Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 చాలా ఆసక్తికరంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు వారాలు పూర్తయిపోయింది. ముందు సీజన్స్ తో పోలిస్తే ఈ సీజన్ కొంతవరకు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఇచ్చిందని చెప్పాలి. ఎక్కువ టైం తీసుకోకుండా గొడవలు కూడా హౌస్ లో ముందుగానే మొదలైపోయాయి. మొదటి వారంలో శ్రేష్టి వర్మ ఎలిమినేట్ అయిపోయారు. ఈవారం మనీష్ ఎలిమినేట్ అయిపోయినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈరోజు శనివారం కాబట్టి నాగార్జున వచ్చి హౌస్ మేట్స్ అందరితో మాట్లాడుతారు అనే విషయం తెలిసిందే. ఈ ఎపిసోడ్ కి సంబంధించి చాలా కీలకమైన విషయాలు బయటకు వస్తున్నాయి.
కింగ్ నాగార్జున ప్రియా శెట్టి కు పగిలిపోయే వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఈ వారం డిమాన్ పవన్ కెప్టెన్ అయిన విషయం తెలిసిందే. కెప్టెన్ అవ్వడం అనేది ఈజీ కాదు. చాలా టాస్కులు జరగాలి. ఆ టాస్కుల్లో విపరీతంగా కష్టపడిన తర్వాత కెప్టెన్ అయ్యే అవకాశం వస్తుంది. మొత్తానికి టాస్కుల్లో గెలవడం వలన పవన్ కెప్టెన్ అయిపోయాడు.
అయితే జరిగిన టాస్క్ లో ప్రియా శెట్టి సంచాలక్ గా వ్యవహరించారు. సంచాలక గా తన కర్తవ్యాన్ని పర్ఫెక్ట్ గా తాను చేయలేదు. ఇదే విషయాన్ని వీడియో ప్లే చేసి మరి నాగార్జున ప్రియా శెట్టికి చూపించారు. వీడియో చూసిన వెంటనే ప్రియా శెట్టి కూడా షాక్ అయ్యారు.
సంచాలక్ సరిగ్గా వ్యవహరించకపోవడం వల్లనే కామనర్స్ లో ఒకరైన పవన్ కెప్టెన్ అయిపోయాడు. అయితే గత వారం సెలబ్రిటీల నుండి ఒకరు కెప్టెన్ అయ్యారు కాబట్టి ఈ వారం కామనర్స్ నుంచి ఒకరు కెప్టెన్ అయ్యారు అని అందరూ ఊహించరు. కానీ ఎవరూ ఊహించని విధంగా పవన్ కెప్టెన్సీ ని రద్దు చేశారు నాగార్జున. ఇప్పుడు కొత్త కెప్టెన్ ఎవరు అని అందరికీ కొత్త ఆలోచన మొదలైంది. కేవలం కెప్టెన్సీ రద్దు చేయడమే కాకుండా సంచాలక్ వ్యవహరించిన రీతు చౌదరికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు నాగార్జున.
Also Read: Bigg Boss 9 : మర్యాద మనీష్ ఎలిమినేటెడ్, ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే