Panchayat -4 OTT:ఈ మధ్యకాలంలో సినిమాల కంటే వెబ్ సిరీస్ లే ప్రేక్షకులను మరింత ఎక్కువగా ఆకట్టుకుంటున్నాయని చెప్పవచ్చు.. అందులో భాగంగానే సూపర్ హిట్ వెబ్ సిరీస్ గా నిలిచిన పంచాయత్(Panchayat )ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా భాషతో సంబంధం లేకుండా చాలామంది ఈ వెబ్ సిరీస్ ని ఆదరించారు. అలా దిగ్విజయంగా మూడు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. ఇప్పుడు నాలుగో సీజన్ కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. అయితే వారం రోజుల ముందుగానే ఓటీటీలోకి రావడంతో అభిమానులు మరింత ఎక్సైట్ ఫీలవుతున్నారు.
వారం రోజుల ముందే ఓటీటీ స్ట్రీమింగ్ వచ్చేసిన పంచాయత్ సీజన్ 4..
ఒక గ్రామంలో ఎన్నికల డ్రామా నేపథ్యంలో వచ్చే బలమైన ఎమోషన్, కామెడీతో ఈ సిరీస్ ను చాలా అద్భుతంగా తెరకెక్కించారు అయితే ఈరోజు అనగా జూన్ 24 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో ప్రకటించిన షెడ్యూల్ కంటే వారం రోజులు ముందే స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ హిందీ వెబ్ సిరీస్ ఈసారి మరింత ప్రత్యేకంగా సిద్ధం అయిందని తెలుస్తోంది. ఇకపోతే ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఈ వెబ్ సిరీస్ పంచాయతీ సీజన్ 4 ట్రైలర్ ను ఒక వారం క్రితం విడుదల చేసి.. ఇప్పుడు ఓటీటీ లోకి తెచ్చినట్టు నిర్మాతలు ధృవీకరించారు. ఇక ఈ వెబ్ సిరీస్ తో జితేంద్ర కుమార్ (Jitendra Kumar), నీనా గుప్తా (Neena Gupta) మరొకసారి ఆడియన్స్ ని మెప్పించడానికి వచ్చేశారు.
పంచాయత్ సీజన్ 4 వెబ్ సిరీస్ చిత్రీకరణ..
పంచాయత్ వెబ్ సిరీస్ విషయానికి వస్తే.. మొదటి మూడు సీజన్లు భారీ విజయాన్ని అందుకున్నాయి. ఇక ఇప్పుడు జితేంద్ర కుమార్ , నీనా గుప్తా, రఘువీర్ యాదవ్ వంటి వారు ఈ సూపర్ హిట్ రాజకీయ డ్రామా పంచాయత్ కొత్త సీజన్ తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ వెబ్ సిరీస్ ని మధ్యప్రదేశ్ లోని మహోరియా గ్రామంలో ఉన్న పంచాయతీ కార్యాలయంలో షూట్ చేయడం జరిగింది. అంతేకాదు గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రధాన భూషణ్ శిబిరాల మధ్య ఫైట్ ఇందులో మనం స్పష్టంగా చూడవచ్చు. ప్రముఖ డైరెక్టర్ దీపక్ కుమార్ మిశ్రా (Deepak Kumar Mishra) దర్శకత్వం వహించిన పంచాయత్ సీజన్ 4 వెబ్ సిరీస్ ఉత్తరప్రదేశ్ లోని ఫులేరా అనే ఒక దూర ప్రాంత గ్రామం చుట్టూ సాగుతుంది. అక్కడ పంచాయతీ కార్యదర్శిగా చేరిన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కథ కీలకమని చెప్పాలి. ఈ కొత్త సిరీస్ పంచాయతీ సీజన్ 3 క్లిఫ్ హాంగర్ నుండి మొదలయ్యి సచిన్, జితేంద్ర, నీనా, మంజు ఇలా అందరి చుట్టూ తిరుగుతుంది. పొలిటికల్ డ్రామాగా కామెడీతో పాటు లవ్ యాంగిల్ కూడా ఈ సిరీస్ మెప్పించేలా ఉందనే టాక్ ఇప్పుడు స్పష్టంగా వినిపిస్తోంది.
ALSO READ:Rashmika Mandanna: రష్మిక సక్సెస్ సీక్రెట్ దొరికేసిందోచ్.. దాని ప్రతిఫలమేనా?