Malaika Arora Sells her Mumbai Property: బాలీవుడ్ బ్యూటీ మలైకా ఆరోరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. హిందీ, తెలుగులో ఎన్నో ఐటెం సాంగ్స్ లో నటించి మంచి గుర్తింపు పొందింది. 50 పదుల వయసులో కూడా యంగ్ హీరోయిన్లకు పోటీ ఇస్తూ స్పెషల్ సాంగ్స్లో నటిస్తోంది. మొన్నటి వరకు లవ్, బ్రేకప్ వార్తలతో మీడియాలో నిలిచింది. సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో విడాకుల తర్వాత హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉన్న సంగతి తెలిసిందే. కొన్నేళ్ల పాటు వీరిద్దరు సహాజీవనంలో ఉన్నారు.
పెళ్లి చేసుకుని ఈ జంట ఒక్కటవుతారనుకుంటే బ్రేక్ చెప్పుకుని విడిపోయారు. అప్పటి నుంచి మలైకా తన కెరీర్పై ఫుల్ ఫోకస్ పెట్టింది. అర్జున్ కపూర్ డేటింగ్ టైంలో వ్యక్తిగత జీవితంతో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది. స్పెషల్ సాంగ్స్లో నటిస్తోంది. ఇదిలా ఉంటే మలైకా గురించిన ఓ ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. మలైకా ముంబైలోని తన లగ్జరీ ఫ్లాట్ని అమ్మేసిందట. ముంబైలోని అంధేరీ వెస్ట్లో ఉన్న ఓ అపార్ట్మెంట్ను గత నెల నెలలో విక్రయించింది. దాదాపు 182 గజాల వైశ్యాల్యంలో ఉన్న తన ప్లాట్ను రూ. 5.30 కోట్లకు అమ్మేసింది. అయితే ఈ ప్లాట్ని మలైకాలో 2018లో కోనుగోలు చేసిందట.
సమారు. రూ. 3.26 కోట్లకు ఇదే ప్లాట్ని తీసుకోగా.. ఇప్పుడు ఐదున్నర కోట్లకు అమ్మేసి.. రూ. 2 కోట్ల మేర లాభం పొందింది. మలైకా తన ఆస్తిని అమ్ముకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక మలైకా సినిమాల విషయానికి వస్తే.. షారుక్ ఖాన్ హీరోగా మనీషా కోయిరాలా, ప్రీతి జింటా హీరోయిన్లుగా నటించిన దిల్ సే చిత్రంలోని ఐటెం సాంగ్లో నటించింది. చయ్య చయ్య అంటూ సాగే ఈ పాట ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమా వచ్చి రెండు డికెడ్స్ అవుతున్నా.. ఇప్పటికీ ఈ పాట ఎవర్ గ్రీన్ గానే ఉంది. ఇందులో మలైకా డ్యాన్స్ స్టెప్పులకు ప్రతి ఒక్కరు ఫిదా అయ్యారు.
ముఖ్యంగా ఆమె అందం, గ్లామర్ షోతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక తెలుగులో మహేష్ బాబు అతిథి.. రాత్రైనా నాకు ఒకే.. కేవ్వు కేక వంటి ఐటెం సాంగ్స్లో అలరించింది. ఇక బుల్లితెరపై జలక్ దిక్లాజా, ఇండియాస్ గాట్ టాలెంట్, ఇండియాస్బెస్ట్ డ్యాన్సర్ వంటి రియాలిటీ షోలకు జడ్జీగా వ్యవహరించింది. ప్రస్తుతం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న థామ చిత్రంలో స్పెషల్ సాంగ్లో నటిస్తోంది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆయుష్మాన్ ఖురానా ప్రధానపాత్ర పోషిస్తున్నాడు. మ్యాడ్ డాక్ హారర్ కామెడీ యూనివర్స్లో భాగంగా వచ్చిన స్త్రీ యూనివర్స్లో నాలుగో చిత్రంగా థామా రూపొందుతోంది.
Also Read: Prabhas Aadhar Card: ప్రభాస్ ఆధార్ కార్డు లీక్.. డార్లింగ్ పూర్తి పేరేంటో తెలుసా?