Abhishek Sharma : ఆసియా కప్ 2025లో ప్రస్తుతం టీమిండియా టాప్ ప్లేస్ లో కొనసాగుతోంది. అందుకు కారణం టీమిండియా ఆటగాళ్లే. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే..? టీ 20 ఐసీసీ ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాటర్ టీమిండియా ఓపెనరే. అలాగే నెంబర్ వన్ బౌలర్ టీమిండియా బౌలర్ వరుణ్ చక్రవర్తి, నెంబర్ వన్ టీమ్ టీమిండియా.. ఇలా అన్నింటిలో టీమిండియా నెంబర్ వన్ గా కొనసాగడం ఇదే ఏడాది కావడం గమనార్హం. ఇప్పటివరకు ఆటగాళ్లో.. లేక టీమ్ నెంబర్ వన్ గా ఉండేది. బ్యాటింగ్ నెంబర్ వన్ ఉంటే.. బౌలింగ్ లేదు. బౌలింగ్ ఉంటే బ్యాటింగ్ లేదు. కానీ తాజాగా పరిస్థితి మారిపోయింది. అన్నింటిలో టీమిండియా నెంబర్ వన్ గా కొనసాగుతోంది.
Also Read : Asia Cup 2025 : టీమిండియా నుంచి గిల్ ను తొలగించండి… ఆడుకుంటున్న ఫ్యాన్స్
ముఖ్యంగా టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను శ్రీలంక ఆటగాడు సనత్ జయసూర్యతో పోల్చుతున్నారు. కొంత మంది నెటిజన్లు. టీమిండియా లోకి మరో జయసూర్య వచ్చేశాడు. వీడు కొడితే నరకమే అంటూ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. నిన్న ఒమన్ తో జరిగిన మ్యాచ్ లో “Abhishek our Indian Jayasurya” అంటూ ప్లకార్డులు ప్రదర్శించడం విశేషం. టీమిండియా తరపున అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించడానికి టీమిండియా టీ 20 మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ అనే చెప్పాలి. టీ-20 వరల్డ్ కప్ లో టీమిండియా విజయం సాధించిన తరువాత అభిషేక్ శర్మ భారత జట్టు తరపున ఆడుతున్నాడు. ఇప్పటికే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతోనే అభిషేక్ శర్మ కి టీమిండియాలో చోటు లభించింది. మరోవైపు రోహిత్ శర్మ ఎలాగైతే దూకుడుగా ఆడుతాడో.. అభిషేక్ శర్మ కూడా అలాగే దూకుడుగా ఆడుతుంటాడు.
టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన ఆరాధ్య క్రికెటర్ అని విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ ఇటీవలే పేర్కొన్నాడు. ముఖ్యంగా 2007 టీ 20 వరల్డ్ కప్ లో ఇంగ్లాండ్ పై యువరాజ్ సింగ్ 6 బంతుల్లో 6 సిక్సులు బాదాడు. ఇక అప్పటి నుంచే తాను క్రికెటర్ కావాలనుకున్నానని.. టీమిండియా కి ప్రాతినిధ్యం వహించాలనుకున్నట్టు చెప్పుకొచ్చాడు. వాస్తవానికి అభిషేక్ శర్మకు యువరాజ్ సింగ్ దగ్గర ఉండి మరీ బ్యాటింగ్ మెలుకువలు నేర్పించాడు. అతని గైడెన్స్ అభిషేక్ కి కలిసి వచ్చింది. ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరపున విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడిన అభిషేక్.. ఆ ప్రదర్శనతోనే టీమిండియాలోకి ఛాన్స్ వచ్చింది. దీంతో టీమిండియాలో కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా కప్ 2025 టోర్నీలో టీమిండియా ఓపెనర్ బ్యాటర్ గా అభిషేక్ శర్మ విధ్వంసకర బ్యాటింగ్ తో రెచ్చిపోతున్నాడు. సెప్టెంబర్ 21న పాకిస్తాన్ తో జరుగబోయే మ్యాచ్ లో కూడా అభిషేక్ రెచ్చిపోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Indian fan in the crowd! 👀 pic.twitter.com/YYAsOaoZ1G
— CricketGully (@thecricketgully) September 19, 2025