Dreams: స్వప్న శాస్త్రం ప్రకారం కలల వెనక అనేక అర్థాలు ఉంటాయి. ఏదైనా కల వచ్చిందంటే భవిష్యత్తులో ఏదో మార్పు జరబోతుందని ఆ కల మనకి సూచిస్తుంది. ఎటువంటి కలలు వస్తే భవిష్యత్తు బాగుంటుంది. ఎటువంటి కలలు వస్తే లక్ష్మీదేవి అనుగ్రహం, అదృష్టం కలుగుతాయి వంటి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కలలో మీకు చీపురుకట్ట కనిపిస్తే మీకు త్వరలోనే అదృష్టం పట్టబోతుందని అర్థం. ఒక్కసారిగా మీ జీవితం మారిపోతుంది. అనేక మార్పులు మీ జీవితంలో చోటుచేసుకుంటాయి.
కలలో మీకు ఖాలీ గిన్నె కనబడినట్టయితే మీ ఇంట్లోకి త్వరలోనే లక్ష్మీదేవి వస్తుందని అర్థం. ఇక మీకు డబ్బుకు లోటు అనేది ఉండదట. మీరు ఏ పనిలో అయితే ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ఆ ఇబ్బందులు కూడా త్వరలోనే సమసిపోతాయట.
కలలో మీకు గుడ్లగూడ కనబడితే చాలా మంచి జరుగుతుందట. లక్ష్మీదేవి వాహనమైన గుడ్లగూడ కలలో కనబడితే మీపై కాసుల వర్షం కురుస్తుందని అర్థమట. ఎన్నో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారట.
మీరు పరమశివుడి భక్తులు అయితే మీకు ఒక్కసారైనా శివుడు లేదా శివలింగం కలలో కనిపిస్తుందట. లేదా శివలింగానికి మీరు పూజలు చేస్తున్నట్టు కల వస్తుందట. ఇటువంటి కలలు చాలా పవిత్రమైనవిగా పరిగణిస్తారు. కలలో శివుడిని చూస్తే మీ కోరికలు నెరవేరడానికి శుభసూచకంగా బావిస్తారు. మీ వ్యక్తి గత జీవితంలో చాలా కాలంగా ఎదురుచూస్తున్న కొన్ని పనులు పూర్తవుతాయని స్వప్నశాస్త్రం సూచిస్తుంది. మీ జీవితంలోని అన్ని అశుభాలు తొలగిపోతాయని అర్థం చేసుకోవాలట.
మీ కలలో దుర్గాదేవి కనిపిస్తే మీ జీవితమంతా విజయవంతం అయినట్టు అర్థం. మీ జీవితంలోని బాధలన్నీ ముగిసి ఆనందం రాబోతుందని ఈ కలకు అర్థం అని స్వప్న శాస్త్రం పేర్కోంది. ఇక దుర్గాదేవి సింహంపై స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తే మీకు చాలా శుభప్రదమైనదిగా పరిగణిస్తారు. ఇక కలలో అమ్మవారి వాహనమైన సింహాన్ని చూడటం కూడా చాలా అదృష్టంగా చెప్తున్నారు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో సింహాన్ని చూడటం అంటే జీవితంలో రానున్న అదృష్టం గురించి మాత్రమే కాదు అన్ని సమస్యల నుంచి విముక్తి లభిస్తుందట. ఇక కలలో దుర్గాదేవి ఆలయం కనిపిస్తే.. ఆ కల శుభప్రదమైన కల అని కుభేరుడు మీపై ప్రత్యేక ఆశీస్సులు కురిపించనున్నాడని అర్థం. అలాగే డబ్బుకు సంబంధించిన అన్ని సమస్యలు పరిష్కరించబడతాయని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారట.
మీకు కలలో శ్రీరాముడు, సీతా మాత, హనుమంతుడు కనిపిస్తే ఎంతో శుభప్రదమైన కల అంటున్నారు పండితులు. శ్రీరాముడు కలలో కనిపించడం వెనక ఉన్న అర్థం ఏంటంటే జీవితంలో ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోనున్నాయని అర్థం అట.
ఇంకా దేవీ దేవతలు ఎవరైనా కలలో వచ్చారంటే అది శుభప్రదమైనదిగా భావించాలట. అయితే ఏ దేవుడు మీకు కలలో వచ్చినా మరుసటి రోజు ఉదయం దగ్గరలోని ఆ దేవుడి గుడికి వెళ్లి దర్శనం చేసుకోవాలని వీలైతే అభిషేకం, అర్చన లాంటి పూజలు చేసుకోవాలని స్వప్నశాస్త్రం సూచిస్తుందట.
పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో అన్నిటికీ ఆధునిక శాస్త్రీయ ఆధారాలు లేకపోవచ్చుననే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.
ALSO READ: సైన్స్ ను సవాలు చేసిన హిందుత్వం – అసలు విషయం తెలిస్తే షాక్ అవుతారు.