E-Paper
Advertisement

కారు ప్రమాద ఘటనపై స్పందించిన శేఖర్ మాస్టర్.. జరిగింది ఇదే అంటూ క్లారిటీ!

కారు ప్రమాద ఘటనపై స్పందించిన శేఖర్ మాస్టర్.. జరిగింది ఇదే అంటూ క్లారిటీ!
Advertisement

Sekhar Master: శేఖర్ మాస్టర్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈయన ప్రస్తుతం కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న శేఖర్ మాస్టర్(Sekhar Master) నేడు ప్రమాదానికి గురి అయిన సంగతి తెలిసిందే. నేడు ఉదయం ఈయన కాకా సినిమా(Kaaka Movie) షూటింగ్ నుంచి తిరిగి వస్తున్న సమయంలో తన కారుపై ట్రక్ పడటంతో పెద్ద ఎత్తున ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.

కారు ప్రమాదంపై శేఖర్ మాస్టర్ స్పందన..

శేఖర్ మాస్టర్ ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న కాకా సినిమా సాంగ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు అయితే నేడు ఉదయం ముచ్చింతల్ సమీపంలో నాలుగు రోడ్ల కూడలి దగ్గర శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారును వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ప్రమాదం చోటుచేసుకుంది. ఇక ఈ ప్రమాదం గురించి తెలిసిన అభిమానులు పెద్ద ఎత్తున ఈ ప్రమాద ఘటనపై ఆరా తీయడం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే శేఖర్ మాస్టర్ ఒక వీడియో విడుదల చేస్తూ తన కారు ప్రమాదం (Car Accident)గురించి అసలు విషయం తెలియచేశారు. ఈ సందర్భంగా శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. స్వామియే శరణమయ్యప్ప.. అందరికీ నమస్కారమండి ఈరోజు మార్నింగ్ నుంచి ఒక వార్త వస్తూనే ఉంది.

కారులో నలుగురు ఉన్నాము..

Advertisement

నిన్న రాత్రి తాము కాకా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ సాంగ్ షూటింగ్ నైట్ జరుగుతుండగా తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో మేము తిరిగి ఇంటికి వస్తున్నాము. ఆ సమయంలోనే ఈ యాక్సిడెంట్ జరిగిందని అయితే అప్పుడు కారులో నలుగురు ఉన్నాము. కానీ నలుగురికి ఎలాంటి గాయాలు, ప్రమాదం జరగలేదు కారు మాత్రం డామేజ్ అయిందని శేఖర్ మాస్టర్ తెలిపారు. అయ్యప్ప దయవల్ల మాకు ఎవరికీ ఏం కాలేదు అందరం బాగున్నాం. ఉదయం నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మెసేజెస్ పెడుతున్నారు ఇలా నాకు క్షేమం కోరుతున్న వారందరికీ కూడా ధన్యవాదాలు.

?rpxt=ajg0OWFjMGN5OXBh

Advertisement

ఇప్పటికీ కూడా ఎంతోమంది మెసేజెస్ చేస్తున్నారు అయితే అందరికీ ఈ ప్రమాద ఘటన పట్ల ఒక క్లారిటీ రావడం కోసమే తాను ఈ వీడియో చేస్తున్నానని శేఖర్ మాస్టర్ తెలిపారు. ఆ అయ్యప్ప దయవల్ల మాకు ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు అందరం సేఫ్ గా ఉన్నాము.. ఈరోజు నైట్ తిరిగి మేము షూటింగ్ బయలుదేరుతున్నాము అంటూ శేఖర్ మాస్టర్ తనుకు జరిగిన ఈ ప్రమాదం గురించి స్పందించి ఈ వీడియో విడుదల చేశారు అయితే తనకు ఎలాంటి ప్రమాదం లేదని అందరం బాగున్నాం అంటూ ఈయన తెలియచేయడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక కాకా సినిమా జనవరి 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలోనే షూటింగ్ పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు. బాబి డైరెక్షన్లో చిరంజీవి నటిస్తున్న యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

Also Read: ఏ దేవివరమో నీవు సీరియల్ మనీష్ సీరియల్స్ చేయకముందు ఏం చేసేవారో తెలుసా?

Related News

ఈవెంట్‌కు రూ.10 వేలు ఇచ్చినా కోకాపేటలో ప్లాట్ కొనేవాడిని.. బుచ్చిబాబు

‘బౌలీ ఆర్ట్ సంఘం’ చైర్ పర్సన్ గా అల్లు అర్జున్ భార్య!

శేఖర్ మాస్టర్ కు ప్రమాదం..స్పందించిన జానీ మాస్టర్ ..ఇప్పుడు ఎలా ఉందంటే?

3 గంటల్లోనే ముగిసిన అనిరుధ్ లవ్ స్టోరీ..కానీ?

50 ఏళ్లు దాటినా నటి సితార ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

చాగంటి ప్రవచనాలతో ‘ఇడుపు కాయితం’ అఫీషియల్ టీజర్.. ఎలా ఉందంటే?

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?

Big Stories

Advertisement
×