BigTV English

OTT Movie : టార్చర్ రూమ్ నుంచి తప్పించుకుని వచ్చి అడ్డంగా బుక్కయ్యే అమ్మాయి… చాలా దేశాలలో బ్యాన్ చేసిన మూవీ… చూస్తే రిస్క్ మీదే

OTT Movie : టార్చర్ రూమ్ నుంచి తప్పించుకుని వచ్చి అడ్డంగా బుక్కయ్యే అమ్మాయి… చాలా దేశాలలో బ్యాన్ చేసిన మూవీ… చూస్తే రిస్క్ మీదే

OTT Movie : ఓటీటీలో ఒక సైకలాజికల్ హారర్ మూవీలో బీభత్సమైన హింసతో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. ఇందులో అమ్మయిలను తీవ్రంగా టార్చర్ చేస్తారు. ఈ సీన్స్ చూడాలంటేనే చాలా భయంగా ఉంటుంది. ఈ టార్చర్ తో మరణం అంచుల దగ్గరికి తెసుకెళ్తారు. ఇలా ఎందుకు చేస్తున్నారు ? ఈ మూవీ పేరు ఏంటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే ..


అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో

ఈ ఫ్రెంచ్ సైకలాజికల్ హారర్ మూవీ పేరు ‘మార్టిర్స్’ (Martyrs). 2008లో విడుదలైన ఈ సినిమాకి పాస్కల్ లాగియర్ దర్శకత్వం వహించారు. ఇందులో మోర్జానా అలావోయ్ (అన్నా) మైలీన్ జంపనోయ్ (లూసీ) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ మూవీ దాని గ్రాఫిక్ కంటెంట్ కారణంగా 18+ రేటింగ్‌ను తెచ్చుకుంది. 1 గంట 39 నిమిషాల నిడివి ఉన్నఈ సినిమాకి,IMDbలో 7.0/10 రేటింగ్ ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime Video) లో ఈ మూవీ అందుబాటులో ఉంది.


స్టోరీలోకి వెళితే

1971లో లూసీ జురిన్ అనే టీనేజ్ అమ్మాయి, ఒక పాడుబడిన బిల్డింగ్ నుండి తప్పించుకుంటుంది. అక్కడ ఆమెను బంధించి, ఏడాది కాలం పాటు శారీరకంగా చిత్రహింసలు పెట్టి ఉంటారు. ఆమెను ఎందుకు బంధించారనే విషయం రహస్యంగానే ఉంటుంది. ఆ తరువాత లూసీ ఒక అనాథ ఆశ్రమంలో చేర్చబడుతుంది. అక్కడ ఆమె అన్నా అస్సావోయ్ అనే మరో అమ్మాయితో స్నేహం చేస్తుంది. లూసీ తన గత గాయాల వల్ల ఎవరో తనని వెంటాడుతున్నారని నమ్ముతుంది. పదిహేను సంవత్సరాల తర్వాత, 1986లో, లూసీ తనని బంధించి టార్చర్ చేసిన వాళ్ళని కనిపెట్టి కాల్చి చంపుతుంది. ఆమె అన్నాను అక్కడికి పిలుస్తుంది. ఆ తరువాత లూసీ హాల్యూసినేషన్‌లు ఆమెను తీవ్రంగా బాధపెడతాయి. లూసీ తనకు వస్తున్న హాల్యూసినేషన్‌లతో పోరాడుతూ, చివరికి తనను తాను హాని చేసుకుని చనిపోతుంది.

లూసీ మరణం తర్వాత అన్నా ఇంటిని శుభ్రం చేస్తున్నప్పుడు, ఒక రహస్య గదిని కనిపెడుతుంది. అక్కడ ఒక భయంకరంగా టార్చర్ కు గురైన ఒక స్త్రీ, తీవ్ర గాయాలతో బంధించబడి ఉంటుంది. అన్నా ఆమెను రక్షించడానికి ప్రయత్నిస్తుంది, కానీ అక్కడికి కొంతమంది వచ్చి ఆ స్త్రీని కాల్చి చంపుతారు. అక్కడే ఉన్న అన్నాను వాళ్ళు బంధిస్తారు. దీని వెనుక పెద్ద సమూహమే ఉంటుంది. వీళ్ళు యువతులను చిత్రవధ చేయడం ద్వారా, చనిపోయిన తరువాత జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటారు. తీవ్రమైన శారీరక బాధ ద్వారా, బాధితులు ఆధ్యాత్మిక ఎలివేషన్‌కు చేరుకుంటారని, దీని వల్ల మరణానంతర రహస్యాలను తెలుసుకోవచ్చని అక్కడ ఉన్న కొంతమంది నమ్ముతారు. లూసీ కూడా ఒకప్పుడు వీళ్ళ బాధితురాలే.

అన్నా ఇప్పుడు ఈ సమూహం నడిపే భయంకరమైన ఆచారానికి గురవుతుంది. ఇందులో ఆమెను చిత్రవధ చేసి, ఆమె చర్మాన్ని తొలగిస్తారు. ఈ భయంకరమైన బాధలో, అన్నా ఒక ట్రాన్స్‌సెండెంటల్ స్థితిని సాధిస్తుంది. ఆమె మరణానంతర జీవితం గురించి ఏదో రహస్యం తెలుసుకుంటుంది. ఆతరువాత క్లైమాక్స్ ఊహించని ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది. చివరికి అన్నా తెలుసుకున్న రహస్యం ఏమిటి ? ఆమె అక్కడి నుంచి ప్రాణాలతో బయట పడుతుందా ? ఆ కల్ట్ చేతిలో బలవుతుందా ? అనే విషయాలను తెలుసుకోవాలనుకుంటే, ఈ సినిమాని మిస్ కాకుండా చూడండి.

Read Also : ఈ దెయ్యం నుంచి తప్పించుకోవాలంటే ఎవరో ఒకరితో ఆ పని చేయాల్సిందే… అన్నీ అవే సీన్స్

Related News

OTT Movie : డబ్బుల కోసం అలాంటి వీడియోలో… భార్య ఉండగానే చేయకూడని పని… బెంగాలీ థ్రిల్లర్

OTT Movie : సొంత భార్యనే పరాయి మగాళ్ల దగ్గరకు… నన్ అని కూడా చూడకుండా… మతిపోగోట్టే మలయాళ క్రైమ్ డ్రామా

Friday OTT Movies : మూవీ లవర్స్ కు జాతరే.. ఒక్కరోజు ఓటీటీలోకి 26 సినిమాలు..!

OTT Movie : మనుషుల్ని బంకర్లలో దాచి ఇదేం పాడు పని ? దిక్కుమాలిన డెత్ గేమ్స్… బెస్ట్ సర్వైవల్ మూవీ

OTT Movie : ఓరి నాయనో… మనుషుల్ని మటన్ లా ఆరగించే ఊరు… దీనికంటే నరకమే బెటర్

War 2 OTT : ‘వార్ 2’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ అప్పటి నుంచే..?

Big Stories

×