Ashwin on Kohli : టీమిండియా ప్రస్తుతం WTC 2023-25 కి సంబంధించి ప్రస్తుతం ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ సిరీస్ లు ఆడనుంది. రేపటి నుంచి ఇంగ్లాండ్ తో సిరీస్ ప్రారంభం కానుంది. అయితే ఇటీవలే టీమిండియా కీలక ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో సీనియర్ ఆటగాళ్లు లేకుండా టీమిండియా టెస్ట్ ల్లో రాణిస్తుందా..? అనే సందేహం వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియాలో రోజుకొక వార్త టీమిండియా పై పుట్టుకొస్తుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా టెస్ట్ క్రికెట్ కి గుడ్ బై చెప్పేసిన ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ.. పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. అందులో ముఖ్యంగా రన్ మెషిన్ విరాట్ కోహ్లీ పరువు తీసేశాడు.
Also Read : Shikhar Dhawan- Chahal : బాహుబలిలా ధావన్.. చత్రపతి శివాజీ ఇలా చాహల్.. ఇద్దరూ పెళ్ళాలను వదిలేసి!
ముఖ్యంగా ఆటకంటే ఎవ్వూ ఎక్కవ కాదని పేర్కొన్నాడు అశ్విన్. ఎంతటి తోపు ప్లేయర్లు అయినా గేమ్ తరువాతనే అని తెలిపాడు. క్రికెట్ అందరి కంటే గొప్పదని.. ఇప్పటివరకు ఆడిన ఆటగాళ్లు ఇక మీదట ఆడేవారి కంటే ఆటే అత్యుత్తమైనదని వెల్లడించాడు. ఒక్కో దశలో ఒక్కో ఆటగాడు ఆట మీద మంచిగానో లేదా చెడుగానో ప్రభావం చూపించవచ్చు. వాళ్లను ఆట కంటే గొప్పగా.. అతీతులుగా చూడటం సరికాదన్నారు. క్రికెట్ కంటే ఏ ఆటగాడిని కూడా గొప్పగా చూడాల్సిన అవసరం లేదన్నాడు సీనియర్ స్పిన్నర్ అశ్విన్. ఇక ఇది చూసిన నెటిజన్లు కోహ్లీ పీఆర్ టీమ్ ను టార్గెట్ చేసుకొనే అశ్విన్ ఇలాంటి వ్యాఖ్యలు చేసాడని అంటున్నారు. మరికొందరేమో ఆటకు అత్యుత్తమ సేవలందించిన వారిని గొప్పగా ప్రెజెంట్ చేయడంలో.. హైప్ ఇవ్వడంలో తప్పు లేదని పేర్కొంటున్నారు.
Also Read : Austraila – WC 2023 : ఆస్ట్రేలియా పతనం ఇక్కడి నుంచే మొదలైంది… అప్పుడు బలుపు చూపించకపోతే బాగుండు
వాస్తవానికి భారత్-ఇంగ్లాండ్ మధ్య అంతర్జాతీయ మ్యాచ్ ల్లో విరాట్ కోహ్లీ అత్యంత విజయవంతమైన బ్యాట్స్ మెన్. అన్ని ఫార్మాట్లలో కూడా కోహ్లీ 4,036 పరుగులు చేసాడు. విరాట్ తరువాత సచిన్ టెండూల్కర్ 3,990 పరుగులతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ క్రికెటర్ రూట్ భారత్ పై 13 సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు చేశాడు. ప్రస్తుతం 3858 రన్స్ తో ఉన్న రూట్.. మరో 133 పరుగులు చేస్తే సచిన్ ను అధిగమిస్తాడు. 179 పరుగులు చేస్తే.. రూట్ కోహ్లీ రికార్డును బ్రేక్ చేసి టాప్ లోకి వెళ్తాడు. రూట్ మరో హాఫ్ సెంచరీ చేస్తే.. సచిన్, కోహ్లీ లను దాటేస్తాడు. ఇప్పటివరకు భారత్ – ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్టుల్లో అత్యధికంగా దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ 16 హాఫ్ సెంచరీలు చేసాడు. సచిన్ టెండూల్కర్ 13 హాఫ్ సెంచరీలతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. జో రూట్ 11 హాఫ్ సెంచరీలతో తరువాత స్థానంలో ఉన్నాడు. రూట్ మరో 3 హాఫ్ సెంచరీలు చేస్తే.. సచిన్ ను అధిగమిస్తాడు. ఒకవేళ 6 హాఫ్ సెంచరీలు చేస్తే గావస్కర్ ను అధిగమించి ఈ జాబితాలో టాప్ స్థానంలో కొనసాగనున్నాడు. ఇంగ్లాండ్ టూర్ లో భారత ఆటగాళ్లు ఏ విధంగా ఆడుతారో వేచి చూడాలి మరీ.