BigTV English

Bigg Boss 9 Promo: తనూజా చేతే లవ్ సీక్రెట్ బయటపెట్టించిన నాగ్!

Bigg Boss 9 Promo: తనూజా చేతే లవ్ సీక్రెట్ బయటపెట్టించిన నాగ్!

Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. తెలుగు బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి సీజన్ 9 ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ప్రతి ఆదివారం సండే ఫన్డే అనే కార్యక్రమంతో హోస్ట్ నాగార్జున (Nagarjuna ) కంటెస్టెంట్స్ ని ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రెండవ వారానికి సంబంధించిన సండే వచ్చేసింది. ఇందులో నాగార్జున ఎప్పటిలాగే తన టెక్నిక్స్ తో కంటెస్టెంట్స్ పర్సనల్ విషయాలను కూడా బయటకు లాగే ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కన్నడ ముద్దుగుమ్మ తనూజ లవ్ స్టోరీని ఆమె చేతే బయటపెట్టించి అందరినీ ఆశ్చర్యపరిచారు నాగార్జున.


కాఫీ సీక్రెట్ చెప్పేసిన తనూజ..

అసలు విషయంలోకి వెళ్తే.. 14వ రోజుకు సంబంధించి మొదటి ప్రోమోని నిర్వాహకులు విడుదల చేశారు. ఈ ప్రోమో చాలా సరదాగా సాగింది అని చెప్పవచ్చు. నాగార్జున ఎప్పటిలాగే అదిరిపోయే పర్ఫామెన్స్ తో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత నాగార్జున మాట్లాడుతూ.. తనూజ ఇంత సేపు కిచెన్ లో ఏం చేస్తున్నావ్? అని అడగగా.. తనూజ చిన్న కాఫీ పొడి డబ్బా కోసం సార్ అంటూ సమాధానం ఇచ్చింది. దానికి నాగార్జున నాకు చిన్న సీక్రెట్ చెబితే అని చెబుతుండగానే అమ్మో నేనా వెళ్తున్నాను అంటూ తప్పించుకునే ప్రయత్నం చేసింది తనూజ.

ఆమె చేతే లవ్ మేటర్ మొత్తం రివీల్..


తనూజ మాట్లాడుతూ.. నేను అంత ఈజీగా ఎవరి ప్రేమలో పడలేను. అంత క్రష్ కూడా నాకు ఎవరి పైన కలగలేదు. కానీ అంటూ గుండెలపై చేయి వేసుకొని టెన్షన్ పడిపోయింది తనూజ. ఒక కాఫీ షాప్ లో నేను ఒక వ్యక్తిని కలిశాను అంటూ తన లవ్ సీక్రెట్ రివీల్ చేసింది తనూజ. ఇక నాగార్జున మాట్లాడుతూ.. ఇమ్ము నువ్వు మాట్లాడిన రమేష్ కాదు అలా అయితే అంటూ కామెంట్ చేయగా.. రమేష్ ఎవరు అని ఆశ్చర్యంగా అడిగింది తనూజ. దానికి ఈ వారం ఎపిసోడ్స్ లో ఇమ్మానుయేల్ – తనూజ మధ్య కాన్వర్జేషన్ ను నాగార్జున గుర్తుచేస్తూ చెయ్యిని చెవి దగ్గర పెట్టుకొని ముద్దులు పెట్టడం మొదలుపెట్టాడు. మొత్తానికి అయితే సిగ్గు పడిపోయింది తనూజ. అలా తనూజ లవ్ స్టోరీని బయటపెట్టించి అందర్నీ ఆశ్చర్యపరిచారు నాగార్జున.

సందడిగా సాగిన ప్రోమో..

ఇక తర్వాత సండే ఫండే లో భాగంగా ఓనర్స్ కి , టెనెంట్స్ కి మధ్య ఒక టాస్క్ నిర్వహించారు నాగార్జున. అందులో భాగంగానే ఎప్పటిలాగే సాంగ్ ప్లే అవుతుంది. ఆ తర్వాత పాటను పాడి మిగతా వాళ్ళు వినిపించాల్సి ఉంటుంది. “గెస్ ద లిరిక్స్” అంటూ సాగిన ఈ టాస్క్ లో కూడా కంటెస్టెంట్స్ తమ పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నారు. ఒక పాట ప్లే చేయగా ఇమ్మానుయేల్, శ్రీజ పార్టిసిపేట్ చేశారు. అయితే మొదట ఇమ్మానియేల్ బెల్ కొట్టగా..శ్రీజ పాట పాడింది. కానీ శ్రీజ ఆగిపోవడంతో ఇమ్మానుయేల్ పాడారు. కానీ శ్రీజ ఆ పాట పూర్తిగా పాడడంతో.. ఈ పాట నీకు ఎలా గుర్తుంది అని ఇమ్ము అడగ్గా.. నాగార్జున మాట్లాడుతూ.. శ్రీజ జీన్స్ ప్యాంటు వేసుకున్నప్పుడు చాలామంది కుర్రాళ్ళు ఆ పాట పాడారు అంటూ అందరినీ నవ్వుల్లో ముంచేశారు. అలా మొత్తానికైతే ఈ ప్రోమో చాలా సందడిగా సాగింది.

 

ALSO READ:Manchu Lakshmi: రామ్ చరణ్ ఇంట్లో ఉన్న మంచు లక్ష్మి… టాప్ సీక్రెట్ రివీల్  

 

Related News

Bigg Boss 9 Telugu : మళ్లీ కెప్టెన్ అయ్యాడు.. ఆడియన్స్ కు బిగ్ బాస్ పిచ్చెక్కిస్తున్నాడే..

Bigg Boss 9: 2వారాలకు గానూ మర్యాద మనీష్ ఎంత సంపాదించారో తెలుసా?

Bigg Boss Telugu 9 day 13: తు.. తు.. నువ్వు ఆగమ్మా.. దమ్ము శ్రీజకి నాగ్ కౌంటర్, ప్రియకు ఝలక్.. ఓనర్స్ గా మారిన సెలబ్రిటీలు

Bigg Boss Telugu 9 Day 13: రీతూ బండారం బయపెట్టిన నాగ్.. భరణికి అన్యాయం, డిమోన్ కెప్టెన్సీ రద్దు..

Bigg Boss 9: ప్రియా శెట్టి పగిలిపోయే వార్నింగ్ ఇచ్చిన కింగ్, డిమాన్ పవన్ కెప్టెన్సీ రద్దు

Bigg Boss 9 : మర్యాద మనీష్ ఎలిమినేటెడ్, ఎలిమినేట్ అవ్వడానికి కారణాలు ఇవే 

Rithu Chowdary: వాళ్ల వల్లే ఆమె నన్ను వదిలేసింది.. ఇంకా విడాకులు తీసుకోలేదు.. రీతూ భర్త షాకింగ్ కామెంట్స్!

Big Stories

×