BigTV English

Manchu Vishnu: ఆ కన్నప్ప తిన్నాడేమో.. ఈ కన్నప్ప మాత్రం తినలే.. విష్ణు షాకింగ్ కామెంట్స్

Manchu Vishnu: ఆ కన్నప్ప తిన్నాడేమో.. ఈ కన్నప్ప మాత్రం తినలే.. విష్ణు షాకింగ్ కామెంట్స్

Manchu Vishnu: మంచు విష్ణు ఆధ్యాత్మిక చిత్రమైన కన్నప్ప (Kannappa)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఇలా ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో సినిమాకు వరుస వివాదాలు చుట్టుకుంటున్నాయి. ఇక ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుష్ప్రచారాలు వస్తున్న నేపథ్యంలో మాటల రచయిత స్పందిస్తూ ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఈ సినిమా ఆ పరమ శివుడి పట్ల భక్తకన్నప్ప అనే భక్తుడు ఎలా తన భక్తిని చూపించారనే నేపథ్యంలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.


ఇక ఈ సినిమాని మోహన్ బాబు(Mohan Babu) తన సొంత నిర్మాణ సంస్థలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇలాంటి తరుణంలోనే మంచు విష్ణు వరుస సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయనకు ఈ సినిమా షూటింగ్ సమయంలో నాన్ వెజ్(Non Veg) తిన్నారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.

చెడు అలవాట్లు లేవు…


ఈ ప్రశ్నకు విష్ణు ఆసక్తికర సమాధానం చెప్పారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ నాకు ఫుడ్ అంటే చాలా ఇష్టమని ఫుడ్ తప్ప నాకు ఇతరాలు అలవాట్లు ఏమీ లేవని తెలిపారు. అందుకే నేను నాకోసం ప్రత్యేకంగా కొంతమంది చెఫ్ లను ఏర్పాటు చేసుకున్నానని, గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళు నాతో పాటే ఉంటూ నాకు కావలసినవి చేసి పెడతారని తెలిపారు. అయితే ఈ సినిమా సమయంలో తాను నాన్ వెజ్ తిన్నానని తెలిపారు. అయితే శివుడి గురించి షూటింగ్ జరిగే రోజు మాత్రం నాన్ వెజ్ తినలేదని మిగిలిన సమయంలో నాన్ వెజ్ తిన్నానని తెలిపారు. ప్రతిరోజు ఉదయం షూటింగ్ మొదలయ్యే సమయానికి ప్రత్యేకంగా వాయు లింగానికి పూజలు చేసి అనంతరం షూటింగ్ ప్రారంభించే వాళ్ళమని విష్ణు తెలిపారు. నాన్న తప్పనిసరిగా ప్రతిరోజు పూజ చేసిన తర్వాతే షూటింగ్ ప్రారంభించే వాళ్ళని తెలియజేశారు.

శివయ్యే మాంసాహారం తిన్నాడు…

ఇక భక్త కన్నప్ప అనే భక్తుడు ఆ పరమశివుడికి స్వయంగా మాంసాహారాన్ని కూడా నైవేద్యంగా పెట్టిన అంశాన్ని ప్రస్తావించారు. ఇలా ఆ పరమశివుడే మాంసాహారాన్ని తీసుకున్నప్పుడు మనం తీసుకోవడంలో తప్పులేదు. శివయ్యకు సంబంధించిన సన్నివేశాలు షూట్ చేసేటప్పుడు మాత్రం ముట్టుకోలేదని ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు. ఇక మంచు విష్ణు కన్నప్ప సినిమా తన డ్రీం ప్రాజెక్టు అని, దాదాపు పది సంవత్సరాలపాటు ఈ సినిమా కోసం ఎంతగానో కష్టపడుతున్నానని తెలియజేశారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా భాగమయ్యారు .అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ ప్రభాస్ మోహన్ లాల్ వంటి వారందరూ భాగమైన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమాపై మంచి అంచనాలను పెంచేస్తున్నాయి.

Also Read: Kannappa Movie: కన్నప్ప పై దుష్ప్రచారం… సంచలన లేఖ విడుదల చేసిన రచయిత!

Related News

Janhvi Kapoor: తడిచీరలో దేవర బ్యూటీ అందాల విందు.. పరమ్ సుందరి రెయిన్ సాంగ్ చూశారా ..?

Kaantha: దుల్కర్- భాగ్యశ్రీ కెమిస్ట్రీ చూశారా.. ఇదేదో బాగా వర్క్ అవుట్ అయ్యేలానే ఉందే

Couple Friendly : అమ్మ బాబోయ్ ఆ కిస్సులు ఏంటన్నా, సంతోష్ శోభన్ రూట్ మార్చాడు భయ్యా

War2 Pre Release: వార్ 2 ప్రీ రిలీజ్ వేడుకకు సర్వం సిద్ధం… ఎప్పుడు.. ఎక్కడంటే?

Nagarjuna: కూలీ సినిమాతో పాటు ఆ బ్లాక్ బస్టర్ సినిమా ట్రైలర్, నాగార్జున మామూలు ప్లానింగ్ కాదు.

Aishwarya Rai: అత్యంత ధనవంతురాలిగా 2వ స్థానం.. ఐశ్వర్య ఆస్తుల విలువ ఎన్ని కోట్లంటే?

Big Stories

×