E-Paper
Advertisement

OLXలో సోఫా అమ్మకానికి పెట్టిన మహిళ.. QR కోడ్‌తో రూ.12 లక్షలు స్వాహా!

OLXలో సోఫా అమ్మకానికి పెట్టిన మహిళ.. QR కోడ్‌తో రూ.12 లక్షలు స్వాహా!
Advertisement

OLX Sofa Scam: ఇంట్లో పాత సామాన్లు ఏవైనా ఉంటే ఆన్‌లైన్‌లో అమ్మేయడం ఇప్పుడు సర్వసాధారణం అయిపోయింది. కానీ, ఆ కస్టమర్ల ముసుగులో సైబర్ నేరగాళ్లు కాచుకుని కూర్చున్నారన్న విషయం మనం మర్చిపోకూడదు. సరిగ్గా ఇలాగే OLXలో తన పాత సోఫాను అమ్మకానికి పెట్టింది ఓ మహిళ. సైబర్ కేటుగాళ్ల వలలో చిక్కుకుని ఏకంగా రూ.12,20,822 పోగొట్టుకుంది. అసలు ఈ మోసం ఎలా జరిగిందో తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే.

నమ్మకం కలిగించి.. వలలోకి దించారు

Advertisement

సోఫా కొంటామంటూ కొందరు వ్యక్తులు ఆ మహిళకు ఫోన్ చేశారు. బేరసారాలు మాట్లాడుకుని, ముందుగా ఆమెకు నమ్మకం కలిగించడానికి కొంత డబ్బును ఆమె ఖాతాలోకి బదిలీ చేశారు. మిగిలిన డబ్బు పంపడానికి ఒక QR కోడ్ పంపుతున్నామని, దాన్ని స్కాన్ చేయాలని చెప్పారు. డబ్బులు వస్తాయనుకున్న ఆ మహిళ, వాళ్లు చెప్పినట్టే QR కోడ్ స్కాన్ చేసి తన UPI పిన్ ఎంటర్ చేసింది. అంతే.. డబ్బులు రాకపోగా, ఆమె ఖాతా నుంచే విడతల వారీగా డబ్బులు కట్ అవ్వడం మొదలైంది.

రిఫండ్, పోలీసుల పేరుతో బెదిరింపులు

Advertisement

కట్ అయిన డబ్బులు తిరిగి పంపిస్తామని, రిఫండ్, బ్యాంక్ వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తవ్వాలంటే మరికొంత డబ్బు చెల్లించాలని కేటుగాళ్లు ఆమెను మభ్యపెట్టారు. ఆ తర్వాత అసలు డ్రామా మొదలైంది. తాము పోలీసులమంటూ మరికొందరు ఫోన్ చేసి, ఆమెను రకరకాలుగా భయపెట్టారు. కేసు అవుతుందని, ఇబ్బందుల్లో పడతారని బెదిరించడంతో ఆ మహిళ మరింత ఆందోళనకు గురైంది. ఇలా భయపెట్టి, మభ్యపెట్టి ఆమె నుంచి అక్షరాల రూ.12,20,822 కాజేశారు.

కేసు నమోదు..

తాను మోసపోయానని గ్రహించిన బాధితురాలు వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: బ్యాలెట్‌పై నోటా ఉన్నప్పుడు ఏకగ్రీవం ఎలా సాధ్యం? ఏపీ హైకోర్టు సంచలన ప్రశ్న!

Tags

Related News

డీజే టిల్లు పాటకు మల్లారెడ్డి మాస్ స్టెప్పులు.. వీడియో వైరల్!

సింగరేణి కాంట్రాక్టు కార్మికుల పిల్లలకు గుడ్ న్యూస్.. 10వ తరగతి వరకు ఉచిత విద్య, అప్లై చేసుకోండిలా!

పదో తరగతి మెమోలో తప్పులా? విద్యార్థులకు ఇకపై నో టెన్షన్, మీ సేవలో అప్లయ్ చేస్తే చాలు

ఖేలో ఇండియా పోటీలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష.. అధికారులకు కీలక ఆదేశాలు

ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్, ఎగిరిగంతేస్తున్న విద్యార్థులు, అసలు విషయం తెలుసా?

ఆ చింత అవసరం లేదు.. సింగిల్ విండో విధానం, సీఎం రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు

నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఏం సాధిస్తారు.. బీఆర్ఎస్ కేవలం అందుకే, రాజగోపాల్ ఆరోపణలు నిజమేనన్న కవిత

Big Stories

Advertisement
×