ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు స్మార్ట్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. ఫోన్ లో గూగుల్ అకౌంట్ లోకి లాగిన్ కావడం వల్ల మీరు తీసిన ఫోటోలు, వీడియోలన్నీ గూగుల్ లో స్టోర్ అవుతాయి. 15 జీబీ ఫ్రీ స్టోరేజీ ఫుల్ అవుతుంది. స్టోరేజీ నిండటం వల్ల గూగుల్ డ్రైవ్ లో కొత్త ఫైళ్లు అప్ లోడ్ చేసే అవకాశం ఉండదు. జీమెయల్ ద్వారా మెయిల్స్ పంపించలేరు. రిసీవ్ చేసుకోలేరు. ఫోటోస్ లో బ్యాకప్ చేయలేరు. సుమారు 2 సంవత్సరాల తర్వాత గూగుల్ లోని డేటా డిలీట్ అవుతుంది. అయితే, ఈ సమస్య నుంచి తప్పించుకోవాలంటే అవసరం లేని ఫోటోలను, వీడియోలను, మెయిల్స్ ను, ఫైల్స్ ను డిలీట్ చేసుకోవాలి. అప్పుడు గూగుల్ స్టోరేజీ స్పేస్ మిగులుతుంది. ఒకవేళ మీ గూగుల్ స్టోరేజీ కూడా ఫుల్ అయితే, ఈ స్టెప్స్ ఫాలోకండి.
Google One యాప్ లేదంటే వెబ్ సైట్ లోకి లాగిన్ కావాలి. లేదంటే Google Drive, Gmail, Google Photosలో స్టోరేజ్ వివరాలను చూడవచ్చు. వీటిలో మీ స్టోరేజ్ ఎంత ఉపయోగించబడింది, ఏ సర్వీసులు (Gmail, Drive, Photos) ఎక్కువ స్పేస్ తీసుకుంటున్నాయి అనే విషయం తెలుస్తుంది.
పెద్ద ఇమెయిల్స్ తొలగించాలి. ముఖ్యమైనవి అయితే డౌన్‌లోడ్ చేసి ఆఫ్‌లైన్‌లో సేవ్ చేయండి. స్పామ్, ట్రాష్ ఫోల్డర్లను ఖాళీ చేయాలి. పాత, అవసరం లేని ఇమెయిల్స్ ను డిలీట్ చేయాలి.
Google Driveలో Storage ట్యాబ్ లోకి వెళ్లి, ఎక్కువ స్పేస్ తీసుకున్న ఫైల్స్ ను చూడండి. వాటిలో అనవసర ఫైల్స్ డిలీట్ చేయండి. షేర్డ్ ఫైల్స్ లోనూ అవసరం లేనివి డిలీట్ చేయడం వల్ల స్పెస్ మిగులుతుంది.
Google Photosలో Settingsలోకి వెళ్లి, High Qualityని ఎంచుకోవాలి. ఇది ఫోటోలను కంప్రెస్ చేస్తుంది. స్పేస్ ఆదా అవుతుంది. పాత, అనవసర ఫోటోలను తొలగించాలి.
గూగుల్ స్టోరేజీ స్పేస్ పెంచుకోవాలంటే Google Oneలో Manage Storage ఆప్షన్స్ ను ఉపయోగించాలి. ఇది అనవసరమైన ఫైల్స్, పెద్ద ఇమెయిల్స్, బ్లరీ ఫోటోలను గుర్తించి తొలగించడానికి సహాయపడుతుంది.
ఒకవేళ మీకు ఎక్కువ స్పేస్ కావాలనుకుంటే Google One ద్వారా పెద్ద స్టోరేజ్ ప్లాన్ (100GB, 200GB, 2TB) కొనుగోలు చేయవచ్చు. ఆయా స్పేస్ కు తగినట్లుగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
ముఖ్యమైన ఫైల్స్ ను ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్ లేదంటే ఇతర క్లౌడ్ సేవలకు (OneDrive, Dropbox) బ్యాకప్ చేసి, Google Drive నుంచి తొలగించాలి. ఇలా చేయడం వల్ల కూడా స్పేస్ తగ్గుతుంది.
Read Also: అద్భుతం.. 1700 కిమీల దూరంలో ఉన్న శిశువుకు ఆన్‌లైన్‌లో సర్జరీ చేసిన డాక్టర్.. అదెలా?