Manchu Manoj -Fish Venkat: సినీ నటుడు ఫిష్ వెంకట్(Fish Venkat) అనారోగ్య సమస్యలతో మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈయన గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హాస్పిటల్ పాలయ్యారు. తన చికిత్స కోసం సహాయం చేయాలి అంటూ వెంకట్ కుటుంబ సభ్యులు సినిమా ఇండస్ట్రీని కోరిన ఎవరు కూడా సహాయం చేయలేకపోయారు. ఇక ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించిన నేపథ్యంలో గత రాత్రి ఈయన తుది శ్వాస విడిచారు. ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన తోటి నటీనటులు ఆయన చివరి చూపు కోసం తరలి వెళ్లారు. అలాగే నటి కరాటే కళ్యాణి తదితరులు కూడా ఫిష్ వెంకట్ చివరి చూపు కోసం తరలి వెళ్లారు.
వీడియో కాల్ చేసి పరామర్శించిన మనోజ్…
ఫిష్ వెంకట్ మరణించడంతో సినిమా ఇండస్ట్రీ నుంచి కూడా సరైన స్పందన లేకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీపై ఫిష్ వెంకట్ అభిమానులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇండస్ట్రీలో ఉన్నటువంటి అందరి హీరోల సినిమాలలో నటించిన ఒక నటుడు చనిపోతే కనీస స్పందన కూడా లేకపోతే ఎలా? అంటూ మండిపడుతున్నారు. ఇక ఫిష్ వెంకట్ మరణ వార్త తెలిసిన వెంటనే సినీ నటుడు మంచు మనోజ్(Manchu Manoj) తన టీమ్ ను అక్కడికి పంపించి వీడియో కాల్ ద్వారా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఏ కష్టం వచ్చిన నేనున్నా…
మంచు మనోజ్ వీడియో కాల్ చేసి మొదట తన కుమార్తెతో మాట్లాడారు. “నన్ను క్షమించండి అమ్మా..నేను ప్రస్తుతం ఇక్కడ లేను.. మరొక రెండు రోజులలో హైదరాబాద్ వస్తానని, అప్పుడు తప్పకుండా నేనే మీ ఇంటికి వస్తానని తెలిపారు. మీరు ఏమీ ఆధైర్య పడవద్దు, మీకు ఎప్పుడు కష్టం వచ్చినా అన్నగా నేనున్నాను, మీకు ఒక నెంబర్ కూడా ఇస్తాను ఏ చిన్న సహాయం కావాలన్నా వెంటనే ఫోన్ చేయండి అంటూ భరోసా కల్పించారు. అనంతరం ఫిష్ వెంకట్ భార్యతో కూడా మాట్లాడారు ఆమె మంచు మనోజ్ ను చూడగానే కన్నీరు పెట్టుకున్నారు. ఇలా మంచు మనోజ్ వీడియో కాల్ చేసి మరి ఆ కుటుంబానికి ధైర్యం నింపడమే కాకుండా ఏ కష్టం వచ్చినా నేనున్నానని భరోసా కల్పించడంతో అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం మనోజ్ అందుబాటులో లేకపోవడం వల్లే కలవలేక పోతున్నానని రెండు రోజులలో తానే స్వయంగా ఫిష్ వెంకట్ కుటుంబ సభ్యులను కలుస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మంచు మనోజ్ మంచి మనసుపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఏ ఒక్క హీరో కూడా ఫిష్ వెంకట్ మరణం పై ఇలా స్పందించకపోవడం గమనార్హం. ఇక ఫిష్ వెంకట్ రెండు కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతోనే మరణించిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న ఈయన ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఎన్నో ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ నటించిన ఆది సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఫిష్ వెంకట్ 100కు పైగా సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన ఈయన మరణం ఇండస్ట్రీకి తీరని లోటు అని చెప్పాలి.
Also Read: Genelia: ఆ సీక్వెల్ చేయాలని ఉంది.. దర్శక నిర్మాతలదే ఆలస్యం?