Kannappa Movie: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప(Kannappa) సినిమా గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వివాదాలను ఎదుర్కొంటూనే ఉంది. ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్స్ రావడం సినిమాపై ట్రోల్స్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో సినిమాకు సంబంధించిన ఒక హార్డ్ డిస్క్ మాయం కావటం సంచలనం రేపింది. ఇలా ఒక్క వివాదాన్ని ఎదుర్కొంటూ వస్తున్న ఈ సినిమా మరొక వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాకు బ్రాహ్మణ సంఘాల నుంచి పూర్తిస్థాయిలో వ్యతిరేకత వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో బ్రాహ్మణులను కించపరిచే విధంగా ఉంటే తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా సెన్సార్ సభ్యులు కూడా దాదాపు 13 సన్నివేశాలకు కత్తెర పెట్టారని, ఈ సినిమా గురించి ఎన్నో వదంతులు బయటకు వచ్చాయి.
దుష్ప్రచారాలు..
ఇలా ఈ సినిమా గురించి ఎన్నో రకాల దుష్ప్రచారాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో సినిమా కథా రచయిత ఆకెళ్ల శివ ప్రసాద్ స్పందిస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ లేఖలో భాగంగా ఈయన కన్నప్ప సినిమాపై జరుగుతున్న దుష్ప్రచారాలను ఖండించారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. తెలుగు సినిమా ప్రేక్షకులకు, అన్ని కులాల వారికి ముఖ్యంగా బ్రాహ్మణ మిత్రులందరికీ.. నమస్సులు! గత కొంతకాలంగా కన్నప్ప సినిమా గురించి జరుగుతున్న దుష్ప్రచారాలు చూసి ఈ సినిమా కోసం మాటల రచయితగా పని చేసిన నాకు ఎంతో బాధ కలిగింది. అందుకే సినిమాకు సంబంధించి కొన్ని విషయాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను అంటూ ఈయన తెలియజేశారు.
శ్రీకాళహస్తి మహత్యం నుంచి ప్రేరణ..
నా పేరు ఆకెళ్ళ శివప్రసాద్ (Siva Prasad)నేను కూడా బ్రాహ్మణుడిని.నేను మాత్రమే కాకుండా ఈ సినిమా కోసం దర్శకుడిగా పని చేసిన ముఖేష్ కుమార్ సింగ్ కూడా ఉత్తరాది బ్రాహ్మణుడు. ఈయన మహాభారతాన్ని ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ సినిమాలో బ్రాహ్మణులను కానీ ఇతర కులాల వారిని కించపరిచే విధంగా ఒక్క సన్నివేశం కూడా లేదు. గతంలో శ్రీకాళహస్తి మహోత్సవం గురించి సినిమాలు చేసిన వారైనా కాస్త నెగిటివ్గా చూపించారు కానీ ఈ సినిమాలో అలాంటి నెగెటివిటీ కూడా లేదని తెలిపారు. 16వ శతాబ్దపు కవి ధూర్జటి రాసిన శ్రీ శ్రీకాళహస్తి మహత్యం నుంచి ప్రేరణ తీసుకున్న చిత్రమని తెలిపారు., శ్రీ మోహన్ బాబు(Mohan Babu) గారు పోషించిన మహదేవ శాస్త్రి పాత్రని మహా శివ భక్తుడి పాత్రగా చాలా ఉన్నతంగా తీర్చిదిద్దారు. ఈ విషయం సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా స్పష్టంగా అర్థం అవుతుందని తెలిపారు.
పరమశివుడే చూసుకుంటాడు…
ఇక ఈ సినిమా కథ రాస్తున్నప్పుడు మాత్రమే కాకుండా సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత శ్రీకాళహస్తి ఆలయానికి వెళ్లి అక్కడ ప్రధాన అర్చకులకు చూపించామని, వారు కూడా విష్ణు మోహన్ బాబును వేదమంత్రాలతో ఆశీర్వదించారని తెలిపారు. ఈ సినిమాలో పాటలు రాసిన రామ జోగయ్య శాస్త్రితో పాటు పలు విభాగాలలో బ్రాహ్మణులు పనిచేశారని, అయితే ఎవరిని కించపరుస్తూ ఒక్క సన్నివేశం కూడా లేదని తెలిపారు. అంతేకాకుండా కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ సినిమాలు చేయాల్సిన పనిలేదు. ఇలా కన్నప్ప సినిమా గురించి ఏవేవో వదంతులు పుట్టిస్తున్న వారిని ఆ పరమ శివుడే చూసుకుంటారు అంటూ శివప్రసాద్ ఈ సినిమాపై జరుగుతున్న దుష్ప్రచారానికి క్లారిటీ ఇచ్చారు.
Also Read: Keerthy Suresh: వేమన పద్యం అలవోకగా చెప్పిన కీర్తి సురేష్.. ఇలాంటి టాలెంట్ కూడా ఉందా?