Ar Muragadoss: తెలుగు ప్రేక్షకులకి పెద్దగా భాషతో సంబంధం ఉండదు. మంచి సినిమాలను ఎంకరేజ్ చేయాలి అనే ఉద్దేశం వాళ్ళకి ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. అందుకే చాలా డబ్బింగ్ సినిమాలు తెలుగులో మంచి సక్సెస్ అయ్యాయి. దర్శకుడు శంకర్, మణిరత్నం, ఏఆర్ మురుగదాస్ వంటి దర్శకులు తెలుగు ప్రేక్షకులు కూడా పరిచయం అంటే దానికి కారణం వాళ్ళ సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ అవ్వడం.
అయితే ఇప్పుడు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు వరుసగా ఫెయిల్ అవుతున్నారు. శంకర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పుడు అందరూ పాన్ ఇండియా సినిమాలు అని అంటున్నారు కానీ ఒకప్పుడు శంకర్ ఎంచుకునే కాన్సెప్ట్స్ పాన్ ఇండియా రేంజ్ లో ఉండేవి. ఆ రోజుల్లోనే రోబో లాంటి సినిమాను డీల్ చేశాడు అంటే అది మామూలు విషయం కాదు. ఇంక మణిరత్నం విషయానికొస్తే అందరూ లవ్ గురు అంటూ అతనిని పొగుడుతారు. కమర్షియల్ ఎలిమెంట్స్ తో సమాజానికి మెసేజ్ ఇవ్వడంలో ఏఆర్ మురగదాస్ సినిమాలు ఉంటాయి.
ప్రస్తుతం ఈ ముగ్గురు దర్శకులు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీ వద్ద చతికిల పడుతున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఇండియన్ 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన సక్సెస్ అందుకోకపోగా భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. అసలు శంకర్ ఇటువంటి సినిమాను తెరకెక్కించాడా అనిపించింది. అలానే ఎన్నో అంచనాల మధ్య వచ్చిన గేమ్ చేంజెర్ సినిమా కూడా భారీ లాస్.
ఇంక మణిరత్నం విషయానికి వస్తే. ఒక లవ్ స్టోరీని డీల్ చేయగలగటం అతనికి మాత్రమే సొంతం అనిపించేలా ఆయన సినిమాలు ఉండేవి. కమల్ హాసన్ హీరోగా మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ అనే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గా మిగిలిపోయింది. నాయకుడు కాంబినేషన్ మళ్ళీ మొదలవుతుంది అంటే అందరిలో బీభత్సమైన అంచనాలు ఉండేవి. వాటన్నింటినీ కూడా సక్సెస్ఫుల్ గా నాశనం చేశాడు మణిరత్నం.
ఏఆర్ మురుగదాస్ తీసిన రమణా సినిమా తెలుగులో ఠాగూర్ పేరుతో రీమేక్ అయింది. మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో ఈ సినిమా ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. వివి వినాయక్ కూడా అంతే అద్భుతంగా డీల్ చేశాడు. అంత మంచి కథ రాసినందుకు స్టాలిన్ సినిమాకు దర్శకుడుగా అవకాశం కూడా ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి. ఆ సినిమా ఊహించిన సక్సెస్ సాధించలేదు. ఇక మురగదాస్ కూడా హిట్ సినిమా చేసి చాలా రోజులు అయిపోయింది. బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కం బ్యాక్ ఇస్తాడు అని అందరూ అనుకున్నారు. ఇక లేటెస్ట్ గా వచ్చిన మదరాసి సినిమా కూడా డిజాస్టర్ అని తేలిపోయింది.
ఎన్నో నమ్మకాలు పెట్టుకున్న ఈ దర్శకులు వర్ష ఫెయిల్యూర్స్ ఇవ్వడంతో చాలామంది తమిళ్ అభిమానులే ఇంక రిటైర్ ఇచ్చేయండి అంటూ కామెంట్ చేయడం మొదలుపెట్టారు.
Also Read: 17 Years of Nani : మామూలు జర్నీ కాదు బాసు, ఈ తరానికి నువ్వే బాసు