OG Business: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), డైరెక్టర్ సుజీత్(Sujeeth) కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం ఓజీ(OG). ఎన్నో అంచనాల నడుమ తెరకెక్కిన ఈ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతుంది. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 25వ తేదీ విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సినిమా నుంచి వరుస అప్డేట్స్ విడుదల చేస్తూ సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇక ఈ సినిమాకు ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా టికెట్ ధరలను పెంచడమే కాకుండా ప్రీమియర్ షోలకు కూడా అనుమతి లభించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమా పట్ల ఇప్పటికే భారీ స్థాయిలో అంచనాలు ఉన్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుపుకుందని తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా బిజినెస్ వివరాలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూస్తుంటే మాత్రం పవన్ కళ్యాణ్ ముందు భారీ టార్గెట్ ఉందని తెలుస్తోంది. ఈ సినిమా ఆంధ్రాలో ఏకంగా 80 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకోగా నైజాం ఏరియాలో రూ. 55 కోట్లు, సీడెడ్ ఏరియాలో రూ.22 కోట్ల బిజినెస్ జరుపుకుందని తెలుస్తోంది. జీఎస్టీ లతో కలిపి రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 157 కోట్ల రూపాయల బిజినెస్ జరుపుకుంది. ఇక వరల్డ్ వైడ్ ఈ సినిమా జిఎస్టిలతో కలిపి రూ.166 కోట్ల బిజినెస్ జరుపుకోగా బ్రేక్ ఈవెన్ కావాలి అంటే సుమారు రూ. 300 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టాలని తెలుస్తోంది.
పవన్ ముందు భారీ టార్గెట్..
ఇలా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు చూస్తుంటే మాత్రం ఓజీ ముందు బిగ్ టార్గెట్ ఉందని చెప్పాలి. మరి ఈ టార్గెట్ ఓజీ చేరుకోగలడా? లేదా? అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటివరకు విడుదల చేసిన అప్డేట్స్ చూస్తుంటే మాత్రం ఖచ్చితంగా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని స్పష్టం అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత హరిహర వీరమల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఓజీ పైనే ఆశలు..
హరిహర వీరమల్లు సినిమా పట్ల ఎన్నో అంచనాలు ఉన్నప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది. కానీ, ఓజీ సినిమా మాత్రం ప్రేక్షకులకు, అభిమానులకు కావలసినంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతుందని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమా విషయంలో పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర చిత్ర బృందం కూడా ఎంతో ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక మోహన్ (Priyanka Mohan)నటించగా, శ్రేయ రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ వంటి తదితరులు కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. ఇక ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్స్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.
Also Read: Kantara Chapter1: కాంతారకు సాయంగా రాజా సాబ్… రంగంలోకి ఇంకా బడా స్టార్స్!