Viral Video : సాధారణంగా క్రికెట్ ని చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఆడుతుంటారు. కొందరూ గల్లీలలో ఆడితే.. మరికొందరూ గ్రౌండ్ లో ఆడుతుంటారు. కొందరూ రబ్బర్ బాల్, మరికొందరూ టెన్నీస్, మరికొందరూ కార్క్, మరికొందరూ గ్రేస్ బాల్ ఇలా బంతులు ఏవైనా వాళ్లు మాత్రం క్రికెట్ ఆడుతూనే ఉంటారు. చిన్న పిల్లలు గల్లీలలో ఆడితే.. మరికొందరూ గ్రౌండ్ లలో టోర్నమెంట్ లలో, ఇంకొందరూ స్టేడియాల్లో ఆడుతుంటారు. ఇలా రకరకాలుగా ఆడుతుంటారు. చిన్న గల్లీలు, పొలాలు, గ్రౌండ్ లలో, ఇంటర్నేషనల్ స్టేడియాల వరకు రకరకాలుగా ఆడుతుంటారు. ఇలా క్రికెట్ ఆటను పురుషులు, స్త్రీలు ఆడుతుంటారు. కానీ ఇక్కడ ఓ విచిత్ర సంఘటన చోటు చేసుకుంది. సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.
Also Read : Venkatesh – Dhoni : బాత్రూం వెళ్లి 2 నిమిషాల్లో ధోని గుండు తీసుకున్నాడు.. విక్టరీ వెంకటేష్ సంచలన కామెంట్స్ !
వర్షంలో సైతం.. ఏనుగు సిక్స్..
ఒక ఏనుగు వర్షం వస్తున్నా మరీ.. క్రికెట్ ఆడటం గొప్ప విషయం. ఒక అతను వర్షంలో ఏనుగు కి బాల్ విసిరివేయగానే బంతిని ఫోర్, సిక్సుల మాదిరిగా విసిరివేస్తోంది.ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. ఇలాంటి వీడియోలు ఈ మధ్య కాలంలో నిత్యం వైరల్ కావడం విశేషం. భారతీయులకు క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉంటుందో తెలిసిందే. గల్లీ చిన్నది అయినా.. పెద్దది అయినా బౌండరీ లైన్ లతో ఆటాడేస్తారు. వీరి జాబితాలో ఇప్పుడు ఓ ఏనుగు కూడా చేరింది. అదేంటి..? ఏనుగు క్రికెట్ ఆడటం ఏంటని ఆశ్చర్యపోతున్నారు. సోషల్ మీడియాలో ఈ వీడియోను 7 లక్షల మందికి పైగా వీక్షించారు. నెటిజన్లు ఈ వీడియో పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరూ వీడియోలు భలే క్యూట్ గా ఉందని.. ఏనుగు క్రికెట్ భలే ఆడుతోందని ముచ్చటపడుతోంది. కొందరూ మాత్రం దాన్ని హింసిస్తున్నారని.. అడవుల్లో వదలకుండా అలా కట్టేయడం మానవత్వం కాదన్నారు.
గాలిలో ఎగురుతున్న బంతి..
మరోవైపు కొందరూ ఏనుగు తొండంతో బ్యాట్ పట్టుకున్న ఏనుగు.. బంతిని విసురేస్తుంటే చూడటానికి భలో ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తోంది. ఏనుగు షాట్ కొట్టగానే బంతి గాలిలోకి వెళ్లి ఎగిరి బౌండరీలను దాటేస్తోంది. ఏనుగును క్రికెట్ టీమ్ లో చేర్చితే బౌండరీలే నెటిజన్లు పేర్కొన్నారు. ఏనుగు ఆట చూసి టీమిండియా ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, శుబ్ మన్ గిల్ వంటి ఆటగాళ్లు ఎవ్వరూ పనికి రారు.. ఈ ఏనుగు లాంటి షాట్లు క్రికెటర్లు కూడా ఆఢలేరని కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం టీమిండియా ఇంగ్లాండ్ తో 5 టెస్ట్ ల సిరీస్ లో భాగంగా ఇంగ్లాండ్ లో ఉంది. తొలి టెస్ట్ మ్యాచ్ లో టీమిండియా ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఇక రెండో టెస్టు జులై 02 నుంచి ప్రారంభం కానుంది. ఈ టెస్టులో టీమిండియా కీలక బౌలర్ బుమ్రా దూరం కానున్నట్టు తెలుస్తోంది. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులోకి కీలక బౌలర్ ఆర్చర్ ఎంట్రీ ఇవ్వనున్నట్టు సమాచారం.
?igsh=aG1rYm1mdDZhNHF4