిక టెక్నాలజీ.
ప్రయోగాత్మకంగా ప్రారంభించిన పరీక్షలు
ఇప్పటికే మెట్రో రైలు నిర్వాహకులు ఈ సాంకేతికతను ప్రయోగాత్మకంగా కొన్ని ప్రత్యేక ట్రైన్లలో ప్రవేశపెట్టారు. రైలు గేట్ల దగ్గర ఉన్న సెన్సార్‌లు తగిన పరికరాలతో కలిపి పరీక్షలు చేస్తున్నారు. ఇరుక్కున్న వస్తువు ఉండగానే రైలు కదలకుండా ఆగిపోవడం వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ప్రయోగాల ఫలితాలు సానుకూలంగా రావడంతో మరిన్ని మెట్రో రూట్లలో దీన్ని త్వరలో అమలు చేయనున్నట్టు అధికారులు తెలిపారు.
ప్రమాదాలపై చెక్
ఇంతవరకు దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కొంతమంది ప్రయాణికులు మెట్రో గేట్లలో ఇరుక్కొని గాయపడిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నపిల్లలు ఎక్కువగా ఇలాంటి ప్రమాదాలకు గురవుతున్నారని గణాంకాలు చెబుతున్నాయి. ఒకసారి గేట్‌లో దుస్తులు ఇరుక్కుంటే ప్రయాణికుడు దిగి వెళుతున్నా రైలు నడుస్తూ ఉండడం వల్ల వారి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోంది. దీన్ని అరికట్టాలన్నదే ఈ టెక్నాలజీ ప్రధాన ఉద్దేశ్యం.
Also Read: IRCTC updates: గుడ్ న్యూస్ చెప్పిన రైల్వే మంత్రి.. రైళ్లకు జనరల్ బోగీల పెంపు.. ఎప్పుడంటే?
ప్రయాణికుల భద్రతే లక్ష్యం
ఈ టెక్నాలజీ అమలుతో ప్రయాణికులకు మరింత భద్రత కలుగుతుంది. కేవలం గేట్ మూసే సమయంలోనే కాదు, ట్రైన్ కదులుతున్న సమయంలో ఏదైనా వస్తువు ఇరుక్కుంటే కూడా ట్రైన్‌ను తక్షణం ఆపేసే విధంగా వ్యవస్థను రూపొందిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా త్రైఫేజ్ మోటార్లను, సెన్సింగ్ కంట్రోల్ యూనిట్లను అమర్చుతున్నారు. అంతేకాకుండా డ్రైవర్‌కు వెంటనే అలర్ట్ వెళ్ళేలా సిస్టమ్ పనిచేస్తుంది.
ఇతర నగరాలకు వ్యాప్తి?
ఈ టెక్నాలజీ విజయవంతమైతే, దేశంలోని ఇతర మెట్రో నగరాలకూ ఈ వ్యవస్థను విస్తరించనున్నారు. ప్రయాణికుల భద్రత విషయంలో కాంప్రమైజ్ చేయకుండా, ఆమోదయోగ్యమైన ఖర్చుతో ఈ టెక్నాలజీని అందుబాటులోకి తేనున్నారు. దీని వల్ల మెట్రో ట్రావెల్ మరింత సురక్షితం కానుంది. ప్రయాణం సురక్షితంగా ఉండాలంటే ఇటువంటి ఆధునిక టెక్నాలజీలు తప్పనిసరి. చిన్న చిన్న సమస్యలు పెద్ద ప్రమాదాలకు దారితీయవచ్చు. అందుకే, ప్రతీ చిన్న అంశాన్ని పట్టించి, వాటికి పరిష్కారం తీసుకురావడమే మెట్రో అధికారుల లక్ష్యం. బ్యాగ్ ఇరుక్కుంటే బ్రేక్ వేయగలిగే మెట్రో టెక్నాలజీ నిజంగా అద్భుతం. ఇది ప్రయాణికుల భద్రతకు గొప్ప ముందడుగు!