E-Paper
Advertisement

తెలంగాణ ఐఏఎస్ హత్య కేసు.. మళ్లీ జైలుకు బిహార్ మాజీ ఎంపీ.. అసలేం జరిగిందంటే?

తెలంగాణ ఐఏఎస్ హత్య కేసు.. మళ్లీ జైలుకు బిహార్ మాజీ ఎంపీ.. అసలేం జరిగిందంటే?
Advertisement

Anand Mohan Case: తెలంగాణ రాష్ట్రానికి చెంది బిహార్​ లో హత్యకు గురైన ఐఏఎస్​ అధికారి కేసులో యావజ్జీవ కారాగార శిక్ష అనుభవిస్తున్న బిహార్​ మాజీ ఎంపీ ఆనంద్​ మోహన్​ కు సుప్రీం కోర్టు షాక్​ ఇచ్చింది. ఆయనకు రెమిషన్​ కల్పిస్తూ ముందస్తు విడుదలకు బిహార్​ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గురువారం కొట్టివేసింది. నెలరోజుల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.

సుప్రీం కోర్టు న్యాయమూర్తులు జస్టిస్​ దీపాంకర్​ దత్తా, జస్టిస్​ షీల్ నాగులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. తెలంగాణ రాష్ట్రానికి చెందిన కృష్ణయ్య సివిల్ సర్వీసెస్​ పరీక్షల్లో విజయం సాధించి ఐఏఎస్​ అధికారిగా ఎదిగారు. ఆయనను బిహార్​ రాష్ట్రానికి కేటాయించారు. అక్కడ వేర్వేరు చోట్ల పనిచేసిన కృష్ణయ్య 1994లో బిహార్ రాష్ట్రం గోపాల్​ గంజ్ జిల్లా కలెక్టర్​ గా పనిచేశారు. 1994, డిసెంబర్ 5న ముజఫర్‌ పూర్ జిల్లాలో గ్యాంగ్‌ స్టర్ ఛోటన్ శుక్లా అంత్యక్రియల ఊరేగింపు జరుగుతుండగా కృష్ణయ్య ప్రయాణిస్తున్న కారు ఆ ఊరేగింపును దాటేందుకు ప్రయత్నించింది.

Advertisement

ఆ సమయంలో ఊరేగింపునకు నాయకత్వం వహిస్తున్న అప్పటి ఎమ్మెల్యే ఆనంద్ మోహన్ రెచ్చగొట్టడంతో ఆందోళనకారులు కృష్ణయ్యను కిరాతకంగా కొట్టి చంపారు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసి ఆనంద్ మోహన్​ ను అరెస్ట్​ చేశారు. విచారణ పూర్తి చేసి కోర్టుకు ఛార్జ్​ షీట్​ సమర్పించారు. కేసును విచారించిన కిందికోర్టు ఆనంద్​ మోహన్​ ను దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధించింది. దీనిపై ఆనంద్ మోహన్ బీహార్ రాష్ట్ర హైకోర్టుకు వెళ్లాడు. హైకోర్టు కిందికోర్టు విధించిన ఉరిశిక్షను రద్దు చేసి జీవితఖైదుగా మార్చింది.

కాగా విధి నిర్వహణలో ఉన్న ప్రభుత్వ అధికారిని హత్య చేసిన దోషులకు ముందస్తు విడుదల వర్తించదనే నిబంధనను నితీశ్ కుమార్ ప్రభుత్వం 2023లో సవరించింది. ఆ తర్వాత ఆనంద్ మోహన్‌ ను విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దివంగత ఐఏఎస్ అధికారి కృష్ణయ్య భార్య ఉమా కృష్ణయ్య సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్​ పై విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం ఆనంద్ మోహన్ విడుదలకు మార్గం సుగమం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన సవరణ చెల్లదని స్పష్టం చేసింది.

Advertisement

Also Read: తెలంగాణలో కొత్త అస్త్రం.. ‘రుద్రమ సేన’ రంగప్రవేశం.. ఆడసింహాల్లా గర్జిద్దామన్న కవిత!

అంతేకాకుండా 2023 ఏప్రిల్ 24న ఆయనను విడుదల చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులను కూడా రద్దు చేసింది. నెలరోజుల్లోగా జైలు అధికారుల ఎదుట లొంగిపోవాలని ఆనంద్​ మోహన్​ ను ఆదేశించింది. ఈలోపు ఆయన లొంగిపోకపోతే వెంటనే అదుపులోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. అయితే ఆయన లొంగిపోయిన తర్వాతే నిబంధనల ప్రకారం మళ్లీ రెమిషన్ ప్రక్రియను పరిశీలించే అవకాశం ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది.

Also Read: అమితాబ్ ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు.. మెట్రో స్టేషన్లకూ హెచ్చరిక.. ముంబైలో హై అలర్ట్!

Tags

Related News

ముదిరిన సోషల్ మీడియా వార్.. మెటాకు కాంగ్రెస్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..!

అమితాబ్ ఇంటికి మళ్లీ బాంబు బెదిరింపు.. మెట్రో స్టేషన్లకూ హెచ్చరిక.. ముంబైలో హై అలర్ట్!

ప్యాకేజ్డ్ ఫుడ్‌పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. ఇకపై ఆ గుర్తు ఉండాల్సిందే!

ఎమ్మెల్యే కూతురి పెళ్లిలో కరెన్సీ నోట్ల వర్షం.. చీపురుతో ఊడుస్తున్న దృశ్యాలు వైరల్!

సీఎం విజయ్ కీలక నిర్ణయం.. మగ ఉద్యోగులకు 15 రోజులు పితృత్వ సెలవులు.. తమిళనాడు చరిత్రలో ఫస్ట్ టైమ్!

ఆయనకు 75, ఆమెకు 63.. వృద్ధాశ్రమంలో చిగురించిన ప్రేమ.. హిమాచల్‌లో వింత పెళ్లి!

2 అడుగుల బర్రె.. ధర ఏకంగా రూ. కోటి.. ప్రపంచంలోనే అత్యంత చిన్నది ఇదేనా?

Big Stories

Advertisement
×