E-Paper
Advertisement

Vijay Deverakonda : అల్యూమినియం ఫ్యాక్టరీలో రౌడీ జనార్ధన్, ఏం జరుగుతుంది?

Vijay Deverakonda : అల్యూమినియం ఫ్యాక్టరీలో రౌడీ జనార్ధన్, ఏం జరుగుతుంది?
Advertisement

Vijay Deverakonda : రాజావారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు రవికిరణ్ కోలా. బాక్సాఫీస్ వద్ద సినిమా విపరీతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత చాలా టైం తీసుకుని ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా రౌడీ జనార్ధన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టైటిల్ విషయంలో ఇంకా క్లారిటీ లేదు. ఒక సందర్భంలో దిల్ రాజు మాట్లాడుతూ ఇదే టైటిల్ అని అనౌన్స్ చేశారు. అది కూడా పొరపాటున చెప్పేసారు.

ఇకపోతే దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో కూడా రానుంది. రవి కిరణ్ కోళ్ల ముందుగానే కథను రెడీ చేసిన కూడా విజయ్ దేవరకొండ కి ఉన్న కొన్ని కమిట్మెంట్స్ వలన ఈ సినిమా డిలే అవుతూ వచ్చింది. అయితే విజయ్ దేవరకొండ సినిమాలేవి పెద్దగా ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద వర్కౌట్ కావడం లేదు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా మంచి హిట్ అవుతుంది అని అందరూ బలంగా నమ్ముతున్నారు.

అల్యూమినియం ఫ్యాక్టరీలో 

Advertisement

ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం అల్యూమినియం ఫ్యాక్టరీలో జరుగుతుంది. ఈ సినిమాలోని ఒక పాటకు సంబంధించి షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా హైదరాబాదులో షూటింగ్ జరగడం వలన ఈరోజు జరిగిన ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా సక్సెస్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ హాజరయ్యారు.

గతంలో రవి కిరణ్ కోలా మాట్లాడుతూ, ఈ సినిమా కోసం నేను ప్రతీక్షణం ఆలోచిస్తూనే ఉన్నాను. అలానే వాళ్ల నాన్నగారి స్టోరీ ని కూడా కొంత మేరకు దృష్టిలో పెట్టుకొని ఈ కథను సిద్ధం చేసినట్లు గతంలో రవికిరణ్ కోలా చెప్పాడు. ఈ సినిమాతో స్ట్రాంగ్ కం బ్యాక్ విజయ్ ఇస్తాడు అనేది అందరికీ ఉన్న నమ్మకం.

గ్రేట్ లైనప్ 

Advertisement

ప్రస్తుతం విజయ్ దేవరకొండ ఎన్నో అంచనాల మధ్య చేస్తున్న సినిమాలన్నీ కూడా డిజాస్టర్ గానే మిగులుతున్నాయి. ఇప్పుడు రౌడీ జనార్ధన్ సినిమాతో పాటు రాహుల్ దర్శకత్వంలో చేస్తున్న మరో సినిమా మీద కూడా విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.

గతంలో రాహుల్ దర్శకత్వంలో వచ్చిన టాక్సీవాలా సినిమా మంచి సక్సెస్ సాధించింది. ఇప్పుడు రాహుల్ చేస్తున్న సినిమాలో విజయ్ దేవరకొండ రాయలసీమ యాసలో మాట్లాడబోతున్నారు. గతంలో విజయ్ దేవరకొండ కూడా రాయలసీమలోనే పుట్టపర్తిలో చదువుకున్నారు. అప్పట్లో తన చిన్నప్పుడు వీడియో కూడా వైరల్ గా మారింది.

Also Read: Dulquer Salmaan : రామ్ చరణ్, నాని మధ్యలో దుల్కర్ సల్మాన్, ఆ రిస్క్ అవసరమా?

Related News

నాగ చైతన్య ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఫౌజీ వాయిదా పడినట్టేనా?

మిర్జాపూర్ ఊచకోత.. రూ.200 కోట్లు ఇక లాంఛనమేనా ?

హనుమాన్ అంష్ 2లో విరాట్–అనుష్క.. నిజమేనా?

ఏంటీ ట్రెండ్ మామా.. టాలీవుడ్ హీరోలంతా 80ల్లోనే!

‘జనవరి 12 విడుదల’ పక్కా బ్లాక్ బస్టర్.. ఫస్ట్ రివ్యూ ఇచ్చిన మ్యూజిక్ డైరెక్టర్!

పిల్లలు ఉన్నా.. లేకపోయినా ఒకే అనుకున్నాం..కానీ: సమంత

ఫౌజీ అసలు వస్తుందా? ప్రభాస్ సినిమా చుట్టూ పెరుగుతున్న సస్పెన్స్!

ఫ్యాన్స్ అంటే సెలబ్రేషన్స్ మాత్రమే కాదు..మనసులు గెలిచిన అల్లు అర్జున్ ఫ్యాన్స్!

Big Stories

Advertisement
×