Genelia: జెనీలియా (Genelia)తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు. 2003వ సంవత్సరంలో సొంతం అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన ఈమె అనంతరం బాయ్స్ ,బొమ్మరిల్లు, రెడీ, ఢీ వంటి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక బొమ్మరిల్లు సినిమా జెనీలియా కెరియర్ లో ఎప్పటికీ మర్చిపోలేని సినిమా అని చెప్పాలి. ఈ సినిమాలో హాసిని(Hasini) పాత్రలో నటించిన జెనీలియా తెలుగు ప్రేక్షకులకు హాసినిగానే గుర్తుండిపోయారు. ఇలా సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ తన కెరియర్ పీక్ స్టేజ్ లో ఉన్న సమయంలోనే ఈమె పెళ్లి చేసుకొని సినిమా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇలా పెళ్లి తర్వాత పిల్లలు పుట్టడంతో సుమారు 13 సంవత్సరాల పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు.
గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన జెనీలియా..
జెనీలియా బాలీవుడ్ నటుడు నిర్మాత రితేష్ దేశ్ ముఖ్ (Riteish Deshmukh)అనే వ్యక్తిని పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు కూడా జన్మించారు. ఇక పిల్లలు పెద్దవాళ్లు కావడంతో జనీలియా తిరిగి ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. తాజాగా ఈమె జూనియర్ (Junior)అనే సినిమా ద్వారా సౌత్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కిరీటి రెడ్డి హీరోగా నటించిన ఈ సినిమాలో జెనీలియా అద్భుతమైన పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. ఇక ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి టాక్ సొంతం చేసుకుంది.
బొమ్మరిల్లు 2 చేయాలని ఉంది…
ఇక ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా జెనీలియా కూడా వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ క్రమంలోనే యాంకర్ సుమతో కలిసి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ సందర్భంగా సుమ జెనీలియా నటించిన బొమ్మరిల్లు (Bommarillu)సినిమా షూటింగ్ కి సంబంధించి ఒక ఫొటో చూపించారు. ఇందులో సిద్దార్థ్, జెనీలియా ఉన్నారు. ఈ ఫోటో చూసిన ఈమె వావ్.. బొమ్మరిల్లు టైంలో తీసుకున్న ఫోటో ఇది. అయితే ఈ సినిమా ఇటీవల రీ రిలీజ్ అయినప్పుడు నేను ఇండియాలో లేనని అందుకే రాలేకపోయానని తెలియజేశారు. ఇకపోతే తాను బొమ్మరిల్లు 2(Bommarillu 2) చేయటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ తన మనసులో కోరికను కూడా బయటపెట్టారు.
బొమ్మరిల్లు భాస్కర్..
ఇలా జెనీలియా బొమ్మరిల్లు సీక్వెల్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నానని తెలియజేయడంతో వెంటనే సుమ స్పందిస్తూ… మేం కూడా అదే కోరుకుంటున్నాము నిజం చెప్పాలంటే మీకు ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ ఇప్పటికీ కూడా మిమ్మల్ని హాసిని లాగే సినిమాలో పెట్టొచ్చు అలాగే ఉన్నారు, ఏమాత్రం మార్పు లేదు అంటూ తెలియచేశారు. మరి జెనీలియా బొమ్మరిల్లు సీక్వెల్ చేయటానికి సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ సినిమా సీక్వెల్ కోసం దర్శక నిర్మాతలదే ఆలస్యమని తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు భాస్కర్(Bhaskar) దర్శకత్వం వహించగా ఈ సినిమా అద్భుతమైన విజయం అందుకోవడంతో ఆయన ఇంటి పక్కన బొమ్మరిల్లు సినిమా పేరు చేరి బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయారు. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. 2006లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలనాలను సృష్టించిన సంగతి తెలిసిందే.
Also Read: Manchu Vishnu: రామాయణం ఆలోచనలో మంచు విష్ణు… ఎవరు ఏ పాత్రలో అంటే?