BigTV English

Youtuber Arrest: యూట్యూబ్ లో వంటల వీడియోలు పోస్ట్ చేస్తున్నారా? ఐతే ఇది మీకోసమే

Youtuber Arrest: యూట్యూబ్ లో వంటల వీడియోలు పోస్ట్ చేస్తున్నారా? ఐతే ఇది మీకోసమే

యూట్యూబ్ లో వంటల వీడియోలు పోస్ట్ చేయడం చాలామందికి అలవాటు. పేరు గొప్ప చెఫ్ లే కాదు, చేయి కాల్చుకునే సగటు ఇన్ ఫ్లూయెన్సర్లు కూడా తమ పాక శాస్త్ర ప్రావీణ్యాన్ని యూట్యూబ్ లో అందరితో పంచుకుంటారు. సాంప్రదాయ వంటకాలతో కొందరు ఫేమస్ అయితే, పిచ్చి పిచ్చి వెరైటీలు, ప్రయోగాలు చేస్తూ మరికొందరు అందర్నీ ఆకట్టుకుంటారు. అయితే ఎవరు ఏ ప్రయోగం చేసినా, కొన్నిటికి మాత్రం దూరంగా ఉండాలి. లేకపోతే ఇదిగో రూపా నాయక్ లాగా జైలుపాలు కావాల్సి వస్తుంది.


రూపా నాయక్ ఏం చేశాడు?
ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాకు చెందిన రూపానాయక్ ఓ అప్ కమింగ్ యూట్యూబర్. వంటల వీడియోలతోపాటు ట్రావెల్ వ్లాగ్ లు కూడా చేస్తుంటాడు. ఎప్పట్నుంచో తన కు బ్రేక్ రావాలని చూస్తున్నాడు. ఆ అవకాశం రానే వచ్చింది. అయితే బ్రేక్ రావడంతోపాటు అతడు జైలుకెళ్లాల్సిన అగత్యం కూడా ఏర్పడింది. అరుదైన బల్లి మాంసాన్ని వండి ఆ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేశాడు రూపా నాయక్. ఆ వీడియో మిలియన్లలో వ్యూస్ సాధించింది. కానీ ఏం లాభం, అంతలోనే పోలీసులు కూడా ఫోన్ చేశారు, ఎక్కడున్నావని అడిగారు. అటవీశాఖ అధికారులు రూపా నాయక్ ని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశ పెట్టారు.

అరుదైన బల్లి..
రూపా నాయక్ ది ఒడిశాలోని మయూర్బంజ్ జిల్లా అసన్‌ బాని గ్రామం. భద్రక్‌ ప్రాంతానికి వెళ్లి వస్తుండగా బంటా అనే ఏరియాలో రోడ్డు పక్కన చనిపోయిన ఓ పెద్ద అడవి బల్లిని చూశాడు. అది చనిపోయి పడి ఉంది. చనిపోయిందే కదా అని దాన్ని తన ఇంటికి తెచ్చాడు. ఆ పెద్ద బల్లిని ముక్కలుగా కట్ చేసి రుచికరమైన కూర తయారు చేశాడు. ఆ వీడియోని ఫేస్ బుక్, యూట్యూబ్ లో అప్ లోడ్ చేశాడు. ఆ పెద్ద బల్లిని ముక్కలుగా కోసి కూరవండటాన్ని చాలామంది చూసి ఆశ్చర్యపోయారు. టేస్ట్ ఎలా ఉందంటూ కామెంట్లు పెట్టారు, అది ఎక్కడ దొరుకుతుందని ఆరా తీశారు. అసలు విషయం ఏంటంటే.. అది రక్షిత జంతువుల జాబితాలో ఉంది. దాన్ని వేటాడటం నిషేధం. దీంతో అటవీశాఖ అధికారులు రంగప్రవేశం చేశారు. ఆ బల్లిని ఎక్కడ్నుంచి తెచ్చావని అడిగారు. చనిపోయిన దాన్ని తీసుకొచ్చి కూర వండానని చెప్పినా వినలేదు. నువ్వే చంపేసి ఉంటావని అనుమానం వ్యక్తం చేశారు. చివరకు చేసేదేం లేక పోలీస్ స్టేషన్ కి వెళ్లాడు రూపా నాయక్.


నాయక్‌పై వన్యప్రాణుల రక్షణ చట్టం, 1972లోని సెక్షన్లు 2(16)(a)(b), 9, 39(1)(b), 48(a)(b), 50(1) కింద కేసు నమోదు చేశారు అధికారులు. ఠాకూర్ముండా ఫారెస్ట్ రేంజ్ పరిధిలో ఈ కేసు నమోదైంది. తర్వాత అతడిని కోర్టులో హాజరు పరచగా, న్యాయమూర్తి రిమాండ్ విధించాడు. దారిలో చనిపోయిన బల్లిని చూసి తనమానాన తాను పోకుండా, దాన్ని ఇంటికి తీసుకొచ్చి, కూరవండి, సోషల్ మీడియా ద్వారా అందరికీ ఆ వీడియోను చూపించిన రూపా నాయక్ చివరకు కటకటాలపాలయ్యాడు. వంటల వీడియోలు పోస్ట్ చేసే వారందరికీ ఇది ఓ గుణపాఠం అని చెప్పక తప్పదు.

Related News

Delhi Metro: ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్దరు మహిళల దుమ్మురేపే గొడవ.. వీడియో వైరల్!

Viral dance video: ముక్కాల ముక్కాబుల పాటకు డ్యాన్స్ దుమ్ముదులిపేశారు.. వీడియో చూస్తే వావ్ అనాల్సిందే..!

Octopus video: అద్భుతమైన వీడియో.. తనను కాపాడినందుకు అక్టోపస్ ఎలా థ్యాంక్స్ చెప్పిందో చూడండి..!

Viral Video: రీల్ కోసం ఫ్లై ఓవర్ మీది నుంచి దూకిన యువకుడు.. కాళ్లు రెండూ…

Viral reels video: రీల్స్ పిచ్చి.. నడిరోడ్డుపై డాన్స్.. పోలీసులు కూడా షాక్!

Big Stories

×