BigTV English
Advertisement

Manchu Brothers: కన్నప్పకు మనోజ్ రివ్యూ… విష్ణు రియాక్షన్ ఇదే.. మంచు వార్ ముగిసిందా?

Manchu Brothers: కన్నప్పకు మనోజ్ రివ్యూ… విష్ణు రియాక్షన్ ఇదే.. మంచు వార్ ముగిసిందా?

Manchu Brothers:  మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప (Kannappa)సినిమాతో చాలా రోజుల తర్వాత ఒక సక్సెస్ సినిమాని అందుకున్నారు. ఈ సినిమాకు ఎంతో మంచి ఆదరణ వస్తున్న నేపథ్యంలో చిత్ర బృందం థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన సినిమాకు సంబంధించిన విషయాల గురించి అలాగే సినిమాలో నటించిన నటీనటుల గురించి ఎన్నో విషయాలను వెల్లడించారు. ఇక సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రేక్షకులే దేవుళ్ళని ఈ సినిమాని ఇంత విజయం చేసిన ప్రేక్షక దేవుళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే మీడియా వారికి  కూడా ఈ సందర్భంగా విష్ణు ధన్యవాదాలు తెలిపారు.


మనోజ్ కు థాంక్స్…

ఈ మీడియా సమావేశంలో భాగంగా రిపోర్టర్స్ మంచు మనోజ్ (Manchu Manoj)గురించి కొన్ని ప్రశ్నలు వేశారు. ఇటీవల కాలంలో మీ కుటుంబంలో ఎన్నో భేదాభిప్రాయాలు వచ్చాయి. అయితే వీటన్నింటినీ పక్కనపెట్టి మీ బ్రదర్స్ మంచు మనోజ్ మొదటి రోజే సినిమా చూడటం కోసం వచ్చి సినిమాకు చాలా మంచి రివ్యూ(Review) ఇచ్చారు. దానిపై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న విష్ణుకి ఎదురయింది. ఈ ప్రశ్నకు విష్ణు సమాధానం చెబుతూ.. ఈ సినిమా కోసం ఎవరైతే పాజిటివ్ రివ్యూ ఇచ్చారో వారందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అంటూ మంచు మనోజ్ పేరు ఎత్తకుండా మాట్లాడారు. సాధారణంగా మనోజ్ పేరు వస్తేనే టాపిక్ మార్చే విష్ణు ఈసారి ఏకంగా థాంక్స్ చెప్పడంతో ఈ అన్నదమ్ముల మధ్య గొడవలకు పులి స్టాప్ పెట్టినట్లేనా? మంచు వార్ ముగిసినట్టేనా? అంటూ అభిమానులు సందేహాలు వ్యక్తపరుస్తున్నారు.


కలలో కూడా ఊహించలేదు…

ఇక కన్నప్ప సినిమాకి మొదటి నుంచి కూడా మంచు విష్ణు ఎంతో సానుకూలంగా వ్యవహరిస్తూ సినిమా సక్సెస్ కావాలని కోరుకున్నారు. ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ఐమాక్స్ లో ఈ సినిమాని వీక్షించిన మనోజ్ సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా వేరే లెవెల్ కి వెళ్లిపోయిందని తెలిపారు. విష్ణు నటన గురించి అడిగితే నేను ఊహించిన దాని కంటే కూడా వెయ్యిరెట్లు అద్భుతంగా ఉందని ,ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేదు అంటూ సినిమా పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

గొడవలు ఉన్న కన్నప్పకు మద్దతు..

ఇలా వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు ఉన్నప్పటికీ కన్నప్ప సినిమాని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. అలాగే గొడవలు అన్నీ పక్కన పెట్టి మనోజ్ సినిమా చూడటానికి వెళ్ళటమే కాకుండా మంచి రివ్యూ ఇవ్వడంతో మనోజ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వీరిద్దరి మధ్య గొడవలు తొలగిపోయి ఎప్పటిలాగే కలిసి ఉండాలని కోరుకుంటున్నారు.. అయితే గత కొంతకాలంగా వీరిద్దరి మధ్య విభేదాలు చోటు చేసుకున్న విషయం తెలిసిందే అలాగే కన్నప్ప సినిమాకు సంబంధించి హార్డ్ డిస్క్ మాయం కావడంతో హార్డ్ డిస్క్ మాయం కావడం వెనుక మనోజ్ ప్రమేయం ఉందనే సందేహాలు కూడా వ్యక్తం చేశారు. తన ఇంట్లో ఉన్న వాళ్లే ఈ హార్డ్ డిస్క్ తీసారని గతంలో విష్ణు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Also Read: Vishnu on Prabhas:: ప్రభాస్ వల్ల కాదు, ఆ నటుడి వల్ల సినిమా హైప్.. మంచు విష్ణు

Related News

Rashmika: ఆ డైరెక్టర్లు అయితే డార్క్ సీన్స్ అయినా ఓకే అంటున్న రష్మిక..ఎవరా నలుగురు?

Actor Death: ఆర్థిక సహాయం కోసం ఎదురుచూసి నటుడు మృతి.. ఏమైందంటే?

Film industry: హీరోయిన్లతో నటుడు రాసలీలలు… ఎవరితో నడిపించాడో తెలుసు అంటున్న భార్య

Gatha Vibhavam Trailer: టైమ్ ట్రావెల్ ప్రేమ కథ.. భలే విచిత్రంగా ఉందే

SSMB 29 : మహేష్ సినిమాలో సింహం… ఇంతలా దాచుంచడం వెనుక పెద్ద స్టోరీ ఉందే!

Manchu lakshmi : మా నాన్న నన్ను చీట్ చేశారు.. మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్..పచ్చి నిజాలు..?

Roshan Meka: మోహన్ లాల్ సినిమా నుంచి తప్పుకొని శ్రీకాంత్ కొడుకు తప్పు చేశాడా.. ?

ENE2: ఈ నగరానికి ఏమైంది 2 నుంచి తప్పుకున్న సురేష్ ప్రొడక్షన్స్..?

Big Stories

×