Anaswara Rajan: అనస్వర రాజన్ ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మలయాళ ముద్దుగుమ్మగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ బిజీగా మారిపోయారు. ఇటీవల ఛాంపియన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ త్వరలోనే ఇట్లు అర్జున(Itlu Arjuna) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా నవంబర్ 13వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్లలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అనస్వర రాజన్(Anaswara Rajan) తన వ్యక్తిగత ఇష్టాలు గురించి అలాగే రొమాంటిక్ డేటింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియచేశారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అబ్బాయిలు మీకు నచ్చాలంటే వారిలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురయింది. ఈ ప్రశ్నకు అనస్వర సమాధానం చెబుతూ.. అబ్బాయిలు ఎమోషన్స్ పరంగా చాలా మెచ్యూరిటీగా ఉండాలని.. సాఫ్ట్ గా మాట్లాడాలని అలాంటివారు అంటే తనకు ఇష్టమని అనస్వర తెలియచేశారు. బయట వారు ఎలా ఉన్నా వారు మాట్లాడే విధానం, వారి వ్యక్తిత్వమే నాకు బాగా నచ్చుతుందని తెలిపారు.
ఇకపోతే తనకు ఆల్ఫా రకం అబ్బాయిలు ఏమాత్రం నచ్చరని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు . ఇక ఈమె రొమాంటిక్ డేట్ గురించి కూడా మాట్లాడుతూ.. తనకు పువ్వులు అంటే చాలా ఇష్టం నాతో ఎవరైనా డేట్ కు వచ్చే అబ్బాయిలు కచ్చితంగా సన్ ఫ్లవర్ తో పాటు వైట్ పియోనిస్ పువ్వులు తీసుకురావాలని తెలిపారు. ఇలా తామిద్దరం ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ మనసు విప్పి మాటలు మాట్లాడుకోవాలని రొమాంటిక్ డేట్ గురించి అనస్వర ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా తనతో డేట్ కు వచ్చేవారు ఫ్లవర్స్ తీసుకొని రావాలంటూ ఈమె చెప్పడంతో అందరూ ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈమె నటించిన ఇట్లు అర్జున సినిమా విషయానికి వస్తే ఈ సినిమా ప్రేమ కథ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇందులో సాయి అనీష్(Sai Aniesh) హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక హీరో ఈ సినిమాలో మూగవాడి పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసాయి. మరి నవంబర్ 13వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందనేది తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమాతో పాటు అనస్వర రాజన్ మెగాస్టార్ హీరోగా నటిస్తున్న కాకా సినిమా(Kaaka Movie)లో కూడా నటిస్తున్నారు. ఇందులో ఈమె డాక్టర్ గా చిరు కూతురి పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది.
Also Read: కొడుకుని చూడగానే బోరున ఏడ్చేసిన సుదీర్ తల్లి.. నీతూ మాస్టర్ కు స్పెషల్ రిక్వెస్ట్..