BigTV English

Dogs Day Celebrations: ఆ దేశంలో శునకానికి పూజ చేసి.. వేడుకలు చేస్తారు, ఎందుకంటే?

Dogs Day Celebrations: ఆ దేశంలో శునకానికి పూజ చేసి.. వేడుకలు చేస్తారు, ఎందుకంటే?

Kukur Tihar: మనుషుల పట్ల ఎంతో విశ్వాసంతో ఉండే జంతువుల్లో కుక్కలు మొదటి స్థానంలో ఉంటాయి. ఇంటిని, ఇంట్లోని మనుషులను కంటికి రెప్పలా కాపాడుకుంటాయి. అందుకే, నేపాల్ ప్రజలు కుక్కల పట్ల ఎంతో ప్రేమను కనబరుస్తారు. వాటికి పూజలు చేసి వేడుకలు నిర్వహిస్తారు. నేపాలీలు జరుపుకునే శునకాల పండుగ పేరు ‘కుకుర్ తిహార్’. దీపావళి తర్వాతి రోజున జరుపుకునే ఈ వేడుక నాడు పెంపుడు కుక్కలతో పాటు వీధి కుక్కలకు పూజలు చేసి వాటికి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తారు.


నేపాలీలకు కుక్కలపై ఎంతో మమకారం

వాస్తవానికి నేపాల్ ప్రజలకు కుక్కల పట్ల ఎంతో విశ్వాసం ఉంటుంది. అందుకే దీపావళి పండుగ సందర్భంగా ఒక రోజు వాటికి పూజలు నిర్వహిస్తారు. నిజానికి దీపావళి పండుగ నేపాల్ లో 5 రోజుల పాటు కొనసాగుతుంది. మొదటి రోజుల దీపావళి పండుగ జరుపుకుంటారు. రెండో రోజు శునకాలకు పూజలు చేసి, వేడుక జరుపుతారు. దీనిని ‘కుకుర్ తిహార్’ అని పిలుస్తారు. ఆ పండుగ రోజు శునకాలకు పూజలు ఎలా చేయాలో చిన్న పిల్లలకు ఇంట్లోని పెద్దవాళ్లు నేర్పుతారు. కుక్కలను గౌరవడంగా చూడ్డం, వాటితో ప్రేమగా ఉండటం వల్ల కలిగే లాభాలు ఏంటి అనేది చెప్తారు. మనుషులు చనిపోయిన తర్వాత కూడా అవి మనుషులను స్వర్గానికి తీసుకెళ్తాయని భావిస్తారు. అందుకే, కుక్కలకు ఆశ్రయం ఇవ్వడంతో పాటు అన్నం పెట్టి చూసుకోవాలని చూపిస్తారు. అందుకే, దశాబ్దాలుగా నేపాల్ ప్రజలు ‘కుకుర్‌ తిహార్‌’ జరుపుతున్నారు.


బొట్టుపెట్టి.. పూలదండ వేసి..

‘కుకుర్ తిహార్’ పండుగ రోజు పెంపుడు కుక్కలతో పాటు వీధి కుక్కలకు ప్రజలు తప్పకుండా పూజలు చేస్తారు. పూజలో భాగంగా ముందుగా కుక్కలకు కాళ్లు కడుగుతారు. ఆ తర్వాత వాటికి బొట్టు పెడతారు. ఆ తర్వాత చేనేత దారంతో చేసిన దండను వేస్తారు. ఆ తర్వాత బంతి సహా ఇతర పూలతో తయారు చేసిన దండను వేస్తారు. కుక్కలు ఆడుకునేందుకు కొన్ని వస్తువులను అందిస్తారు. ఆ తర్వాత బిస్కెట్లు, బాయిల్డ్ ఎగ్స్ తినిపిస్తారు. కుక్కల పట్ల తమ ప్రేమను చూపించుకుంటారు.

Read Also: బ్లడ్ రెయిన్, యానిమల్ రెయిన్.. ఈ వింతైన వానల గురించి మీకు తెలుసా?

స్వర్గానికి దారి చూపే శునకాలు    

‘కుకుర్ తిహార్’ రోజున కుక్కలతో మనుషులకు ఉన్న అనుబంధం గురించి చర్చించుకుంటారు. సుమారు 14 వేల ఏళ్ల నుంచి మనిషికి, కుక్క స్నేహం ఉన్నట్లు చారిత్రక ఆధారాలు చెప్తున్నాయి. అంతేకాదు, మనిషి తొలుత మచ్చిక చేసుకున్న జంతువు కూడా కుక్క అని తెలుస్తోంది. ఇతర జంతువులతో పోల్చితే కుక్కకు అతీత శక్తులు ఉన్నాయని నమ్ముతారు. మనిషి చనిపోయిన సమయంలో యముడిని వెంట తీసుకొచ్చి ఆత్మను తీసుకెళ్లేలా సాయం చేస్తుందట. తమ యజమాని స్వర్గానికి వెళ్లేలా సాయం చేయాలని యముడిని కోరుతుందని నేపాలీలు నమ్ముతారు. అందుకే ‘కుకుర్ తిహార్’ రోజున శునకాలకు పూజలు చేసి, తమకు ముక్తి ప్రసాదించేలా చూడాలని కోరుకుంటారు.

Read Also: తిరుమలలో ఈ రహస్య నీటి కొలను గురించి తెలుసా? ఫుల్‌ గా ఎంజాయ్ చేయొచ్చు!

Related News

Maneka Gandhi Sister: సబ్బుతో కడిగితే పోతుంది.. రెబిస్ చాలా చిన్న వైరస్.. మేనకా గాంధీ సోదరి కామెంట్స్‌ పై దుమారం!

Viral video: బస్సును నడుపుతున్న యువతి.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Rain Types: బ్లడ్ రెయిన్, యానిమల్ రెయిన్.. ఈ వింతైన వానల గురించి మీకు తెలుసా?

Dog video: పిల్లలపై వీధి కుక్క దాడి.. హీరోలో వచ్చి కాపాడిన పెంపుడు కుక్క.. వీడియో వైరల్

Thief viral video: తాళం బ్రేక్ కాదు.. జస్ట్ ఇలా ఓపెన్! దొంగ ‘పెట్రోల్ ట్రిక్’తో పోలీసులు కూడా షాక్!

Big Stories

×