Kannappa Tickets :మంచు విష్ణు (Manchu Vishnu) ప్రధాన పాత్రలో జూన్ 27వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోన్న చిత్రం కన్నప్ప (Kannappa). మంచు మోహన్ బాబు(Manchu Mohan Babu), అక్షయ్ కుమార్(Akshay Kumar), ప్రభాస్(Prabhas ), మోహన్ లాల్ (Mohan Lal), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal) వంటి భారీ తారాగణం ఈ సినిమాలో భాగమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, ట్రైలర్ ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకున్నా.. చాలామంది వీటిపై విమర్శలు గుప్పించారు. దీనికి తోడు బ్రాహ్మణ సంఘం నుండి వ్యతిరేకత ఎదుర్కోవడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి. అందుకు తగ్గట్టుగానే నిన్నటిక నిన్న రివిజన్ కమిటీ రిపోర్ట్ కూడా ఈ సినిమా నుండి దాదాపు 13 కీలక సన్నివేశాలను కట్ చేయమని ఆదేశాలు జారీ చేసింది.
అడుగడుగునా కన్నప్పకు అడ్డంకులే..
ఇలా వరుస ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ.. ఇప్పుడు టికెట్ ధరలు మరొకసారి అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. నిజానికి ఈ సినిమాలో కంటెంట్ పెద్దగా లేదని, హిందూ మతాన్ని, బ్రాహ్మణ సంఘాన్ని అవమానపరిచేలా కథను రూపొందించారనే వార్తలు వైరల్ అవుతున్న వేళ.. కనీసం ప్రభాస్, అక్షయ్ కుమార్ , మోహన్ లాల్ వంటి భారీ తారాగణం కోసమైనా సినిమా చూడాలని కొంతమంది ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ ఇప్పుడు ఉన్న టికెట్ ధరలు చూసి అందరూ వెనుకడుగు వేస్తున్నారని చెప్పవచ్చు.
ఆశ్చర్యపరుస్తున్న యూఎస్ఏ కన్నప్ప టికెట్ ప్రైస్..
అసలు విషయంలోకి వెళ్తే.. యూఎస్ఏ లో ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు ఇప్పుడు వైరల్ గా మారాయి. యూఎస్ఏ లో కన్నప్ప టికెట్ ప్రైస్.. టాక్స్ అలాగే ఇతర ఫీజులతో కలుపుకొని 23.69 డాలర్లుగా ప్రకటించారు. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఒక్కో టికెట్ ధర రూ.2,042 అన్నమాట. అసలే సినిమాను పట్టించుకోని ఆడియన్స్ కి.. ఇంత పెద్ద మొత్తంలో టికెట్ ప్రైస్ అనేసరికి చాలామంది వెనుకడుగు వేస్తున్నారు.పైగా అంత కాన్ఫిడెంట్ ఏంటి స్వామి అంటూ మంచు విష్ణు పై కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కనీసం ఆ స్టార్స్ కోసం సినిమా చూద్దామనుకున్న వారికి ఇప్పుడు ఈ టికెట్ ధరలు భారీ నిరాశ మిగిల్చాయి.
మీరేమైనా అవతార్ పార్ట్ 4 తీశారా?
అంతేకాదు ఈ ప్రైస్ కచ్చితంగా బుకింగ్స్ పైన ఎఫెక్ట్ చూపిస్తుందని కూడా కొంతమంది కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు మీరేమైనా అవతార్ పార్ట్ 4 చేసారా? అంత రేటు పెట్టడానికి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మరి యూఎస్ఏ లోనే ఈ రేంజ్ లో ధరలు ఉన్నాయి అంటే ఇక తెలుగు రాష్ట్రాలలో వీటి ధరలు ఇంకెంత ఉంటాయో చూడాలి. మరో మూడు రోజుల్లో ప్రేక్షకులు ముందుకు రాబోయే ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి.
కన్నప్ప ప్రమోషన్స్ కి రెబల్ స్టార్..
కన్నప్ప విషయానికి వస్తే.. విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో మరొకవైపు ప్రమోషన్స్ కూడా చేపట్టారు. అందులో భాగంగానే ప్రభాస్ కూడా ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ తన ఇంస్టాగ్రామ్ స్టోరీలో..” కన్నప్ప లాంటి భక్తుని త్యాగాన్ని తెలుసుకోవాలంటే ఈ సినిమాను తప్పకుండా చూడాలి” అంటూ పోస్ట్ చేశారు. ప్రాచీన భారతీయ భక్తి కథలకు ఆధారంగా తీసిన ఈ సినిమా విజయం సాధిస్తుందో లేదో తెలియదు కానీ ప్రభాస్ లాంటి ఒక స్టార్ ఈ సినిమా వెనుక నిలిచాడు అంటే కచ్చితంగా దేశవ్యాప్తంగా మంచి హైప్ రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.
ALSOR EAD:Panchayat – 4 OTT: వారం ముందే ఓటీటీలోకి..ఈ పొలిటికల్ కామెడీ సీరీస్ ఎక్కడ చూడొచ్చంటే?