BigTV English

OTT Movie : సక్సెస్ ఫుల్ అమ్మాయిలను మాత్రమే అత్యంత కిరాతకంగా చంపే కిల్లర్… ఓటీటీలో దుమ్మురేపుతున్న రాధికా ఆప్టే సైకో థ్రిల్లర్

OTT Movie : సక్సెస్ ఫుల్ అమ్మాయిలను మాత్రమే అత్యంత కిరాతకంగా చంపే కిల్లర్… ఓటీటీలో దుమ్మురేపుతున్న రాధికా ఆప్టే సైకో థ్రిల్లర్

OTT Movie : స్పై థ్రిల్లర్ అనగానే జేమ్స్ బాండ్ లాంటి హాలీవుడ్ సినిమాలే ఎక్కువగా గుర్తొస్తాయి. కానీ మన దర్శకులు ఇప్పుడు ఇలాంటి సినిమాల విషయంలో ఆరితేరిపోయారు. ప్రతీ 5 నిమిషాలకు ఓ ట్విస్ట్ తో నరాలు కట్ అయ్యే సస్పెన్స్ తో సినిమాలు తీస్తూ, ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నారు. కొన్నాళ్ల క్రితం తెరపైకి వచ్చిన అలాంటి మూవీనే ఈరోజు మన మూవీ సజెషన్. మరి ఈ మూవీని ఏ ఓటీటీలో చూడొచ్చు ? కథేంటి? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం పదండి.


జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్

ఈ మూవీ పేరు “మిసెస్ అండర్‌కవర్” (Mrs Undercover). 2023లో విడుదలైన హిందీ భాషా స్పై కామెడీ-థ్రిల్లర్ చిత్రం ఇది. ప్రస్తుతం జీ5 (Zee5) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. అనుశ్రీ మెహతా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం, ఒక సాధారణ గృహిణిగా కనిపించే స్పై ఏజెంట్‌ కథ. డబుల్ లైఫ్‌ కామెడీ, యాక్షన్, స్త్రీ శక్తి సందేశంతో తెరకెక్కిన ఈ సినిమాలో రాధికా ఆప్టే ప్రధాన పాత్రలో నటించింది. ఈ సినిమా సమాజంలో స్త్రీలపై ఉన్న స్టీరియోటైప్‌లను సవాలు చేస్తూ, ఒక సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవడానికి ఒక మాజీ ఏజెంట్‌ ఏం చేసిందన్నదాన్ని చూపిస్తుంది. ఈ చిత్రం కొల్‌కతా నేపథ్యంలో రూపొందింది. రాధికా ఆప్టే (దుర్గా), సుమీత్ వ్యాస్ (అజయ్/కామన్ మ్యాన్), రాజేష్ శర్మ (రంగీలా), సాహెబ్ ఛటర్జీ (దేబ్), లబోనీ సర్కార్ (దుర్గా అత్తమ్మ), రోష్ని భట్టాచార్య (ఆయేషా) కీలక పాత్రలు పోషించారు.


కథలోకి వెళ్తే…

కొల్‌కతాలో ఉంటున్న దుర్గా (రాధికా ఆప్టే) ఒక సాధారణ గృహిణి. తన భర్త దేబ్ (సాహెబ్ ఛటర్జీ), కొడుకు, అత్తమామలతో కలిసి జీవిస్తుంది. ఆమె వాస్తవానికి ఒక స్పై ఏజెంట్. కానీ గత 13 సంవత్సరాలుగా ఆమె తన గూఢచారి జీవితాన్ని విడిచిపెట్టి, గృహిణిగా స్థిరపడింది. భర్త దేబ్ ఒక సాంప్రదాయవాది, స్త్రీలు ఇంట్లోనే ఉండాలని నమ్ముతాడు. పైగా ఆమెను తరచూ తక్కువ చేసి మాట్లాడతాడు. అదే సమయంలో “కామన్ మ్యాన్” (సుమీత్ వ్యాస్) అనే సీరియల్ కిల్లర్ ఇండిపెండెంట్, సక్సెస్ ఫుల్ మహిళలను లక్ష్యంగా చేసుకుని హత్యలు చేస్తుంటాడు. అతను తన బాధితుల ఫోన్‌లలో వీడియోలు రికార్డ్ చేసి, వారి స్వతంత్రతను అవమానిస్తాడు. ఇక ఈ క్రమంలోనే స్పెషల్ ఫోర్సెస్ చీఫ్ రంగీలా (రాజేష్ శర్మ) దుర్గాను తిరిగి మిషన్‌లోకి రప్పించడానికి ఆమెను సంప్రదిస్తాడు.

ఎందుకంటే ఇతర ఏజెంట్లు కామన్ మ్యాన్ చేతిలో చనిపోయారు. దుర్గా మొదట నిరాకరిస్తుంది, ఎందుకంటే ఆమె తన గృహిణి జీవితానికి అలవాటు పడిపోయింది. కానీ రంగీలా ఆమెను ఒప్పిస్తాడు. ఆమె తన మిషన్ కోసం కొల్‌కతా గర్ల్స్ కాలేజీలో స్త్రీ సాధికారత కార్యక్రమంలో చేరుతుంది, అక్కడ కామన్ మ్యాన్ అజయ్ ఒక ప్రొఫెసర్‌గా పని చేస్తూ, తన తదుపరి బాధితులను ఎంచుకుంటాడు. దుర్గా అక్కడ అజయ్ కి చెందిన ఓ అమ్మాయితో స్నేహం చేస్తుంది. కానీ ఆ అమ్మాయి హీరోయిన్ భర్తనే చంపడానికి ప్లాన్ చేస్తుంది. ఇంతకీ హీరోయిన్ తన భర్తను ఎలా కాపాడుకుంది ? అసలు కిల్లర్ ను పట్టుకోగలిగిందా ? క్లైమాక్స్ లో అజయ్ ప్లాన్ చేసిన బిగ్గెస్ట్ బ్లాస్ట్ ఏంటి? అనేది స్టోరీ.

Read Also : పెళ్ళైన అమ్మాయిలతోనే మగ దెయ్యం పాడు పనులు… కల్లోకి వచ్చి మరీ ఈ అరాచకం ఏంటి భయ్యా ?

Related News

OTT Movie : ట్రిప్పుకెళ్లి టీచర్ తో అర్ధరాత్రి అరాచకం… సైకో ట్రాప్ లో అడ్డంగా బుక్కయ్యే అమాయకురాలు… బెస్ట్ సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : విమానంలో వైరస్ లీక్… పిచ్చోడు చేసే మెంటల్ పనికి పైప్రాణాలు పైనే… సీను సీనుకో ట్విస్ట్ మావా

OTT Movie : భర్త చనిపోయాడని చెప్పి భార్యను లాక్కునే ఆఫీసర్… అతను తిరిగొచ్చి ఇచ్చే ట్విస్టుకు ఫ్యూజులు అవుట్

OTT Movie : మనుషుల్ని చూస్తుండగానే మసి చేసే సైకో… ఎవెంజర్స్ ను మించిన శక్తి… ఓటీటీలో గత్తరలేపుతున్న సూపర్ హీరో మూవీ

OTT Movies: దొంగచాటుగా పక్కింటి అమ్మాయిని ‘అలా’ చూస్తాడు.. తర్వాత వాడికి నరకమే, సినిమా మొత్తం అలాంటి సీన్లే!

OTT Movie : ట్రాప్ చేసి పాడు పనులు… ఈ కేటుగాళ్ల టార్గెట్ అమ్మాయిలే… దిమాక్ ఖరాబ్ చేసే రియల్ రివేంజ్ స్టోరీ

Big Stories

×