Hari Hara Veera Mallu Movie Ticket Prices Hike: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మోస్ట్ అవైయిటెడ్ మూవీ ‘హరి హర వీరమల్లు‘. ఎన్నో వాయిదాల తర్వాత ఈ మూవీ థియేటర్లలో సందడి చేసేందుకు రాబోతోంది. జూలై 24న ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది. దీంతో మూవీ మేకర్స్ నిర్మాణాంతర కార్యక్రమాలను చకచక జరుపుకుంటోంది. ఇప్పటికే ప్రీమియర్స్ షోలకు అనుమతి కోసం నిర్మాత ఏఎం రత్నం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. టికెట్ రేట్ల పెంపు కోసం కూడా రెండు ప్రభుత్వాలను కోరుతున్నారు.
ఏపీలో టికెట్స్ ఇలా..
ఈ క్రమంలో తాజాగా ఆంధ్రప్రదేశ్ లో టికెట్ల రేట్ల పెంపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు జీవో జారీ చేసింది. సింగిల్ స్క్రిన్స్‌లో టికెట్‌పై రూ.100 నుంచి రూ.150 వరకు పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లో రూ.200 వరకు పెంచుకునేలా వెసులు బాటు కల్పించింది. దీంతో ధరల పెంపు తర్వాత సింగిల్ స్క్రీన్స్ టికెట్ రేట్స్ రూ. 297గా ఉండగా.. మల్టీప్లెక్స్ లో రూ. 377గా ఉంది. ఇక పుష్ప 2 మూవీకి టికెట్ రేట్స్ కూడా ఇలాగే ఉండటం గమనార్హం. మరోవైపు 23న ప్రీమియర్స్‌కు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రీమియర్స్ షోలకు ఒక్కో టికెట్ ధర రూ.800 నుంచి రూ.1000 వరకు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ ధరలను కేవలం మొదటి పది రోజుల వరకే అవకాశం ఇచ్చింది.
తెలంగాణలో టికెట్ రేట్స్?
ఏపీలో హరి హర వీరమల్లు టికెట్స్ రేట్స్, పెయిడ్ ప్రీమియర్స్ కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నిల్ ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పందన కోసం మేకర్స్ వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలోనూ టికెట్ ధరలను పెంచాలని కోరుతూ నిర్మాత ఏఎం రత్నం ప్రభుత్వానికి ఆర్జీ పెట్టుకున్నారు. త్వరలోనే దీనిపై కూడా స్పష్టం వచ్చే అవకాశం ఉంది. కాగా, పీరియాడిక్ చిత్రం కావడంతో టికెట్ ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నిల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. అలాగే పెయిడ్ ప్రీమియర్స్ విషయంలో ప్రతికూల స్పందన వచ్చేలా కనిపిస్తోంది.
Also: Read: Sid Sriram: నలుగురు బాడీగార్డ్స్.. నీకు అవసరమా సిద్ధూ.. చుక్కలు చూస్తోన్న నిర్మాతలు..
ట్రైలర్ తో పెరిగిన అంచనాలు
కాగా ట్రైలర్ ముందు వరకు మూవీపై పెద్దగా బజ్ లేదు. కానీ, ట్రైలర్ తర్వాత హరి హర వీరమల్లుపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. బయ్యర్స్, ఎగ్జిబిటర్స్ లో మూవీపై ఉన్న అనుమనాలు, అభిప్రాయాలన్ని మారిపోయాయి. దీంతో సినిమా తీసుకునేందుకు బయ్యర్లు కూడా ముందు వచ్చారు. కానీ, ఏఎం రత్నం మూవీ రేట్స్ భారీగా పలుకుతున్నారు. దీంతో దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్ వంటి బడా సంస్థలు సినిమా రైట్స్ పై బేరాలు ఆడుతున్నారు. కానీ, నిర్మాత ఏఎం రత్నం మాత్రం తగ్గేదే లే అంటున్నారు. దీంతో నిజాం, సీడెడ్ వంటి మేజర్ ఏరియాల్లో ఈ మూవీ కొత్త బయ్యర్ల చేతికి వెళ్లింది. కాగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణలు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏఎం రత్నం ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఎం రత్నం సంగీతం అందించారు.