E-Paper
Advertisement

కోనసీమలో చంద్రబాబు పర్యటన.. తుఫాన్ బాధితులకు గుడ్ న్యూస్.. అధికారులకు కీలక ఆదేశాలు!

కోనసీమలో చంద్రబాబు పర్యటన.. తుఫాన్ బాధితులకు గుడ్ న్యూస్.. అధికారులకు కీలక ఆదేశాలు!
Advertisement

CM Chandrababu: డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలోని తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటించారు. పర్యటనలో భాగంగా గచ్చకాయలపొర గ్రామంలో ఏర్పాటు చేసిన పునరావాస శిబిరాన్ని సందర్శించి బాధితులను నేరుగా పరామర్శించారు. స్థానిక అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి తమను సకాలంలో పునరావాస కేంద్రాలకు తరలించారని బాధితులు సీఎంకు తెలిపారు.

బాధితుల సమస్యలపై కలెక్టర్‌కు ఆదేశాలు

పరిశీలన సందర్భంగా పలువురు మహిళలు తమ నివాస పాకలు తుఫాన్ దాటికి పడిపోయాయని సీఎం దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి.. కూలిపోయిన పాకలను వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. అలాగే ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న పేదలకు నిబంధనల ప్రకారం పట్టాలిచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు.

Advertisement

మత్స్యకారుల విన్నపం.. సీఎం స్పందన

బోట్లకు రిజిస్ట్రేషన్లు లేకపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మత్స్యకారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అటు చేపలు పట్టేందుకు వెళ్లే సమయంలో పడుతున్న కష్టాలను సైతం సీఎంకు వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి.. బోట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియకు అవసరమైన అన్ని చర్యలు తక్షణమే చేపట్టాలని కలెక్టర్‌కు మార్గదర్శకాలు జారీ చేశారు. బాధితులు తెలిపిన దీర్ఘకాలిక సమస్యలు, కాలువల పూడికల వల్ల నీరు సముద్రంలోకి వెళ్లక ఎదురవుతున్న ఇబ్బందులను కూడా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

బాధితులతో కీలక అంశాల ప్రస్తావన

Advertisement

పునరావాస కేంద్రంలో బాధితులతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పలు కీలక విషయాలను పంచుకున్నారు తుఫాన్ తుఫాన్ ఏయే గ్రామాలపై పడుతుందో నిరంతరం సమీక్షిస్తూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేయింబవళ్లు పనిచేశామని తెలిపారు. సుమారు 30 వేల మంది అధికారులను సమాయత్తం చేసి ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాన్ని నివారించగలిగామన్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కొందరు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. మరోవైపు ఆఫీసుల్లో కూర్చొని ఎన్ని సమీక్షలు చేసినా.. క్షేత్రస్థాయికి వస్తేనే వాస్తవాలు తెలుస్తాయని సీఎం చంద్రబాబు అన్నారు. పాలనా యంత్రాంగం పనితీరుపై స్పష్టత వస్తుందని పేర్కొన్నారు.

విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు తెలంగాణ సాయం

తుఫాన్ వల్ల రోడ్లపై కూలిన చెట్లను తొలగించి రాకపోకలను పునరుద్ధరించినట్లు సీఎం తెలిపారు. ఒక్క కోనసీమ జిల్లాలోనే దాదాపు 8 వేల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయని విద్యుత్ సరఫరాను త్వరగా పునరుద్ధరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కూడా విద్యుత్ సిబ్బందిని పంపుతోందని వెల్లడించారు. సహజ విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వ యంత్రాంగం అద్భుతంగా పనిచేసిందని కొనియాడారు.

Also Read: జియో ఆల్ రౌండర్ ప్లాన్.. రూ.399 కే అపరిమిత 5G, కాల్స్, ఓటీటీలు.. రూ.39,000 విలువైన సేవలు ఫ్రీ!

నాటి హరికెన్ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న సీఎం

గతంలో వచ్చిన హరికెన్ తుఫాన్ సమయంలో రైతులు తనను కలిసిన రోజులను సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ సమయంలో అధికారుల హెచ్చరికలను పక్కనపెట్టి తన ప్రాణాలకు తనదే బాధ్యత అని చెప్పి మరీ రోడ్డుపైనే హెలికాప్టర్ ల్యాండ్ చేయించిన విషయాన్ని ప్రస్తావించారు. నాటి విపత్తు సమయంలో రాజమండ్రిలోనే వారం రోజుల పాటు ఉండి సాధారణ పరిస్థితులు నెలకొన్నాకే హైదరాబాద్ వెళ్లానన్నారు. నాటి కంటే ఇప్పుడు ప్రజల కోసం మరింత ఎక్కువగా శ్రమిస్తున్నానని తెలిపారు. ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా పాలన అందించడమే తన అంతిమ లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు.

Also Read: రూ.200 లాటరీ టిక్కెట్‌తో లగ్జరీ కారు.. బాలుడిని వరించిన రూ.50 లక్షల ఫార్చ్యూనర్!

Tags

Related News

ఆదోని మున్సిపల్ పోరులో ఊహించని ట్విస్ట్.. తిరగబడిన జనసేన నాయకులు!

స్థానిక సంస్థల ఎన్నికలు.. రెబల్స్‌‌పై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చ, రెండో ఆలోచనకు నో ఛాన్స్

ఏపీపై షెన్‌జెన్‌ ఎలక్ట్రానిక్స్ కంపెనీ ఫోకస్.. రియాక్టయిన మంత్రి లోకేష్, రంగంలోకి అధికారులు

అర్నబ్ తుఫాను అల్లకల్లోలం.. నేరుగా రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు, కరెంటు లేదని ప్రజల..

అర్నబ్ సైక్లోన్ ఎఫెక్ట్.. ఏపీలోని పాఠశాలలకు సెలవు, ఆ సమయంలో పరీక్షలు

ఏపీలో ‘అర్నబ్’ తుఫాన్ కదలికలపై.. సచివాలయంలో చంద్రబాబు రాత్రంతా పర్యవేక్షణ!

‘అర్నబ్’ తుపాను ప్రభావంతో.. జరిగిన నష్టాలపై సీఎం చంద్రబాబు సమీక్ష!

Big Stories

Advertisement
×