E-Paper
Advertisement

ప్రతీ కేసు ప్రాణసంకటమే… నిమిషాల్లోనే నిర్ణయం తీసుకునే డాక్టర్లు… హాస్పిటల్‌లో జరిగే హైటెన్షన్ డ్రామా

ప్రతీ కేసు ప్రాణసంకటమే… నిమిషాల్లోనే నిర్ణయం తీసుకునే డాక్టర్లు… హాస్పిటల్‌లో జరిగే హైటెన్షన్ డ్రామా
Advertisement

Taiwanese Medical Drama: హాస్పిటల్‌లో ఎమర్జెన్సీ అంటేనే టెన్షన్. ఒకవైపు ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్లు.. మరోవైపు క్షణాల్లో నిర్ణయాలు తీసుకోవాల్సిన డాక్టర్లు. చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలకే ప్రమాదం ఎదురయ్యే ఇలాంటి పరిస్థితుల్లో వైద్యులు ఎలాంటి ఒత్తిడిని ఎదుర్కొంటారు? ఆసుపత్రిలోని రాజకీయాలు వారి పనిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఇలాంటి ఒక హై-టెన్షన్ తైవానీస్ మెడికల్ డ్రామా సిరీసే ‘Miracles of the ER’. ప్రముఖ నటుడు వాలెస్ హువో, చెరిల్ యాంగ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ నవంబర్ 12 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఎమర్జెన్సీ వార్డులో జరిగే సంఘటనలతో పాటు డాక్టర్ల మధ్య ఉండే అనుబంధాలు, విభేదాలను ఇందులో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇది ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది ? ఈ సిరీస్ కథేంటో తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

ఈ సిరీస్ కథ ఒక సాధారణ మెడికల్ గ్రాడ్యుయేట్ కుర్రాడి చుట్టూ తిరుగుతుంది. పెద్దగా అకాడమిక్ రికార్డులు లేకపోయినా, అతనిలో ఉన్న అంకితభావాన్ని గుర్తించిన ఒక బ్రిలియంట్ సీనియర్ సర్జన్ (వాలెస్ హువో) అతన్ని దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే ఎమర్జెన్సీ రూమ్ (ER) టీమ్ లోకి సెలెక్ట్ చేసుకుంటాడు. అక్కడ ఉన్న ఎలైట్ డాక్టర్ల మధ్య తనను తాను నిరూపించుకోవడానికి ఆ కుర్రాడు పడే తంటాలు ఇందులో కంటికి కట్టినట్టు చూపించారు. ఎమర్జెన్సీ వార్డులోకి వచ్చే ప్రతీ కేసు ప్రాణసంకటమే. రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు కేసులు ఇలా నిమిషాల్లోనే నిర్ణయం తీసుకోవాల్సిన హై-టెన్షన్ సిచువేషన్స్ లో డాక్టర్ల మధ్య జరిగే ఎమోషనల్ క్లాషెస్, హాస్పిటల్ పాలిటిక్స్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటాయి.

Advertisement

రియల్ లైఫ్ సర్జరీలను తలపించే విజువల్స్, హార్ట్ టచింగ్ సెంటిమెంట్ సీన్స్ ఈ సిరీస్ కి మేజర్ హైలైట్. మెడికల్ డ్రామాలను ఇష్టపడే వారు సిరీస్ ని తప్పకుండా వాచ్ చేయండి. ఈ సిరీస్‌లో వైద్య చికిత్సలతో పాటు డాక్టర్లు, పేషెంట్లు, వారి కుటుంబ సభ్యుల మధ్య ఉండే భావోద్వేగాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా ప్రాణాలు కాపాడలేని పరిస్థితులు ఎదురైనప్పుడు వైద్యులు పడే మానసిక సంఘర్షణ సిరీస్ కు హైలెట్ గా ఉంటుంది.

నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

‘Miracles of the ER’ సిరీస్ లో డాక్టర్ చౌ చెంగ్-చున్ పాత్రలో వాలెస్ హువో, సీనియర్ డాక్టర్ హే యు-హువాగా చెరిల్ యాంగ్ నటించారు. ఐజాక్ లీ దర్శకత్వం వహించగా, జేడ్ లీ నిర్మాతగా వ్యవహరించారు. 2026 నవంబర్ 12 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్‌లో మొత్తం 8 ఎపిసోడ్లు ఉన్నాయి. ఇది తైవానీస్ మాండరిన్ భాషలో రూపొందింది. ఇంగ్లీష్ డబ్బింగ్, సబ్‌టైటిల్స్ ఆప్షన్‌తో స్ట్రీమింగ్ అవుతోంది.

Advertisement

Read Also : ప్రపంచంతో సంబంధం లేని ద్వీపం… ఖాళీ చేయించడానికి వచ్చిన వ్యక్తికి పట్టపగలే చుక్కలు… ఫుల్ ఫన్

Tags

Related News

మనవళ్ల కోసం మళ్లీ ఆయుధం పట్టిన తాత… విలన్లకు దబిడి దిబిడే… అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్

20 ఏళ్ల క్రితం మిస్సయిన ఫ్రెండ్… సడన్ ఎంట్రీతో షాకింగ్ ట్విస్ట్… ఫాంటసీ అడ్వెంచర్ డ్రామా

లిఫ్ట్ ఎక్కితే పదేళ్లు వెనక్కి… గతాన్ని మారిస్తే గతి తప్పే వర్తమానం… ఈ కొత్త సిరీస్ లో టైమ్ ట్రావెల్‌తో ఫుల్ ఫన్

సూపర్‌స్టార్ రజినీకాంత్ ‘జైలర్ 2’ వచ్చేసిందోచ్… ఓటీటీలో తలైవా మాస్ జాతర షురూ

అమ్మలా కనిపించే వింత ఆకారం… ఏడేళ్ల చిన్నారిని వెంటాడుతూ కుటుంబంలోకి… వెన్నులో వణుకు పుట్టించే హారర్

ప్రపంచంతో సంబంధం లేని ద్వీపం… ఖాళీ చేయించడానికి వచ్చిన వ్యక్తికి పట్టపగలే చుక్కలు… ఫుల్ ఫన్

ఇదెక్కడి సినిమారా నాయనా… బెస్ట్ ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌తోనే ప్రేమలో పడితే… ట్రయాంగిల్ రొమాంటిక్ కామెడీ

Big Stories

Advertisement
×