BigTV English

Vishnu on Prabhas: ప్రభాస్ వల్ల కాదు, ఆ నటుడి వల్లే ‘కన్నప్ప’కు హైప్.. మంచు విష్ణు

Vishnu on Prabhas: ప్రభాస్ వల్ల కాదు, ఆ నటుడి వల్లే ‘కన్నప్ప’కు హైప్.. మంచు విష్ణు

Vishnu on Prabhas: మంచు విష్ణు(Manchu Vishnu) కన్నప్ప సినిమా (Kannappa Movie) మంచి ఆదరణ సొంతం చేసుకున్న నేపథ్యంలో చిత్ర బృందం థాంక్స్ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సినిమాను విజయం చేసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి కూడా చిత్ర బృందం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం మొత్తం పాల్గొని సందడి చేశారు.. థాంక్స్ మీట్ లో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను తెలియచేశారు. ఈ సినిమా తనకొక ఎమోషనల్ జర్నీ అని తెలిపారు. ఈ సినిమా ఇంత ఆదరణ పొందుతుంది అంటే అది ప్రేక్షకుల వల్లే అంటూ విష్ణు తెలిపారు.


ప్రేక్షకులే దేవుళ్ళు..

సినిమా ఇండస్ట్రీకి ప్రేక్షకులే దేవుళ్ళని ఈ సినిమాని ఇంత మంచి సక్సెస్ చేసిన ప్రతి ఒక్క ప్రేక్షక దేవుడికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఈ సినిమాకు మంచి ఆదరణ వస్తుంది అంటే అంత శివలీలే అని తెలిపారు. ఈ థాంక్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా ఒక రిపోర్టర్ విష్ణుతో మాట్లాడుతూ అసలు మీరు ట్రోలర్స్ ఎక్కడ ఛాన్స్ ఇవ్వకుండా అద్భుతంగా నటించారని చెప్పడంతో విష్ణు మాట్లాడుతూ ఈ సినిమాలో కూడా కొన్ని కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి కానీ ఎవరు గుర్తించలేదని తెలిపారు. మేము ఆ తప్పులు కూడా జరగకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన ఒకటో రెండో మిస్టేక్స్ ఉన్నాయని తెలిపారు.


ప్రభాస్ వల్ల హైప్ లేదు..

ఇలా సినిమా విషయంలో చిన్న చిన్న పొరపాట్లు జరిగిన ప్రేక్షకులు మమ్మల్ని ఎందుకు క్షమించారో అది కూడా తెలిపారు. ప్రేక్షకులు అందరూ కూడా చివరి గంట సినిమాకు అంకితం అయ్యారని తెలిపారు. ప్రేక్షకులందరూ కూడా ప్రభాస్(Prabhas) వచ్చిన తర్వాత సినిమా వేరే రేంజ్ కు వెళ్ళిందని భావిస్తున్నారు కానీ ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా కథ ఏం మారలేదని విష్ణు కామెంట్లు చేశారు. శరత్ కుమార్(Sarath Kumar) గారు నేను వెళ్తున్నప్పుడు పిలుస్తారు అక్కడ నేను ఆగిపోతాను ఆ సమయంలో మా ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ నుంచి కథ మొత్తం మారిపోయిందని విష్ణు తెలియజేశారు.

రుద్ర పాత్రలో ప్రభాస్..

ఇలా మీరందరూ నేను బాగా నటించారని చెప్పడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు నా సినీ కెరియర్ లో నాకంటూ విసిటింగ్ కార్డు ఏదైనా ఉంది అంటే అది కన్నప్ప సినిమానే అంటూ విష్ణు తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో భాగంగా విష్ణు ప్రభాస్ పాత్ర ఎంటర్ అయిన తర్వాత సినిమా కథ మలుపు తిరగలేదని చెప్పడంతో ప్రభాస్ అభిమానులు ఒకింత ఆగ్రహానికి గురి అవుతున్నారు. ఈ వ్యాఖ్యలపై విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. ప్రభాస్ ఈ సినిమాలో నటించడం వల్ల సినిమాకు కొంచమైనా పాజిటివ్ టాక్ వచ్చింది అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా ప్రభాస్ గురించి విష్ణు చేసిన ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇక ఈ సినిమాలో ప్రభాస్ రుద్ర పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఈ పాత్రలో ప్రభాస్ ఎంతో అద్భుతంగా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

Also Read: కన్నప్ప థియేటర్లో చూడాలంటే అదృష్టం ఉండాలి.. ఓటీటీలో కుదరదు! 

Related News

Jailer 2 : హైదరాబాదులో రజనీకాంత్, షూటింగ్ ఎక్కడ జరుగుతుంది అంటే?

Akhanda 2: అఖండ 2 లో ‘గంజాయి’… బాలయ్య నుంచి మరో మెసేజ్

Jr.NTR: ఎన్టీఆర్ సినిమాలు మాత్రమే కాదండోయ్.. సీరియల్ కూడా చేశారని తెలుసా.. ఏదంటే?

Actress: డైరెక్టర్ కట్ చెప్పినా.. ముద్దులు పెడుతూనే ఉన్న హీరోయిన్, పెళ్లయినా ఇదేం పాడుబుద్ధి

Rashmika Mandanna: నమ్మలేకపోతున్నా.. విజయ్‌ ఫొటోలతో రష్మిక అలాంటి కామెంట్స్, దాచినా దాగవులే!

Balakrishna: రైట్ .. రైట్..ఆర్టీసీ డ్రైవర్ గా మారిన బాలయ్య..వీడియో వైరల్!

Big Stories

×