Pawan kalyan : టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే యూత్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు.. ఈయన తో స్క్రీన్ ని షేర్ చేసుకోవాలని ఎంతో మంది హీరోయిన్లు ఎన్నో ఏళ్లుగా వెయిట్ చేస్తూ ఉంటారు. అలాంటిది ఓ స్టార్ హీరో భార్య మాత్రం పవన్ కళ్యాణ్ సినిమాకు నో చెప్పిందని ఓ వార్త నెట్టింట ప్రచారంలో ఉంది. అదేంటి పవన్ కళ్యాణ్ తో సినిమా చేయననిందా? ఎందుకు ఏదైనా పర్సనల్ కారణాలు ఉన్నాయా? లేదా డేట్స్ కుదరక? లేదా మరి ఏదైనా బలమైన కారణం ఉందా? ఇలాంటి సందేహాలు జనాలకు రావడం కామన్.. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? పవన్ కళ్యాణ్ సినిమాను ఎందుకు రిజెక్ట్ చేసిందో తెలుసుకుందాం..
పవన్ కళ్యాణ్ సినిమాను రిజెక్ట్ చేసిన హీరోయిన్..
సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేసింది. బాలీవుడ్ లో బాగా బిజీగా ఉన్న ఈమె తెలుగులో కేవలం కొద్ది సినిమాలు మాత్రమే చేసింది. పవన్ కళ్యాణ్ తో రెండు చిత్రాల్లో నటించాల్సింది. కానీ ఆ రెండు చిత్రాలను నమ్రత రిజెక్ట్ చేశారు.. మెగా బ్రదర్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్. మొదటగా నటించిన ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రంతో నటుడిగా తన కెరీర్ ప్రారంభించారు.. తొలిప్రేమ చిత్రంతో పవన్ కి యువతలో క్రేజ్ పెరిగింది. ఆ తర్వాత పవన్ బద్రి, తమ్ముడు లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. ఖుషి మూవీతో పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా అవతరించారు.. పూరీ జగన్నాథ్.. పవన్ కళ్యాణ్ బద్రి చిత్రం కోసం హీరోయిన్ పాత్ర కోసం నమ్రతని అప్రోచ్ అయ్యారట. నమ్రతకి కథ చాలా బాగా నచ్చింది.
అప్పుడు ఆమె బిజినెస్ షెడ్యూల్ లో ఉండడంతో ఈ సినిమాకి నువ్వు చెప్పింది అంట.. ఆ తర్వాత మరోసారి పవన్ కళ్యాణ్ తో నటించే అవకాశం నమ్రత కు దక్కింది. పవన్ కళ్యాణ్, కరుణాకరన్ కాంబినేషన్ లో రెండోసారి తెరకెక్కిన చిత్రం బాలు. ఇందులో కూడా ఆమె నటించలేదు.. అలా బిజీగా ఉన్న నేపథ్యంలో ఆమె పవన్ తో సినిమాలు చెయ్యలేదు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది..
Also Read :డైరెక్టర్- హీరో మధ్య గొడవ.. షూటింగ్ మధ్యలో వెళ్ళిపోయిన మహేష్..?
పవన్ కళ్యాణ్ సినిమాల విషయానికోస్తే..
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా బాధ్యతలు చేపట్టారు.. అదే విధంగా ఆయన గతంలో కమిటీ అయిన చిత్రాల ను పూర్తిచేసే పనిలో ఉన్నారు.. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు మూవీ ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అలాగే ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు కూడా చేస్తున్నారు. వచ్చే ఏడాది సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.