Jagtial Mystery: నిశ్శబ్ద రాత్రి సాక్షిగా.. ఆ ఊళ్లో దాగిన నీడలు చేసే మంత్ర తంత్ర ఘోషలివి. జగిత్యాల టౌన్ పగలు చూస్తే సైలెంట్ సిటీ. కానీ అర్ధరాత్రి గడియారం పన్నెండు కొట్టగానే గాలి ఆగిపోతుంది. గుండె ఆగేలా కబరస్థాన్ చీకటి కళ్లు తెరుస్తుంది. పురాతనమైన శ్మశానవాటికలో సమాధుల నుంచి నిశ్శబ్దం బుసలు కొడుతుంది. ఏవో వింత వింత శబ్దాలు గర్జన చేస్తాయి. మంటలు నాలుక చాచి నవ్వుతున్నట్లు.. నీడలు నేలమీద పాకుతూ వస్తున్నట్లు అనిపిస్తుంది. గాలి సైతం గుండె ఆపే నిశ్శబ్దం చెట్ల కొమ్మల్లో వినిపించే వింత శబ్దం చనిపోయిన వారి సమాధుల మధ్య ఏం జరుగుతోంది.? ఎవరు చేస్తున్నారు ఎవరు పలికిస్తున్నారు ఈ వింత శబ్ధాలు..
జగిత్యాల శ్మశానవాటికలో ప్రతి రోజు రాత్రి అవ్వగానే.. ఇవే భయాలు ఇవే శబ్దాలు. జనం కంటి మీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఎన్నాళ్లని భయపడతాం అనుకున్నారేమో కొందరు స్థానికులు ధైర్యం చేశారు. పట్టపగలు గుంపులుగా భయపడుతూనే స్మశానంలో అడుగు పెట్టారు. అంతే అక్కడ కనిపించిన సీన్ చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఓ చెట్టు కింద రెండు బొమ్మలు ఉన్నాయి. ఒకటి బాలుడిది మరొకటి బాలకది. వాటిని చూసి కళ్లకు వణుకుపుట్టింది. నల్ల దారాలతో చుట్టేసి బొమ్మల ఒంటిపై సూదులతో గుచ్చారు. ఆ బొమ్మలకే పేర్లు రాసిన చీటీలు ఉన్నాయి. అంటే ఇవి ఎవరి చావుకో సంకేతాలా? అసలు ఇవి క్షుద్రపూజల కోసమే పెట్టారా..? లేదంటే ఎవరో కావాలనే భయపెట్టే డ్రామాలు ఆడుతున్నారా?
అర్ధరాత్రి ఆ గొంతు ఎవరిది? ఆ మంత్రాల మాటున మర్మం ఏమిటి? చీకటిలో దాగింది మనిషా మాయా? ఆ బొమ్మల వెనుక ఉన్నది నిజమా భయపెట్టే నీడా? రేయి ముగిసినంత ఈజీగా భయం ముగియదు. వెలుగు వచ్చినా ప్రశ్నలు చావవు. ఆ శ్మశాన నిశ్శబ్దం ఓ నిజం దాచిపెడుతోంది. ఆనిజం మాయాజాలమా? మరణ శాసనమా?
Also Read: రూ.1000లోపు బెస్ట్ బ్లూటూత్ సౌండ్‌బార్..ఆర్జీబీ లైట్స్‌తో అదుర్స్