Undertaker – Bigg Boss 19: ఎన్ని రియాలిటీ షోస్ వచ్చినా కూడా బిగ్ బాస్ అనే రియాల్టీ షో కి ఒక ప్రత్యేకత ఉంది. ఆ షో కి వచ్చిన ఆదరణ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. కేవలం ఒక లాంగ్వేజ్ అని కాకుండా అన్ని లాంగ్వేజ్ లో కూడా ఈ షో కి మంచి ఆదరణ లభిస్తుంది. ఇక ప్రస్తుతం తెలుగులో కూడా ఈ షోను విపరీతంగా ఫాలో అయ్యే ఆడియన్స్ ఉన్నారు.
అలానే తమిళ్ హిందీలో కూడా ఈ షో బాగా ఫేమస్. హిందీ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం జరుగుతున్న షో కి సల్మాన్ ఖాన్ హోస్టుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో వచ్చిన బిగ్ బాస్ సీజన్స్ హైయెస్ట్ టిఆర్పి రేటింగ్స్ ను బాలీవుడ్ లో కూడా నమోదు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న హిందీ బిగ్ బాస్ సీజన్ లో ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ జరగనున్నట్లు తెలుస్తోంది.
బిగ్ బాస్ లో బిగ్గెస్ట్ ట్విస్ట్
హిందీ బిగ్ బాస్ షో కి సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ రియాలిటీ షో కి సల్మాన్ ఖాన్ తో పాటు wwe అండర్ టేకర్ ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం వినిపిస్తుంది.
అండర్ టేకర్ అసలు పేరు మార్క్ విలియం కాలవే. కానీ రింగ్ పేరు మాత్రం ది అండర్‌టేకర్ తో అందరికీ పరిచయం. ఇతను ఒక అమెరికన్ రిటైర్డ్ బాక్సర్. ఇతను బాక్సర్స్ లో గొప్ప బాక్సర్ గా పేరుపొందాడు
వరల్డ్ క్లాస్ ఛాంపియన్‌షిప్ రెజ్లింగ్ (WCCW) అడుగుపెట్టిన డి అండర్టేకర్ బాక్సర్ గా శిక్షణ తీసుకున్నాడు. డి అండర్ టేకర్ 1989లో తన మొదటి మ్యాచ్ ఆడాడు. WWFలో చేరిన తర్వాత కాలవే “ది అండర్‌టేకర్”గా రీబ్రాండ్ చేయబడింది. ఇతను 30ఏళ్ల కుస్తీ జీవితంలో చాలా మ్యాచ్లో ఆడాడు. 2020లో బాక్సింగ్ కి రిటైర్మెంట్ ఇచ్చాడు.
మొత్తానికి ఈ అండర్ టేకర్ ఇప్పుడు హిందీ బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్ తో పాటు స్టేజ్ పంచుకొని ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
Also Read: Chiru Odela : జీవితకాలం ఆడే సినిమా చిరంజీవి, ఏం ఎలివేషన్ ఇచ్చావ్ అయ్యా