Dakshi guttikonda: ప్రముఖ తెలుగమ్మాయి దక్షి గుత్తికొండ (Dakshi guttikonda) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైన ఈమె.. బిగ్ బాస్ సీజన్ 10లో వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టి, రెండు వారాలకే ఎలిమినేట్ అయింది. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్న దక్షి.. హౌస్ లో ఉన్నప్పుడు అమ్మాయిలకు పీరియడ్స్ వస్తే కెమెరా ముందుకు వెళ్లాలి అంటూ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో జరిగే ప్రతి విషయాన్ని ఆమె బయట పెట్టింది.
సాధారణంగా హీరోయిన్స్ అంటే గ్లామర్ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి బయట ఉంటే ప్రతి వారం పార్లర్ కు వెళ్తూ ఫేషియల్, థ్రెడ్డింగ్, క్లీనప్ , వ్యాక్సింగ్, పెడిక్యూర్, హెయిర్ కట్ ఇలా ఎన్నో రకరకాల బ్యూటీ ట్రీట్మెంట్స్ తో అందంగా మెరుస్తూ ఉంటారు. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత కోట్లాదిమంది చూస్తూ ఉంటారు కాబట్టి.. ఇంకా అందంగా కనిపించాలి. అందుకే మరి వాళ్లకు మేకప్ ఎలా? హౌస్ లోకి ఎవరైనా వెళ్లి రెడీ చేస్తారా? ముఖ్యంగా మిగతా రోజుల కంటే వీకెండ్ లో మరింత మెరిసిపోతూ ఉంటారు కదా.. వారం వారం బ్యూటీ పార్లర్ కి వెళ్లే సెలబ్రిటీలు హౌస్ లో ఉన్నప్పుడు ఎలా తమ అందాన్ని కాపాడుకుంటారు? వాళ్ళ హెయిర్ కట్, మణిక్యూర్ ఇవన్నీ ఎవరు చేస్తారు? అసలు చేసుకుంటారా? లేదా? ఇలా ఎన్నో అనుమానాలు వస్తూనే ఉంటాయి.
అయితే ఈ అనుమానాలపై దక్షి గుత్తికొండ క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ..” బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత బ్యూటీకి సంబంధించిన ప్రతి ప్రోడక్ట్ ను ఎవరికి వాళ్ళు సొంతంగా తెచ్చుకోవాలి. అలాగే సొంతంగా చేసుకోవాల్సిందే. వారానికి ఒకసారి ఐబ్రో రేసర్ పంపిస్తారు. దాంతోనే అందరూ షేవ్ చేసుకోవాలి. నెయిల్ కట్టర్ కూడా ప్రతి శుక్రవారం పంపిస్తారు. అక్కడ కనిపించే అందరిదీ అదే పరిస్థితి. వ్యాక్సింగ్ స్ట్రిప్స్ అలో చేస్తారు. ఇక రెగ్యులర్ వ్యాక్స్ కి అయితే అంత సీన్ ఉండదు. ముఖ్యంగా ఎవరు ఎలా రెడీ అవుతున్నారో ఇవన్నీ కూడా బయటకు చూపించరు. అయితే వీటన్నింటికీ సపరేట్గా రూమ్ అంటూ ఏమి ఉండదు. బాత్రూం దగ్గరే ఇలాంటివన్నీ చేసుకోవాలి. ఇక అవన్నీ కూడా ఎడిటింగ్ లో తీసేస్తారు. ముఖ్యంగా పీరియడ్స్ వచ్చినప్పుడు శానిటరీ ప్యాడ్స్ పంపిస్తారు. ఒక్కొక్కరు నాలుగైదు పంచుకుంటారు. ఒకవేళ సరిపోకపోతే మళ్లీ కావాలి అనిపిస్తే.. వెళ్లి కెమెరా దగ్గర చెప్తే పంపిస్తారు.
ALSO READ: మెగా హీరో చేతుల మీదుగా ‘మైలురాయి’ టైటిల్ లాంచ్.. కొత్త నటీనటులతో ప్రయోగం!
మనకు ఏదైనా గాయం అయితే డాక్టర్లు వస్తారు. వాళ్ళు చూసి మనకేం ఇవ్వాలో అది ఇస్తారు. హౌస్ లో నిద్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అక్కడ నిద్ర ఉండదు. అప్పుడప్పుడు మెట్రో ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది. దాన్నిబట్టి లాస్ట్ ట్రైన్ అనుకొని.. టైం ఎంత అవుతుందో తెలుసుకునే వాళ్ళం.. ఇక వీకెండ్ కాస్ట్యూమ్స్ అయితే బయట నుంచి వస్తాయి. ఒకరి బట్టల్ని ఒకరు వేసుకునేవారు. వాషింగ్ మొత్తం ఎవరికి వాళ్లే చేసుకోవాలి.ఫుడ్ కూడా సరిపోదు. నాన్ వెజ్ ఎప్పుడో ఒకసారి అంటూ హౌస్ లో జరిగే ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్టు దక్షి చెప్పుకొచ్చింది. మొత్తానికైతే దక్షి చేసిన ఈ కామెంట్లను బట్టి చూస్తే హౌస్ లో ఉండే కంటెస్టెంట్స్ ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.