Manchu Lakshmi:మంచు లక్ష్మీ (Manchu Lakshmi) .. మంచు మోహన్ బాబు (Mohan Babu) వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగపెట్టిన ఈమె హీరోయిన్ గా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంది. అలా మొదట సిద్ధార్థ్ హీరోగా నటించిన ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమాతో విలన్ గా ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మెప్పించింది. ఆ తర్వాత ‘గుండెల్లో గోదారి’ సినిమాతో తన నటనలోని మరో కోణాన్ని చూపించింది. ఇటీవల యక్షిణి అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె.. తాజాగా ‘దక్ష: ది డెడ్లీ కాన్సిఫరసీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(Mohan Babu) ఇందులో ప్రత్యేక పాత్ర పోషిస్తున్నారు.
యంగ్ హీరో విశ్వంత్ దద్దుంపూడి, సముద్రఖని, రంగస్థలం మహేష్, మలయాళం నటుడు సిద్ధిఖీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ చిత్రానికి వంశీకృష్ణమల్ల దర్శకత్వం వహించగా.. శ్రీలక్ష్మి ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్ సంస్థలు నిర్మించాయి. క్లినికల్ ట్రైల్స్ నేపథ్యంలో రూపొందిన మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పవచ్చు. మొత్తానికి సెప్టెంబర్ 19న థియేటర్లలోకి వచ్చి .. మంచి రెస్పాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ సినిమా. ఇదిలా ఉండగా తాజాగా మంచు లక్ష్మి ఇంస్టాగ్రామ్ ద్వారా షేర్ చేసిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ:Bigg Boss 9 Promo: తనూజా చేతే లవ్ సీక్రెట్ బయటపెట్టించిన నాగ్!
సడన్గా హాస్పిటల్ బెడ్ పై కనిపించిన మంచు లక్ష్మీ..
అసలు విషయంలోకి వెళ్తే.. ఆమె సెలైన్ పెట్టుకొని బెడ్ పై పడుకున్న ఫోటోలు షేర్ చేయగా.. ఆమె పక్కనే మోహన్ బాబు కూడా కూర్చున్నారు. దీంతో నెటిజన్లు సడన్ గా ఆమెకు ఏమైందని ఆందోళన వ్యక్తం చేయగా అసలు విషయం తెలిసి ఊపిరి పీల్చుకున్నారు.. అయితే ఇవన్నీ దక్ష సినిమా స్టిల్స్ అని స్వయంగా ఆమె కింద క్యాప్షన్ లో వెల్లడించింది. తన తండ్రితో కలిసి నటించడం పై ఎమోషనల్ కామెంట్స్ కూడా చేసింది మంచు లక్ష్మి. మంచు లక్ష్మి షేర్ చేసిన క్యాప్షన్ విషయానికి వస్తే.. “మీతో కలిసి దక్ష సినిమాను నిర్మించి , అందులో నటించే అవకాశం వచ్చిన తర్వాత మీతో కలిసి పని చేయడం చాలా సంతోషంగా అనిపించింది. నిజంగా నా కల నిజమైంది. ధన్యవాదాలు.. ఎప్పటికీ మీ ఆశీస్సులు నాపై ఉండాలి నాన్న” అంటూ రాసుకుంది మంచు లక్ష్మి. ఇక ప్రస్తుతం మంచు లక్ష్మి షేర్ చేసిన ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మంచి లక్ష్మి విషయానికి వస్తే నటిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న ఈమె.. ఎప్పటికప్పుడు తన యాస విషయంలో ట్రోల్ అవుతూనే ఉంది అని చెప్పవచ్చు. దీనికి తోడు ఇటీవల బాడీ షేమింగ్ పై కూడా ఊహించని కామెంట్లు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది.