E-Paper
Advertisement

ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా కోకాపేటలో ప్లాట్ కొనేవాడిని.. బుచ్చిబాబు

ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా కోకాపేటలో ప్లాట్ కొనేవాడిని.. బుచ్చిబాబు
Advertisement

Buchi Babu:ఉప్పెన సినిమాతో మొదటిసారే వందకోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చిన బుచ్చి బాబు పెద్ది సినిమాతో సాలిడ్ సౌండ్ చేసిన సంగతి తెల్సిందే. అలాంటి ఈ క్రేజీ యంగ్ ఫిలిం మేకర్ తాజాగా దొంగనా కొడుకు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని తనదైన శైలిలో నవ్వులుపూయించాడు.

ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ రవి గారు ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పిలిస్తే రాకపోతే ఎక్కడ తిడతారో,ఎక్కడ కొడతారో అన్న భయంతో భయంతో ఎన్ని ప్రీ రిలీజ్ ఈవెంట్లకు పిలిచినా పరుగెత్తుకుంటూ రావాల్సి వస్తోందని నవ్వుతూ సెటైర్ వేశాడు.

Advertisement

ఒక్కో ఈవెంట్ కి పది వేలు పారితోషికం

పైగా ఈ ఈవెంట్లకు రావడానికి ఎలాంటి డబ్బులు ఇవ్వట్లేదని,కనీసం ఒక్కో ఈవెంట్ కి పది వేలు పారితోషికం ఇచ్చినా ఈ పాటికి కోకాపేట్ లో ఒక ప్లాట్ కొనేసేవాడినని అని సరదాగా చెప్పుకొచ్చాడు.కనీసం ఇప్పటికైనా పేమెంట్ ఇప్పిస్తే బాగుంటుందని అడగడంతో ఒక్కసారిగా స్టేజ్ మీద ఉన్నవారితో పాటు,ఆడిటోరియంలో ఉన్న ఉన్నవారంతా నవ్వుల్లో మునిగిపోయారు.

Advertisement

అలాగే ‘ఉప్పెన’లో నటించిన జైకృష్ణను మెచ్చుకుంటూ తన టిక్ టాక్ వీడియోలని చూసి తన అసిస్టెంట్ డైరెక్టర్ జై ని పిలిచాడని,అలా తన ఉప్పెన సినిమాలో చిన్న రోల్ చేసినప్పటికీ మంచి పేరు తెచ్చుకున్నాడని తెలిపాడు.అయితే ఉప్పెన సినిమాతో హీరో వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కృతి శెట్టి, డైరెక్టర్ గా నేను ..ఇలా అందరం సెటిల్ అయిపోయామని,కానీ జై కృష్ణ సెటిల్ అవ్వలేదన్న బాధ ఉండేదని కానీ అది లిటిల్ హార్ట్స్ సినిమా తో తీరిపోయిందని ఆనందాన్ని వ్యక్తం చేశాడు.ఇక వరుస సినిమాలని జై చేయడం తనకి ఎంతో ఆనందాన్ని ఇస్తుందని తెలిపాడు.

ఇక ఇదే సమయంలో ‘దొంగ నా కొడుకు’ సినిమాలోని టైటిల్, డైలాగ్స్ గురించి కూడా బుచ్చిబాబు మాట్లాడుతూ సినిమాలోని డీఎన్‌కే అనే పదాన్ని ఇంగ్లీష్‌లో పలికితే చాలా స్టైలిష్‌గా ఉంటుందని, ఆ డైలాగ్‌ను రెండు మూడు సార్లు తిట్టించుకున్నా పర్వాలేదనిపించేలా ఉందని నవ్వుతూ చెప్పుకొచ్చాడు.

ఉప్పెన సినిమా గురించి మాట్లాడుతూ

ఈ సందర్భంగా తన కెరీర్‌లో సాలిడ్ బ్లాక్ బస్టర్ కొట్టిన ఉప్పెన సినిమా గురించి మాట్లాడుతూ ఆ సినిమా హిట్ అయితేనే మళ్ళీ చిన్న సినిమాలు చేస్తానని,లేదంటే పెద్ద బడ్జెట్ అండ్ కాంబినేషన్స్ తో మాత్రమే కొడదామని అనే వారని ఆరోజుల్ని గుర్తుచేసుకున్నాడు.అయితే తన కోసం కాకుండా చిన్న సినిమాల ఫ్యూచర్ కోసమైనా ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని కోరుకున్నాని ,అలా ఆ సినిమా సాలిడ్ హిట్ అవ్వడంతో ఇలా ఎంతో మందికి అవకాశాలు వస్తున్నాయని అన్నాడు.

పెద్ది సినిమాతో సాలిడ్ హిట్

ఇక బుచ్చి బాబు విషయానికి వస్తే 2021లో ఉప్పెనతో వంద కోట్లని పలకరించిన ఈ యంగ్ ఫిలిం మేకర్ 2026లో పెద్ది సినిమాతో సాలిడ్ హిట్ దక్కించుకున్న సంగతి తెల్సిందే .మొత్తంగా ఈవెంట్ కి పది వేలు ఇచ్చినా ఈపాటికి కోకాపేట్ లో ప్లాట్ కొనేవాడిని అంటూ బుచ్చి బాబు చేసిన కామెంట్స్ ఇపుడు నెట్టింట్లో హాట్ టాపిక్ గా మారాయి.

also read :రాను బొంబాయి నుంచి నిమ్మతోట వనంలో వరకు.. సింగర్ ప్రభ టాప్ సాంగ్స్ ఇవే !

Tags

Related News

కారు ప్రమాద ఘటనపై స్పందించిన శేఖర్ మాస్టర్.. జరిగింది ఇదే అంటూ క్లారిటీ!

‘బౌలీ ఆర్ట్ సంఘం’ చైర్ పర్సన్ గా అల్లు అర్జున్ భార్య!

శేఖర్ మాస్టర్ కు ప్రమాదం..స్పందించిన జానీ మాస్టర్ ..ఇప్పుడు ఎలా ఉందంటే?

3 గంటల్లోనే ముగిసిన అనిరుధ్ లవ్ స్టోరీ..కానీ?

50 ఏళ్లు దాటినా నటి సితార ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

చాగంటి ప్రవచనాలతో ‘ఇడుపు కాయితం’ అఫీషియల్ టీజర్.. ఎలా ఉందంటే?

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?

Big Stories

Advertisement
×