Manchi Lakshmi: మంచు లక్ష్మి పరిచయం అవసరం లేని పేరు .కలెక్షన్ కింగ్ మోహన్ బాబు (Mohan Babu)వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మి ఇండస్ట్రీలో మంచి సక్సెస్ కోసం ఎంతో కష్టపడుతున్నారు. ఇటీవల దక్ష అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. థియేటర్లో ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకో లేకపోయిన ఓటీటీలో మాత్రం మంచి సక్సెస్ అందుకుంది. ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు లక్ష్మి తన కుటుంబానికి సంబంధించిన ఎన్నో విషయాల గురించి అభిమానులతో పంచుకున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన తండ్రి మోహన్ బాబు గారి క్రమశిక్షణ గురించి కూడా మాట్లాడారు.
మోహన్ బాబు పేరు చెప్పగానే క్రమశిక్షణకు మారుపేరని చెబుతారు .ఆయనతో మాట్లాడాలన్నా కూడా ఇతర నటీనటులు కాస్త భయపడతారనే చెప్పాలి. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ చాలా క్రమశిక్షణతో ఉండే మోహన్ బాబు గురించి తాజాగా మంచు లక్ష్మి (Manchu Lakshmi)మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేము ఎప్పుడు ఏం చేయాలి అనే ప్రతి ఒక్క విషయం నాన్నగారు చెప్పినట్టే జరగాలని తెలిపారు. ఉదయం 5 గంటలు నిద్రలేచినప్పటినుంచి ఎప్పుడు బ్రష్ చేయాలి, ఎప్పుడు రెడీ అవ్వాలి, బ్రేక్ ఫాస్ట్ ఎప్పుడు తీసుకోవాలి సినిమా ఎప్పుడు చూడాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా నాన్న టైం టేబుల్ వేసి మరి మమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పేవారు.
ఇలా ఆ టైం టేబుల్ మేం ఫాలో అవుతున్నామా లేదా అని ఒక మేనేజర్ ని కూడా పెట్టేవారని వెల్లడించారు. ఇక మా ఇంట్లో ఎక్కడా లేని విధంగా లైబ్రరీ ఉండేదని చదువు విషయంలో కూడా నాన్న చాలా స్ట్రిక్ట్ అని మంచు లక్ష్మీ వెల్లడించారు. అయితే నేను అమ్మాయి కావడంతో ఆడపిల్ల ఇలాగే ఉండాలి పద్ధతిగా ఉండాలి అని చెప్పేవారు నా గొడవ ఇక్కడే స్టార్ట్ అయిందని తెలిపారు. వాడు చేస్తున్నప్పుడు నేనెందుకు చేయకూడదని నేను వాదిస్తాను ఇప్పటికీ కూడా వాళ్లు చేసేది నేనెందుకు చేయకూడదు వాళ్లకి ఒక రూల్ నాకొక రూలా అని నాన్నతో వాదిస్తాను అంటూ మంచు లక్ష్మి వెల్లడించారు.
నిజాలు ఎప్పుడో ఒకసారి బయటపడతాయి…
పక్క వాళ్ళు ఏం చేస్తున్నారనేది మన మైండ్ లో ఫిక్స్ అయి ఉంటుందని మనం ఎంత దాచిపెట్టినా అది తాగదని ఎప్పుడో ఒకసారి నిజాలు మొత్తం బయటపడతాయని తెలిపారు. ఇక ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తన స్కూల్ కాలేజీకి సంబంధించిన విషయాలు గురించి కూడా ప్రస్తావించారు. అయితే గత కొద్ది రోజులుగా మంచు కుటుంబంలో గొడవలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ప్రతి ఇంట్లో ఉండే గొడవలే మా ఇంట్లో కూడా ఉన్నాయని మంచు కుటుంబ సభ్యులు పలు సందర్భాలలో తెలియచేశారు. అయితే ఇటీవల మంచు బ్రదర్స్ ఇద్దరు కూడా కలిసిపోయారని సోషల్ మీడియా వేదికగా వీళ్ళు చేసుకునే పోస్టులు బట్టి చూస్తేనే అర్థమవుతుంది. ఇక త్వరలోనే మంచు కుటుంబం మొత్తం మోహన్ బాబు సినీ స్వర్ణోత్సవ వేడుకలలో సందడి చేయబోతున్నట్టు తెలుస్తుంది.
Also Read: Rocking Rakesh: కేసీఆర్ సినిమాతో నష్టాలు… తప్పుడు వార్తలపై ఫైర్ అయిన రాకేష్.. ఏం జరిగిందంటే?