E-Paper
Advertisement

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!

బాలు గారి గొంతు పోలికతో ఫేమస్.. దైవిక్ పాడిన ఫస్ట్ మూవీ సాంగ్ ఇదే!
Advertisement

Daiwik Singer:దైవిక్..ఈ పేరు ఇపుడొక సెన్సేషన్ అయిపొయింది.ముఖ్యంగా జీ తెలుగులో టెలీకాస్ట్ అవుతున్న ఫేమస్ రియాలిటీ షో ‘సరిగమప – ది నెక్స్ట్ సింగింగ్ సెన్సేషన్ లో అచ్చం sp బాలు గారిలా పాడటంతో ఈ కుర్రాడికి ఒక్కసారిగా జూనియర్ బాలు అన్న ట్యాగ్ పడిపోయింది. మరి సింగర్ గా చిన్న వయసులోనే అదరగొడుతున్న ఈ యంగ్ టాలెంటెడ్ ఇప్పటికే ఒక సినిమాలో పాట పాడాడని మీకు తెలుసా ?మరింతకీ ఆ పాటేంటో ఏ సినిమాలోనో చూసేద్దాం.

బాలు గారి గొంతుకు దగ్గరగా ఉండటమే

Advertisement

దైవిక్ విషయానికి వస్తే తను పుట్టి పెరిగింది విశాఖ పట్నం,పెందుర్తిలోని సుజాతనగర్ లో. తన తండ్రి ఒక సాప్ట్ వేర్ ఇంజనీర్, తల్లి గవర్నమెంట్ ఉద్యోగి కాగా అక్కయ్య సోనికా మానశ్రీ ఆంద్రా యూనివర్సిటీలో బీ ఆర్క్ చదువుతుంది.

అయితే తనకీ సంగీతం పై ఇష్టం పెరగడానికి ప్రధాన కారణం వాళ్ళ తాత వి .గురునాథ్.ఆయనకి సంగీతం పై మంచి పట్టు ఉండటమే దైవిక్ బాగా కలిసి వచ్చిందని చెప్పాలి.ఇక దైవిక్ గొంతు బాలు గారి గొంతుకు దగ్గరగా ఉండటానికి మరో కారణం వి .గురునాథ్ గారి గొంతు బాలు గారి గొంతుకు దగ్గరగా ఉండటమే.అంటే జన్యుపరంగా అది దైవిక్ కి వచ్చిందన్న మాట.

Advertisement

చదువులో జీరో ..అసలేం సాధిస్తాడు

అయితే దైవిక్ కి చిన్నప్పటి నుండి పాటలంటే ఇష్టముండటంతో చదువుపై అంతగా ఫోకస్ పెట్టేవాడు కాదట.ఇక స్కూల్ లో క్లాస్ లు జరుగుతుంటే వాటిని పట్టించుకోకుండా పాటలు పాడటం వల్ల వారితో తిట్లు తిన్న సందర్భాలు బోలెడు.ఇక సింగింగ్ మీద ఫోకస్ పెట్టి చదువుని నెగ్లెక్ట్ చేయడంతో పాటలు పాడుకుంటూ తిరుగుతున్నాడు..చదువులో జీరో ..అసలేం సాధిస్తాడు అంటూ ఎగతాళి కూడా చేసేవారు.ఒక రకంగా చెప్పాలంటే ఆ విమర్శలే అతడిలో కసిని పెంచాయి. ఇక తన టెన్త్ క్లాస్ మేట్ రుత్విక తనకి ఎంతో సపోర్ట్ ఇచ్చింది.

జీవితంలో టర్నింగ్ పాయింట్

ఇక దైవిక్ జీవితంలో టర్నింగ్ పాయింట్ ఏంటో తెలుసా ..దేవిశ్రీ ప్రసాద్ ని కలవడమే.అవును..2025లో ఏప్రిల్ లో వరల్డ్ టూర్లో భాగంగా విశాఖ పట్నం వచ్చినప్పుడు  తన అన్న విజయ్ తో కలిసి కలిసాడు. అప్పుడే దేవికి నువ్వొస్తానంటే నేనోద్దంటానా అనే సినిమాలోని గల్ గల్ అనే పాటని పాటకి డెడికేట్ చేశాడు దైవిక్.ఇక దానికి ఫిదా అయిన దేవీశ్రీ తర్వాత రోజున జరిగిన కాన్సర్ట్ లో గీతామాధురి, సాగర్ ,హేమ చంద్ర వంటి సింగర్స్ తో ఏకంగా 30 వేల మంది ముందు పాడే అవకాశం ఇవ్వడం తన లైఫ్ లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్.

సర్దుకోండి బాస్ సినిమాలోని ‘ ఏ మాయ స్వామి’

ఇక దైవిక్ పాడిన మొదటి సినిమా ఏంటో తెలుసా ..అదే సర్దుకోండి బాస్ అనే తెలుగు సినిమా .నసీరుద్దీన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఏ మాయ స్వామి అనే పాటని తన సినీ కెరీర్ లో మొదటి పాట అని చెప్పాలి. కభీర్ రఫీ మ్యూజిక్ అందించిన ఈ పాట ఎంతో హృద్యంగా ,ఒక మనిషికి తన ఊరి చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు చేస్తూ సాగుతుంది.

ఇక ఈ పాట ఇప్పటికే నెట్టింట రిలీజ్ అయి మంచి స్పందన ని దక్కించుకుంటుంది కూడా.చూడాలి మరి అచ్చం బాలు గారి గొంతుని తన గొంతులో రీక్రియెట్ చేస్తున్న దైవిక్ ముందు ముందు ఇంకెన్ని అద్భుతమైన పాటలు పాడుతాడో ,ఇంకెన్ని సంచనాలు నమోదు చేస్తాడో !

Tags

Related News

నాతో డేట్ కు రావాలంటే అబ్బాయిలు ఇవి తీసుకురావాల్సిందే: అనస్వర రాజన్

కారు ప్రమాద ఘటనపై స్పందించిన శేఖర్ మాస్టర్.. జరిగింది ఇదే అంటూ క్లారిటీ!

ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా కోకాపేటలో ప్లాట్ కొనేవాడిని.. బుచ్చిబాబు

‘బౌలీ ఆర్ట్ సంఘం’ చైర్ పర్సన్ గా అల్లు అర్జున్ భార్య!

శేఖర్ మాస్టర్ కు ప్రమాదం..స్పందించిన జానీ మాస్టర్ ..ఇప్పుడు ఎలా ఉందంటే?

3 గంటల్లోనే ముగిసిన అనిరుధ్ లవ్ స్టోరీ..కానీ?

50 ఏళ్లు దాటినా నటి సితార ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

Big Stories

Advertisement
×